ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డెడ్​స్టోరేజీకి చేరిన 'పీఏబీఆర్'- తాగునీటి పథకాలపై తీవ్ర ప్రభావం - Water Level Decrease PABR Reservoir

Decreasing Water Level In PABR Reservoir: ఉమ్మడి అనంతపురం జిల్లాకు తాగునీరు అందించే పీఏబీఆర్ (పెన్నఅహోబిలం బ్యాలెన్సింగ్)​ రిజర్వాయర్ నీటి మట్టం గత ప్రభుత్వ పాలకుల వైఫల్యం కారణంగా ఎన్నడూ లేని విధంగా తగ్గిపోయింది. గతేడాది తీవ్ర వర్షాభావం కారణంగా 2 టీఎంసీలకు మించి తుంగభద్ర జలాలు రాకపోవడంతో నీటి నిల్వ తగ్గిపోయింది. మరో 30, 40 రోజుల్లో జలాశయం డెడ్ స్టోరేజ్​కు చేరుకోనుంది.

Decreasing Water Level In PABR Reservoir
Decreasing Water Level In PABR Reservoir (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 30, 2024, 1:02 PM IST

Decreasing Water Level In PABR Reservoir:ఉమ్మడి అనంతపురం జిల్లాకు తాగునీటిని అందించే పీఏబీఆర్​లో నీటి నిల్వ గణనీయంగా తగ్గింది. గత ప్రభుత్వ పాలకుల వైఫల్యం కారణంగా ఎన్నడూ లేని విధంగా నీటి మట్టం తగ్గిపోయింది. ఫలితంగా ఉమ్మడి అనంతపురం జిల్లాకు నీటి సరఫరాపై నీలినీడలు అలుముకుంటున్నాయి. పీఏబీఆర్ నీటి నిల్వ సామర్థ్యం 11 టీఎంసీలు, ఆనకట్ట భద్రత నేపథ్యంలో 5 టీఎంసీల వరకు నిల్వ ఉంచుతూ వస్తున్నారు. గతేడాది తీవ్ర వర్షాభావం కారణంగా 2 టీఎంసీలకు మించి తుంగభద్ర జలాలు రాకపోవడంతో నీటి నిల్వ తగ్గిపోయింది. జలాశయం మరో 30, 40 రోజుల్లో డెడ్ స్టోరేజ్​కు చేరుకోనుంది.

విజ్ఞాన్‌ విశ్వవిద్యాలయంలో సహజసిద్ధంగా నీటిశుద్ధి రూపకల్పన - గ్రామాల్లో ప్లాంట్లను ఏర్పాటుకు సిద్ధం! - water purification in ap

పీఏబీఆర్ లో నీటి నిల్వ గణనీయంగా తగ్గుతుండటం తాగునీటి పథకాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. అనంతపురం నగర పాలక సంస్థకు చెందిన ఇన్​టేక్​ వెల్​ ​వద్ద నీటి నిల్వ బాగా తగ్గింది. ఇక్కడి మోటర్లకు నీరు అందడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో అధికారులు అదనంగా మరిన్ని పైపులను దించి నీటిని తోడుకుంటున్నారు. నిల్వ తగ్గే కొద్ది శ్రీరామిరెడ్డి, సత్యసాయి ఉరవకొండ, కూడేరు పథకాలకు నీరు అందడం భారం కానుంది. కృష్టా జలాలను ఎలాంటి ఖర్చు లేకుండా తరలించే అవకాశం ఉంది. అలా చేసి ఉంటే నీరు పుష్కలంగా ఉండేవి. కానీ కృష్ణా జలాలను అప్పటి జిల్లా ఇంఛార్జి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసం తన ప్రాంతానికి నీటిని తరలించారు.

నిలిచిన కుళాయి నీటి సరఫరా- పొలాలు, కుంటల్లోని వర్షపు నీరే దిక్కు - Drinking Water Scarcity Anantapur

అప్పట్లో ఉమ్మడి జిల్లా వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు కనీసం నోరెత్తలేదు. పీఏబీఆర్​లో నీటి నిల్వ తగ్గుతున్నా తమకేమీ తెలియదన్నట్లు ఉండిపోయారు. పీఏబీఆర్​కు నీరు సరఫరా కావాలంటే కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం నిండాలి. అప్పుడు హెచ్చెల్సీ ద్వారా తుంగభద్ర జలాలు ఈ జలాశయానికి తరలిస్తారు. ప్రస్తుతం తుంగభద్రలో నీటి నిల్వ ఆశాజనకంగా లేదు. అక్కడి నుంచి నీరు రావడం కష్టంగా కనిపిస్తోంది. పరిస్థితులు ఆనుకూలిస్తే ఆగస్టు రెండో వారం నీరు విడుదలయ్యే అవకాశం ఉంది.

తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ శ్రీసత్యసాయి జిల్లా తలుపుల మండలం ఏపులపల్లి వాసులు ఆందోళన చేశారు. కొన్ని నెలలుగా తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. నీటి పథకాలను పునరుద్ధరించి తాగునీరు అందించాలని అధికారులను కోరినా పట్టించుకోలేదని మండిపడ్డారు. సర్పంచ్, అధికారుల తీరుకు వ్యతిరేకంగా కదిరి, పులివెందుల ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో ధర్నాకు దిగారు. రోడ్డుకు ఇరువైపులా వాహనాలు ఆగిపోవడంతో గ్రామస్థులకు పోలీసులు నచ్చచెప్పి ఆందోళన విరమింపజేశారు.

నీరు ఉన్నా విడుదల చేయని అధికారులు - రైతుల్లో ఆందోళన - water not released to kc canal

ABOUT THE AUTHOR

...view details