తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రజావాణి'కి వచ్చిన ప్రతి ఫిర్యాదుకు పరిష్కారం చూపాలి : భట్టి విక్రమార్క - Deputy CM Bhatti Prajavani Review

Deputy CM Bhatti Prajavani Review : ప్రజావాణి ద్వారా పరిష్కరించడానికి అవకాశం ఉన్న ప్రతి ఫిర్యాదుకు పరిష్కారం చూపాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులకు స్పష్టం చేశారు. ప్రజావాణి పని తీరుపై ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రణాళికా శాఖ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ విధానాల్లో ఏవైనా మార్పులు చేయాలని ప్రజావాణి అధికారులు భావిస్తే వాటిని రాతపూర్వకంగా ప్రభుత్వానికి నివేదించాలని తెలిపారు.

Deputy CM Bhatti Prajavani Review
Deputy CM Bhatti Prajavani Review (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Aug 4, 2024, 10:08 PM IST

Deputy CM Bhatti Vikramarka Review On Prajavani : రేషన్ తీసుకునేందుకు, సంక్షేమ పథకాలు పొందేందుకు వేర్వేరుగా గుర్తింపు కార్డులు ఇవ్వాలనే అంశంపై చర్చ జరుగుతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. కొత్త పింఛన్లను సైతం త్వరలో మంజూరు చేసే అవకాశం ఉందని వెల్లడించారు. సచివాలయంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డితో కలిసి ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై సమీక్ష నిర్వహించారు.

ప్రజావాణి ద్వారా పరిష్కరించడానికి అవకాశం ఉన్న ప్రతి ఫిర్యాదుకు పరిష్కారం చూపాలని అధికారులకు స్పష్టం చేశారు. ప్రజావాణి పనితీరుపై ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఫిర్యాదుదారు తన సమస్య పరిష్కారం ఎంతవరకు వచ్చిందో తెలుసుకునేందుకు ఏ రకమైన వ్యవస్థ ప్రజావాణిలో ఉన్నదనే అంశంపై డిప్యూటీ సీఎం ఆరా తీశారు.

రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం సబ్ కమిటీ ఏర్పాటు: ఫిర్యాదు మొదట దరఖాస్తు చేసుకున్న సందర్భంలో ఎస్ఎంఎస్ పంపిస్తామని, సమస్య పరిష్కారం అయిన తర్వాత చివరగా మరో ఎస్ఎంఎస్ మొబైల్​కు పంపిస్తామని ప్రజావాణి నోడల్ అధికారి దివ్య దేవరాజన్ వివరించారు. ఫిర్యాదు పరిష్కారం ఏ దశకు చేరిందనే అంశం తెలుసుకునే వ్యవస్థ ప్రస్తుతం లేదని, ఆ సౌకర్యాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. కొత్త రేషన్ కార్డులు, పింఛన్​, ధరణికి సంబంధించిన ఫిర్యాదులు పెద్ద సంఖ్యలో వస్తున్నట్టు నోడల్ అధికారి దివ్య దేవరాజన్ సమావేశంలో వివరించగా, రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం సబ్ కమిటీ ఏర్పాటు చేసిందని, త్వరలో నిర్ణయం తీసుకొని కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు.

Prajavani Grievance Status : మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు ఇస్తే ప్రయోజనం లేదని, వారికి శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని, అందుకు అవసరమైతే ఆర్థిక సాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. అన్ని ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ డెస్క్​లను బలోపేతం చేసేలా చర్యలు చేపడితే సీఎంఆర్ఎఫ్​కు సంబంధించి ఫిర్యాదులు తగ్గిపోతాయని డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు.

జీరో విద్యుత్ బిల్లు దరఖాస్తులు తీసుకునే మండల స్థాయి సిబ్బందికి శిక్షణ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని భట్టి విక్రమార్క అధికారులకు తెలిపారు. బిహార్​తో పాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యల పరిష్కారానికి ఏ పద్ధతులు అవలంభిస్తున్నాయో ఉప ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు విజయవంతంగా పూర్తి చేసిన కొన్ని కేసుల గురించి సమావేశంలో నోడల్ అధికారి దివ్య దేవరాజన్ వివరించారు.

తన వ్యవసాయ భూమిలో విద్యుత్ వైర్లు వేలాడుతున్న విషయాన్ని మహబూబ్​నగర్​కు చెందిన రైతు ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా, స్థానిక విద్యుత్ అధికారులు 2 రోజుల్లోనే పరిష్కరించడంతో ఆనందంగా స్పందిస్తూ అధికారులను అభినందిస్తూ ఆ రైతు అధికారులకు లేఖ రాసిన విషయాన్ని అధికారులు సమావేశంలో ప్రస్తావించారు. ప్రజావాణి విభాగంలో పని చేసేందుకు పూర్తి స్థాయి సిబ్బందిని కేటాయించాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని నోడల్ అధికారి దివ్య దేవరాజన్​ కోరగా, డిప్యూటీ సీఎం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

తెలంగాణలో జాబ్​ క్యాలెండర్​ విడుదల - ఏ నోటిఫికేషన్లు ఎప్పుడొస్తాయంటే? - Telangana Job Calendar 2024

'గత ప్రభుత్వం మాదిరి మేము గొప్పలకు పోలేదు - 100 శాతం వాస్తవ బడ్జెట్‌ను ప్రవేశపెట్టాం' - Deputy CM Bhatti Speech in Assembly

ABOUT THE AUTHOR

...view details