తెలంగాణ

telangana

ETV Bharat / state

కంటోన్మెంట్​ ప్రాంతంలో ట్రాఫిక్​ కష్టాలకు ఇక చెల్లు - 2 స్కై వేల నిర్మాణానికి కేంద్రం పచ్చజెండా - 2 skyways in Cantonment

Defense Ministry Permission For Skyways : సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ మీదుగా వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్‌ కష్టాలు తొలగిపోనున్నాయి. కంటోన్మెంట్‌ పరిధిలో రెండు స్కైవేల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర రక్షణ శాఖ సమాచారం అందించింది. భూములు ఇచ్చేందుకు రక్షణ శాఖ అంగీకరించడంపై సీఎం రేవంత్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. సహకరించిన ప్రధాని మోదీ, రక్షణ శాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

Skyways Constructions In Telangana
Defense Ministry Permission For Skyways

By ETV Bharat Telangana Team

Published : Mar 2, 2024, 7:44 AM IST

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లో 2 స్కైవేల నిర్మాణానికి కేంద్రం ఆమోదం - ఆ ప్రాంతాల వారికి తగ్గనున్న ట్రాఫిక్​ కష్టాలు

Defense Ministry Permission For Skyways : సికింద్రాబాద్‌ నుంచి కంటోన్మెంట్‌ ప్రాంతం మీదుగా రామగుండం, నాగ్‌పుర్‌ జాతీయ రహదారుల వైపు ఎలివేటెడ్‌ కారిడార్ల నిర్మాణానికి మార్గం సుగమమైంది. హైదరాబాద్‌ - కరీంనగర్‌ రాజీవ్‌ రహదారి హైదరాబాద్‌ - నాగ్‌పూర్‌ జాతీయ రహదారిపై ఎలివేటెడ్‌ కారిడార్లకు కేంద్ర రక్షణ శాఖ అనుమతిచ్చింది. జూబ్లీ బస్‌స్టేషన్‌ నుంచి హకీంపేట ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ వరకు దాదాపు 11 కిలోమీటర్ల మేర ఆరులేన్ల ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణం కోసం 83 ఎకరాలు కేటాయించాలని కేంద్రాన్ని 2018లో రాష్ట్ర ప్రభుత్వం కోరింది.

ప్రపంచంలోనే డేంజరస్ స్కైవే- 59ఏళ్ల తర్వాత రీఓపెన్​

CM Revanth Reddy : హైదరాబాద్‌-నాగ్‌పూర్‌ జాతీయ రహదారిపై ప్యారడైజ్‌ నుంచి ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ORR) జంక్షన్‌ వరకు నాలుగు చోట్ల ఎంట్రీ, ఎగ్జిట్‌లతో దాదాపు 18 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్‌ కారిడార్‌ సహా పైనుంచి మెట్రో రైల్‌ నిర్మాణం వెళ్లేలా మొత్తం 56 ఎకరాలు కోరారు. పెండింగ్‌లో ఉన్న రక్షణ శాఖ భూముల బదిలీని త్వరగా చేయాలని జనవరి 5న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) దిల్లీ వెళ్లినప్పుడు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కోరారు. పైవంతెనల నిర్మాణంతో ముడి పడిన సమస్యలపై లేఖ అందించడంతో సమస్యకు త్వరితగతిన పరిష్కారం లభించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది.

Uppal Skywalk Inauguration : భాగ్యనగరం సిగలో మరో మణిహారం.. నేడే ఉప్పల్​ స్కైవాక్​ ప్రారంభం

Skyways Constructions In Telangana : రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంతో వ్యూహాత్మకంగా వ్యవహరించి, సమస్యను పరిష్కరించినట్లు గుర్తు చేశారు. పార్టీలు, సిద్ధాంతాలు వేరైనా రాష్ట్రం కోసం కేంద్రంతో స్నేహ సంబంధాలను కొనసాగిస్తామన్న రేవంత్‌రెడ్డి, త్వరలోనే ఎలివేటెడ్‌ కారిడార్ల నిర్మాణాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. స్కైవేల నిర్మాణానికి భూముల బదిలీ సహా ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి అనుమతిచ్చిందుకు ప్రధాని మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు రేవంత్‌ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Reduce Hyderabad Traffic : రెండు స్కైవేల నిర్మాణంతో జిల్లాల నుంచి హైదరాబాద్‌ (Hyderabad) వచ్చే వారి ట్రాఫిక్ కష్టాలు తీరడంతో పాటు వేగంగా ప్రయాణించేందుకు దోహదపడుతుందని కంటోన్మెంట్ సీఈవో మధుకర్‌ నాయక్‌ తెలిపారు. కేంద్ర రక్షణ శాఖ ఆమోదం లభించడంతో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రాజీవ్ రహదారి, మేడ్చల్ హైవేకు ఇరువైపులా ఉన్న వ్యాపార సముదాయాలు తొలగించి పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు. రహదారికి ఇరువైపులా 60 మీటర్ల వరకు విస్తరణ చేపడతామన్న ఆయన హెచ్​ఎం​డీఏ, రక్షణ శాఖ అధికారులతో కలిసి నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తామని పేర్కొన్నారు. ఎలివేటేడ్‌ కారిడార్లకు అనుమతి రావడంపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ సంతోషం వ్యక్తం చేశారు.

"రెండు స్కైవేల నిర్మాణంతో జిల్లాల నుంచి హైదరాబాద్​ వచ్చే వారి ట్రాఫిక్​ కష్టాలు తీరడంతో పాటు వేగంగా ప్రయాణించేందుకు దోహదపడుతుంది. ఈ నిర్మాణాలకు కేంద్ర రక్షణ శాఖ ఆమోదం లభించింది. తెలంగాణ ప్రభుత్వం సహకారంతో రాజీవ్​ రహదారి, మేడ్చల్​ హైవేకు ఇరువైపులా ఉన్న వ్యాపార సముదాయాలు తొలగించి పరిహారం ఇస్తాం. కంటోన్మెంట్​ ప్రాంత్రాల్లో ఉన్న ట్రాఫిక్​ కష్టాలు తీరుతాయి. రహదారికి ఇరువైపులా 60 మీటర్ల వరకు విస్తరణ చేపడతాం."- మధుకర్‌ నాయక్‌, కంటోన్మెంట్ సీఈవో

Uppal Skywalk in Hyderabad : ఉప్పల్‌ స్కైవాక్‌ ప్రారంభం.. ప్రత్యేకతలివీ..

సురక్షితంగా రోడ్డు దాటేలా ఆకాశ మార్గాలు..

ABOUT THE AUTHOR

...view details