Deputy Chief Minister Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు శాఖలు కేటాయించిన అనంతరం ఆయన తనదైన స్టైల్లో ముందుకు సాగుతున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తనకు కేటాయించిన శాఖలపై పవన్ స్పందించారు. తన మనస్సుకు దగ్గరైన శాఖలను కేటాయించినందుకు చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలిపారు. అయితే, శాఖలు కేటాయించినప్పటికీ, జనసేన మంత్రులకు సంబంధించిన ఛాంబర్ల కేటాయంపులు జరగలేదు. తాజాగా జనసేనకు చెందిన మంత్రులకు ఛాంబర్లు కేటాయిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
వైఎస్సార్సీపీ లెక్కలు తేల్చిన పవన్ - ఏపీ రాజకీయాల్లో పెను తుపాన్ - Sensation in AP Politics
సచివాలయం 2వ బ్లాక్ లో జనసేన మంత్రులకు ఛాంబర్లు ( Ministers Chambers ) కేటాయించారు. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోసం రెండో బ్లాక్‌లోని మొదటి అంతస్తులో 212 రూమ్‌ను అధికారులు ముస్తాబు చేస్తున్నారు. పవన్‌తో పాటు జనసేనకు చెందిన మరో ఇద్దరి మంత్రుల ఛాంబర్లు కూడా అదే అంతస్తులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పక్కపక్కగా పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ ఛాంబర్లు ఉండనున్నాయి. ఎల్లుండి తన ఛాంబర్లో పవన్‌కల్యాణ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ ఈనెల 19న పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. జనసేన పార్టీ కార్యాలయం ఈ విషయాన్ని ప్రకటించింది. ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కల్యాణ్.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను పర్యవేక్షిస్తారు. ఈనెల 12న పవన్ కల్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఆయన అభిష్టం మేరకు శాఖలు కేటాయించారు.