ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాలన ఎలా ఉండకూడదో గత ఐదేళ్లలో చూశాం - చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరం: పవన్‌ కల్యాణ్ - Pawan on Collectors Conference - PAWAN ON COLLECTORS CONFERENCE

Collectors Conference in AP : రాజ్యాంగం ఎంత గొప్పగా ఉన్నా దాన్ని అమలుపరిచేవారు సరిగా లేకపోతే ఆ వ్యవస్ధ పనిచేయదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. బలహీనమైన రాజ్యాంగం ఉన్నా ప్రజల కోసం పనిచేసేవారు ఉంటే ఆ వ్యవస్ధ ఖచ్చితంగా పని చేస్తుందని చెప్పారు. చంద్రబాబు నుంచి పాలన అనుభవం నేర్చుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని పవన్ వివరించారు.

Pawan Speech in Collectors Conference
Pawan Speech in Collectors Conference (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 5, 2024, 2:27 PM IST

Pawan Speech in Collectors Conference : గత సర్కార్​లో తాము అనేక బాధలు, ఇబ్బందులు, అవమానాలకు గురయ్యామని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. బలోపేతమైన వ్యవస్థలను అప్పట్టి ప్రభుత్వం ఆటబొమ్మలుగా మార్చిందని ఆరోపించారు. అందుకే ఈ ప్రభుత్వాన్ని స్ధాపించడానికి, వ్యవస్థలను బలోపేతం చేసి కాపాడడానికి కారణం అయిందని చెప్పారు. ఈ క్రమంలోనే 97 శాతం స్ట్రైకింగ్ రేట్​తో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడిందని గుర్తుచేశారు. వెలగపూడిలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు.

Pawan Fires on YSRCP : ఎన్డీయే ప్రభుత్వం అకౌంటబులిటీ ఉన్న ప్రభుత్వమని పవన్ కల్యాణ్ తెలిపారు. పాలకులు ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలని చెప్పారు. పాలన ఎలా ఉండకూడదో గత ఐదేళ్ల పాలన తెలియజేసిందని వివరించారు. మరోవైపు విభజన వల్ల అందరం అవమానాలు పడ్డామని, చివరకు బోర్డర్ దాటడానికి కూడా ఇబ్బందులకు గురి చేశారన్నారు. వాటన్నింటిని లక్ష్య పెట్టకుండా ముందకు వెళ్లామని వెల్లడించారు. ఇప్పుడు సీఎం చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి ఎంతో ఉపయోగ పడుతుందని పవన్ కల్యాణ్ చెప్పారు.

"రాజ్యాంగం ఎంత గొప్పగా ఉన్నా దాన్ని అమలు పరిచేవారు సరిగా లేకపోతే ఆ వ్యవస్ధ పనిచేయదు. బలహీనమైన రాజ్యంగం ఉన్నా ప్రజల కోసం పనిచేసేవారు ఉంటే ఆ వ్యవస్ధ ఖచ్చితంగా పనిచేస్తుంది. చంద్రబాబు నుంచి పాలన అనుభవం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే ముఖ్యమంత్రి చెబుతున్న నైపుణ్య గణనకు అధికారుల సలహాలు సూచనలు అవసరం." - పవన్ కల్యాణ్, ఉప ముఖ్యమంత్రి

ఉపాధి హామీ గ్రామసభలు : గ్రామాలను బలోపేతం చేసే దిశగా ముందడుగులు వేస్తున్నామని పవన్ కల్యాణ్ తెలిపారు. తన శాఖల్లో చేపట్టబోయే పనులకు అధికారులు సాకారం అందించాలని కోరారు. రాష్ట్రం మొత్తం మీద ఒకే రోజు 13326 గ్రామ పంచాయితీల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి రిజల్యూషన్లు చేస్తామన్నారు. ఈ ఏడాదిలో 5.40 కోట్ల గృహాలకు తాగునీరు ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నామని పవన్ కల్యాణ్ వివరించారు.

కొత్త రోడ్లు వేయడం, ఉన్న రహదారులను బాగు చేయడం తమ ప్రభుత్వ లక్ష్యమని పవన్ కల్యాణ్ చెప్పారు. అదేవిధంగా గుంటూరు, కర్నూలు, పశ్చిమ గోదావరిలో ఫారెస్ట్ కవర్ పెంచే ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు. పిఠాపురంలో లిక్విడ్ వేస్ట్ మేనేజ్​మెంట్ ప్రాజెక్టును పైలెట్​గా చేపట్టనున్నట్లు పవన్ కల్యాణ్ వెల్లడించారు.

సచివాలయానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్- అధికారులతో సమీక్షలు

స్ఫూర్తి ప్రదాతల పేర్లతో ప్రభుత్వ పథకాల అమలు హర్షణీయం- పవన్‌ - Pawan on Govt Schemes Names

ABOUT THE AUTHOR

...view details