ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'హరికృష్ణ ఎందరికో ఆత్మీయుడు'- 'హరి మావయ్య డేరింగ్ పొలిటీషియన్' - HARIKRISHNA Death Anniversary - HARIKRISHNA DEATH ANNIVERSARY

Death Anniversary of Nandamuri Harikrishna Chandrababu Pays Tribute at Party Office : నందమూరి హరికృష్ణ వర్థంతి సందర్భంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. సినీ, రాజకీయ రంగాల్లో ఎంతో మందికి హరికృష్ణ ఆత్మీయుడిగా నిలిచారని గుర్తుచేశారు. నిండైన తెలుగుదనానికి ప్రతిరూపంగా తెలుగువారి అభిమానాన్ని పొందారన్నారు. హరికృష్ణతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ చంద్రబాబు ఈ మేరకు ట్వీట్‌ చేశారు.

death_anniversary_of_nandamuri_harikrishna
death_anniversary_of_nandamuri_harikrishna (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 29, 2024, 12:47 PM IST

Updated : Aug 29, 2024, 1:09 PM IST

Death Anniversary of Nandamuri Harikrishna Chandrababu Pays Tribute at Party Office : ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు నందమూరి హరికృష్ణ వర్థంతి సందర్బంగా పలువురు ప్రమఖులు ఆయనకు నివాళులర్పించారు. నందమూరి తారకరామారావు మూడో కుమారుడైన హరికృష్ణ తెలుగు ప్రజలకు సుపరిచితుడు. ఈయన ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ తరపున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. ఈ క్రమంలో అప్పట్లో రామారావు తెలుగు దేశం పార్టీ ఏర్పాటులో భాగంగా రాష్ట్రమంతటా విస్తృతంగా పర్యటించే సమయంలో హరికృష్ణ తండ్రి ప్రయాణించిన చైతన్య రథం వాహన సారథ్య బాధ్యతలు వహించారు.

నందమూరి హరికృష్ణ 6వ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళి అర్పించారు. ఆత్మీయతకు, ఆత్మాభిమానానికి ప్రతిరూపం హరికృష్ణ అని చంద్రబాబు కొనియాడారు. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరోసభ్యుడిగా, మంత్రిగా, శాసనసభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. హరికృష్ణతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ చంద్రబాబు ఈ మేరకు ట్వీట్‌ చేశారు.

Minister Nara Lokesh Tribute to Nandamuri Harikrishna :హరి మామయ్యా మీరు మాకు దూరమైనా జ్ఞాపకమై మా మధ్య జీవించే ఉంటారని మంత్రి లోకేశ్​ ట్వీట్‌ చేశారు. సినీ, రాజకీయ రంగాలకు అందించిన సేవలు మరువలేమన్నారు. వెండితెరపై తన నటనతో అభిమానులకు ఆరాధ్య నటుడైన హరి మావయ్య డేరింగ్ పొలిటీషియన్ అని కొనియాడారు. అలంకరించిన పదవులకే వన్నె తెచ్చిన ఆయన తనకు నిత్య స్ఫూర్తి అని లోకేశ్ తెలిపారు. పుట్టింటిలో నాన్న తరువాత తమకు హరి అన్నే పెద్ద అని భువనేశ్వరి గుర్తు చేసుకున్నారు. ప్రజల హృదయాల్లో చిరస్మరణీయమైన ముద్రవేసిన అన్నకు నివాళి అంటూ ట్వీట్ చేశారు. హరికృష్ణ పెదనాన్నకు నివాళి అంటూ బ్రాహ్మణి పోస్ట్ చేశారు.

అన్న హరికృష్ణను గుర్తు చేసుకుంటూ బాలకృష్ణ ఎమోషనల్‌ పోస్ట్

హరికృష్ణ ఆగస్టు 29, 2018న నల్గొండ జిల్లా, అన్నెపర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన అభిమానులుకు, తెలుగు సినీ రంగానికి ఆయన లేని లోటు ఎన్నటికీ తీరనిదని పలువురు నటీనటీలు భావోద్వేగానికి లోనయ్యారు.

నందమూరి హరికృష్ణ వర్ధంతి, నివాళులర్పించిన చంద్రబాబు, లోకేశ్​

Last Updated : Aug 29, 2024, 1:09 PM IST

ABOUT THE AUTHOR

...view details