DGP Dwarakathirumala Rao Comments on Police System:గత ప్రభుత్వ హయాంలో పోలీసులు కూడా సరిగ్గా విధులు నిర్వహించలేదని డీజీపీ ద్వారకా తిరుమల రావు అన్నారు. గతంలో ఓ పార్టీ ఆఫీస్‌పై దాడి జరిగినా పోలీసులు బాధ్యతగా వ్యవహరించలేదని భావప్రకటనాస్వేచ్ఛ వల్ల దాడి జరిగినట్లు పోలీసులు నమోదు చేసుకున్నారని వెల్లడించారు.
అనంతపురం పోలీస్ శిక్షణ కేంద్రంలో డీఎస్పీల పాసింగ్ ఔట్ పెరేడ్‌కు ద్వారకతిరుమల రావు హాజరయ్యారు. పార్టీ ఆఫీసుపై దాడి జరిగితే ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదని తెలిపారు. మూడేళ్ల తర్వాత చర్యలు ఏంటని ప్రశ్నించడం సరికాదని తప్పు జరిగితే 30 ఏళ్ల తర్వాత అయినా చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేశారు. కేరళలో తప్పు జరిగిన 20 ఏళ్ల తర్వాత ఓ ఐపీఎస్‌కు శిక్ష విధించారని అన్నారు. న్యాయం చేసేందుకే చట్టాలు, కోర్టులు ఉన్నదని డీజీపీ తెలిపారు.
గత ఐదేళ్లలో తప్పులు జరిగిన విషయం వాస్తవం:వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కొన్ని తప్పులు జరిగాయని ప్రస్తుతం వాటిని సరిదిద్దడంపై దృష్టిపెట్టినట్లు డీజీపీ ద్వారక తిరుమలరావు స్పషం చేశారు. రాష్ట్రంలో గత ఐదేళ్లలో తప్పులు జరిగిన విషయం వాస్తవమని ప్రస్తుతం ఆ తప్పులను సరిదిద్దడంపై దృష్టి పెట్టామని వివరించారు. అంతే కాకుండా పోలీసు వ్యవస్థను ప్రజల పట్ల బాధ్యతయుతంగా మార్చడంపైనే దృష్టి సారించినట్లు చెప్పారు. మహిళలు, పిల్లల రక్షణతో పాటు మానవహక్కులకు తొలి ప్రాధాన్యత ఇచ్చేలా పోలీసు వ్యవస్థను తీర్చిదిద్దేపని చేస్తున్నామని స్పష్టం చేశారు. ఐజీ సంజయ్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై మీడియా ప్రతినిధులు అడిగినదానికి సమాధానంగా సంజయ్‌పై ప్రభుత్వం విచారణ చేస్తోందని నివేదిక తొలుత జీఏడీకి వెళ్లి ఆ తరువాత తమకు వస్తుందని డీజీపీ వెల్లడించారు.
భూములు లాక్కొని సొంత ఆస్తి మాదిరిగా కొట్టుకుంటున్నారు: పవన్ కల్యాణ్