ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నేనే మీ వద్దకు వస్తా - త్వరలో జిల్లాల వారీగా పర్యటిస్తా: పవన్ కళ్యాణ్ - Jana Sena leader Pawan Kalyan - JANA SENA LEADER PAWAN KALYAN

Deputy CM Pawan Kalyan: రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. తనను నేరుగా కలిసి అభినందించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆశిస్తున్నారని, త్వరలోనే వారందరినీ జిల్లాలవారీగా కలసి మాట్లాడాననున్నట్లు వెల్లడించారు.

Deputy CM Pawan Kalyan
Deputy CM Pawan Kalyan (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 13, 2024, 9:21 PM IST

Deputy CM Pawan Kalyan: జనసేన, టీడీపీ, బీజేపీలు కూటమిగా పోటీచేసి ఏపీలో అఖండ విజయాన్ని స్వంతం చేసుకున్నాయి. కేంద్రంలో సైతం ఏన్డీఏ కూటమికి, టీడీపీ, జనసేన మద్దతు అవసరం పడటంతో, జాతీయ స్థాయిలో ఇరు పార్టీలకు ప్రాధాన్యత ఏర్పడింది. అందులో భాగంగా కూటమి ఏర్పాటుకు ప్రధాన పాత్రవహించిన పవన్ కల్యాణ్​కు సైతం చంద్రబాబు ప్రాధాన్యతను ఇస్తున్నారు. పవన్ అభిష్టం మేరకు డిప్యూటీ సీఎం పదవి కేటాయించారు. దీంతో జనసేన నేతలు, కార్యకర్తలు ఆనందోత్సాహాల్లో మునిగితేలుతున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్​ను కలిసి తమ సంతోషాన్ని వ్యక్తపరచడానికి ఆయన ఇంటికి, పార్టీ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన జనసేనాని కీలక నిర్ణయం తీసుకున్నారు. తనను కలవడానికి ఇబ్బందులు పడవద్దని, తానే త్వరలో జిల్లాల్లో పర్యటిస్తానని వెల్లడించారు.


పెద్దాయన వచ్చారు, పండుగ తెచ్చారు- సీఎం చంద్రబాబుకు రైతుల ఘనస్వాగతం - Farmers Grand Welcome to CBN

రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఈ సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలిపిన వారందరికి పవన్‌ కళ్యాణ్‌ ధన్యవాదాలు తెలిపారు. నాయకులు, మేధావులు, నిపుణులు, సినీ రంగంలో ఉన్నవారు, యువత, రైతులు, ఉద్యోగ వర్గాలు, మహిళలు అభినందనలు తెలిపారన్నారు. జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, జన సైనికులు ఆనందంతో వేడుకలు చేసుకున్నారని చెప్పారు. తనను నేరుగా కలిసి అభినందించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆశిస్తున్నారని, త్వరలోనే వారందరినీ జిల్లాలవారీగా కలసి మాట్లాడాననున్నట్లు వెల్లడించారు.

తన పర్యటనకు సంబంధించి త్వరలోనే షెడ్యూలు ప్రకటిస్తానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అభినందనలు తెలియచేయడానికి వచ్చేవారు పూల బొకేలు, శాలువాలు తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం శాసన సభ సమావేశాల్లో పాల్గొంటానని తెలిపారు. అనంతరం తనను అఖండ మెజారిటీతో గెలిపించిన పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తానన్నారు. ఈ నెల 20వ తేదీ తరవాత పిఠాపురం నియోజకవర్గంలో కార్యకర్తలను కలవనున్నట్లు చెప్పారు. అనంతరం దశలవారీగా అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తానని ప్రకటించారు.


పార్టీ సమావేశంలో జగన్ షాకింగ్​ కామెంట్స్- 'కళ్లు మూసుకుంటేనే 11సీట్లు!' - Ys Jagan Viral Video

ABOUT THE AUTHOR

...view details