Deputy CM Pawan Kalyan Selfie with Daughter Adya:డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన కుమార్తె ఆద్యతో కలిసి దిగిన సెల్ఫీ ఆసక్తికరంగా మారింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కాకినాడలో జరిగిన కార్యక్రమంలో పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో పాల్గొన్నారు. వేడుకలకు పవన్ కల్యాణ్, రేణుదేశాయ్‌ల కుమార్తె ఆద్య కూడా వచ్చింది. వేదికపై తన తండ్రి పవన్‌తో కలిసి సెల్ఫీ దిగింది. ఆ సెల్ఫీ నెట్టింట వైరల్‌గా మారింది. ఆ తర్వాత కుమార్తెతో డిప్యూటీ సీఎం సెల్ఫీ తీసుకుంటున్న దృశ్యాలు షేర్ చేస్తూ రేణూ దేశాయ్ ఆసక్తికర పోస్ట్ పెట్టారు.
తండ్రితో కలిసి స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనాలని ఉందని ఆద్య అడిగిందని ఆ విధంగా ఆయనతో కాసేపు గడిపే అవకాశం ఆద్యకు వచ్చిందని రేణు తన పోస్టులో పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ ప్రజాజీవితంలో చాలా బిజీగా ఉన్న విషయాన్నీ ఆమె ప్రస్తావించారు. ప్రజల కోసం తన తండ్రి చేస్తున్న కార్యక్రమాలపై కుమార్తె ఆద్య సంతోషం వ్యక్తం చేసినట్లు రేణు తెలిపారు.