తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ గ్రామాలే వన్య మృగాల ఆవాసం - కారణం తెలిస్తే షాక్! - ANIMALS INTO VILLAGES IN NIZAMABAD

అటవీ సమీప గ్రామాల్లోకి పులులు, ఎలుగు బంట్లు - రోజురోజుకి పెరుగుతున్న దాడులు - సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది

Deforestation is Causing Animals to Enter Villages
Deforestation is Causing Animals to Enter Villages (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 8, 2025, 12:57 PM IST

Deforestation is Causing Animals to Enter Villages :పెరుగుతున్న జనాభా, అడవుల కొట్టివేతలు ఫలితంగా జంతవులు జనవాసల్లోకి వచ్చేందుకు కారణమవుతున్నాయి. అటవీ ప్రాంతంలో సంచరించాల్సిన వన్యప్రాణలు గ్రామాల్లోకి వచ్చి దాడులకు పాల్పడుతుండటంతో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ఎటువైపు నుంచి ఏ జంతువు వచ్చి మీద పడుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి ఏర్పుడుతుంది. నిజామాబాద్​ జిల్లాలో ఇటీవల చిరుతలు, ఎలుగుబంట్లు పశువులు, మనుషులపై దాడులు చేయడం ఆందోళన కలిగిస్తోంది.

నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్ డివిజన్లలో 86వేల హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. నిజామాబాద్​ ఉత్తరం, దక్షిణం, ఇందల్​వాయి, ఆర్మూర్​, సిరికొండ, వర్ని రెంజ్​, కమ్మర్​పల్లిలు ఉన్నాయి. నిజామాబాద్ దక్షిణం, సిరింకొండ, కమ్మర్​పల్లి, సిరికొండ, ఇందల్​వాయి ప్రాంతాల్లో చిరుతపులులు, ఎలుగుబంట్ల సంఖ్య అధికం. ఈ ప్రాంతాల్లో వన్యప్రాణుల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన మూడు సంవత్సరాల్లో చిరుతలు 86, ఎలుగుబంట్ల సంఖ్య 49కి చేరింది. అటవీ సమీప ప్రాంతాల్లో ఇవి సంచరించి స్థానిక ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

  • గతేడాది డిసెంబరు 17న ఎడపల్లి మండలం కుర్నాపల్లిలో చెరువు కట్ట వద్దకు వెళ్లిన బాలుడిపై ఎలుగుబంటి దాడి చేసి గాయపర్చింది.
  • నందిపేట్​ సీహెచ్​ కొండూరు అటవీ ప్రాంతంలో చిరుత మేకపై పంజా విసిరి చంపేసింది. దీంతో అటవీ అధికారులు ఆ ప్రాంతంలో ట్రాప్ కెమెరా ఏర్పాటు చేశారు.

అధికారులు చేపట్టాల్సిన చర్యలు : వన్యప్రాణులు అటవీ ప్రాంతాన్ని దాటి బయటకు రాకుండా అటవీ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ప్రధానంగా శాకాహార జంతువుల ఆహార అవసరాలకు అనుగుణంగా గడ్డి క్షేత్రాలు, పండ్ల మొక్కలను పెంచేందుకు ప్రయత్నించాలి. ఈ చర్యలతో శాకాహార జంతువులు పెరిగి మృగాలకు ఆహారంగా మారుతాయి. అప్పుడే ఇవి జనావాసాల్లోకి రాకుండా ఉంటాయి.

  • అటవీ సమీప ప్రాంత ప్రజలు ఉదయం, సూర్తాస్తమయాల్లో అటువైపు సంచరించొద్దు.
  • ఎలుగుబంట్ల జనావాస ప్రాంతాల్లోకి వస్తే శబ్దాలు చేయడం, మంటను చూపిస్తే అవి భయపడి అక్కడ నుంచి వెళ్లిపోతాయి.
  • చిరుతలు గ్రామాలవైపు ఎక్కువగా కుక్కలను తినేందుకు వస్తుంటాయి. వాటి ఆనవాళ్లు కనిపిస్తే వెంటనే అటవీ అధికారులకు సమాచారం ఇవ్వాలి.
  • ముఖ్యంగా ఎండా కాలంలో నీరు దొరక్కపోతే సమీప చెరువులు, వాగుల దగ్గరికి వస్తుంటాయి.
  • అటవీ ప్రాంతాల్లోకి ఒంటరిగా వెళ్లకూడదు. గుంపుగా వెళ్లాలి.

ABOUT THE AUTHOR

...view details