ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏపీలో ప్రాణహాని ఉంది - రక్షణ కల్పించండి: తెలంగాణ సీఎంకు దస్తగిరి విజ్ఞప్తి

Dastagiri fears life threat from CM Jagan: వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. అప్రూవర్‌గా మారినందుకు వైఎస్సార్సీపీ నేతలు బెదిరిస్తున్నారని ఆరోపించారు. భద్రత కల్పించాలని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. జైల్లో 20 కోట్లు ఇస్తామంటూ తనను ప్రలోభాలకు గురి చేశారని ఆరోపించారు.

dastagiri
dastagiri

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 27, 2024, 6:07 PM IST

Dastagiri Sensational Comments on CM Jagan: వివేకా హత్య కేసులో అప్రువర్​గా మారిన దస్తగిరి తాజాగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో తనకు ప్రాణహాని ఉందని, తెలంగాణలో రక్షణ కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. వైఎస్సార్సీపీ రాజకీయాలతో తనను ఇబ్బందులకు గురి చేస్తుందని, అందుకే తాను సైతం రాబోయే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలిపారు.

వైఎస్సార్సీపీ నేతలు బెదిరిస్తున్నారు: వచ్చే ఎన్నికల్లో పులివెందుల నుంచి పోటీ చేసి, సీఎం జగన్‌ను ఢీకొడతానని దస్తగిరి వెల్లడించారు. వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు (Viveka Murder Case) విచారణలో భాగంగా హైదరాబాద్​లోని నాంపల్లి కోర్టుకు హాజరైన దస్తగిరి మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం నుంచి తనకు ప్రాణహాని ఉందని చెప్పారు. అప్రూవర్‌గా మారినందుకు వైఎస్సార్సీపీ నేతలు బెదిరిస్తున్నారని ఆరోపించారు. భద్రత కల్పించాలని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని కోరానన్నారు. తనను భయబ్రాంతులకు గురి చేయడానికి జగన్ మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలు కుట్ర పన్నుతున్నారని దస్తగిరి ఆరోపించారు.

ఏపీలో ప్రాణహాని ఉంది - తెలంగాణలో రక్షణ కల్పించండి: దస్తగిరి

రాయలసీమ ప్రజలు గొప్పగా ఆదరిస్తే- ఆ ప్రాంతానికి జగన్ ఏం చేశారు​?

20 కోట్లు ఇస్తామన్నారు:వివేకానంద రెడ్డి పీఏతో సీబీఐ అధికారి రాం సింగ్​పై ఆరోపణలు చేసినట్లుగానే, తనను కుడా ప్రలోభాలకు గురి చేస్తున్నారని దస్తగిరి తెలిపారు. వాళ్ల మాటలు వినడం లేదనే తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. వివేకా హత్య కేసు వల్ల రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఇబ్బందికర పరిస్థితి నెలకొందని అన్నారు. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు తాను ఉన్న జైలుకు వచ్చి కేసులో రాజీ పడితే రూ. 20 కోట్లు ఇస్తామన్నారని దస్తగిరి తెలిపారు. తనకు ప్రభుత్వమే సెక్యూరిటీ కల్పించిందని, అలాంటిది వారిని కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. తనకు భద్రత కల్పించే విషయంలో పోలీసు అధికారులను సైతం ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.

హనుమ విహారి కెప్టెన్సీ తొలగింపు దుమారం - వైసీపీ సర్కారుపై విపక్షాల ముప్పేట దాడి

జైల్లో జరిగిన ప్రలోభాలపై సీబీఐకి ఫిర్యాదు: సీబీఐ కేసులో రీకాల్ పిటిషన్ కోసం హైదరాబాద్​లోని నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరైనట్లు దస్తగిరి తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం నుంచి తనకు ప్రాణహాని ఉందని, ఇదే అంశంపై త్వరలో సీబీఐ కోర్టులో పిటిషన్ వేయనున్నట్లు తెలిపారు. జైల్లో జరిగిన ప్రలోభాలపై సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. తాను ఎవ్వరిని కిడ్నాప్ చేయలేదని, కావాలనే తనను కేసులో ఇరికించారని ఆరోపించారు. జగన్ మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి తన భార్యను సైతం బెదిరించారని దస్తగిరి ఆరోపించారు. తనను ఏ రాజకీయాలతో బెదిరించాలని చూస్తున్నారో తాను కూడా అదే రాజకీయాలతో సమాధానం చెబుతానని వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో తాను పులివెందుల నుంచి పోటీ చేయనున్నట్లు దస్తగిరి తెలిపారు.

మంత్రి రోజాపై బండ్ల గణేష్​ సంచలన వ్యాఖ్యలు

ABOUT THE AUTHOR

...view details