Dekho Apna Desh 2024 Voting: దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో సౌకర్యాలు మెరుగుపరచటం, కొత్త ప్రాంతాలను గుర్తించటం కోసం కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నా దేశ్ పీపుల్ ఛాయిస్ 2024’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పర్యాటక కేంద్రాల్లో చేయాల్సిన అభివృద్ధి పనులు, పర్యాటకులకు కల్పించాల్సిన సౌకర్యాల గురించి తెలుసుకునేందుకు దీన్ని ప్రారంభించింది. హైదరాబాద్‌కు సంబంధించి 15 పర్యాటక ప్రాంతాలను ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’లో పొందుపరిచారు.
Dekho Apna Desh People Choice 2024 : సందర్శకులు ఆయా ప్రాంతాలకు సందర్శించి అక్కడ ఉన్న లోపాలను, అద్భుతాలను ఓటింగ్ రూపంలో తెలియజేయాలి. ఇతర పర్యాటకులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించాలో పొందుపరచవచ్చు. ఇలా ఓటేసిన వారికి ప్రభుత్వం అప్రిసియేషన్ సర్టిఫికేట్‌ను ప్రభుత్వం జారీ చేయనుంది. ఓట్ వేసేందుకు ఈ నెల 30 వరకు అవకాశం కల్పించాలి. దీని కోసం https://innovateindia.mygov.in/dekho-apna-desh/ వెబ్‌సైట్‌ను సందర్శించాలి. వెబ్‌పేజ్ ఓపెన్ చేసిన మీరు సందర్శించిన ప్రదేశానికి అనుగుణంగా 5కేటగిరీలుగా విభజించారు. అందులో ఏదో ఒకటి ఎంచుకుని, వాటి కింద 'ఓట్ నౌ ఆప్షన్' ని క్లిక్ చేయాలి.
మేడారం పరిధిలో ఆ పర్యాటక ప్రాంతాలు మూసివేత - ఏ రోజున తెరుచుకుంటాయంటే?
Tourist Voting Process in Dekho Apna Desh : పర్యాటకులు తమ సమాచారాన్ని ఇచ్చి రిజిస్టర్ చేసుకుని అనంతరం లాగిన్ అవ్వాలి. ఆ తరవాత ‘నేమ్ ఆఫ్ ఎట్రాక్షన్’ అనే బాక్స్‌లో తెలంగాణ అని టైప్ చేస్తే అబిడ్స్ స్ట్రీట్, పోచమ్మ ఆలయం, ఆలిసాగర్ డ్యాం, అనంతగిరి, ఆంజనేయ స్వామి దేవాలయం, ఆర్కియాలజీ మ్యూజియం, అయ్యప్ప స్వామి ఆలయం, బాసర ఫోర్ట్, చార్మినార్, ఫలక్‌నుమా ప్యాలెస్, గోల్కొండ కోట, జుమ్మేరాత్ బజార్, కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ ఉద్యానవనం, రామప్ప దేవాలయం ఇతర పర్యాటక ప్రాంతాలపేర్లు కనిపిస్తాయి. వీటితో పాటు దేశంలో ఉన్న పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలు, సంస్కృతిని తెలియజేసే ప్రదేశాలు ఇతర ప్రాంతాలు ఉన్నాయి. అందులో మీరు సందర్శించిన ప్రదేశాన్ని ఎంచుకోవాలి.