ETV Bharat / state

ఏపీ పర్యాటకానికి కేంద్రం మెరుగులు - అఖండ గోదావరి, గండికోట ప్రాజెక్టు అభివృద్ధి - ANDHRA PRADESH TOURISM

ఏపీ పర్యాటక అభివృద్ధికి కేంద్రం నిధులు విడుదల - ఫలించిన ఎన్డీయే కూటమి సర్కారు కృషి

Central Funds Released for AP Tourism
Central Funds Released for AP Tourism (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 28, 2024, 2:45 PM IST

Central Funds Released for AP Tourism : రాష్ట్ర పర్యాటకాన్ని కొత్త మలుపు తిప్పే అఖండ గోదావరి, గండికోట ప్రాజెక్టుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 172.34 కోట్ల రూపాయలు కేటాయించింది. పర్యాటక రంగ అభివృద్ధి కోసం మూల ధన పెట్టుబడికి ప్రత్యేక తోడ్పాటు-సాస్కి పథకం (Saski Scheme)లో భాగంగా ఈ నిధులు ఇస్తోంది. ఒక రాష్ట్రానికి 2 ప్రాజెక్టులు చొప్పున నిధులు మంజూరు చేసిన తొమ్మిది రాష్ట్రాల్లో ఏపీ కూడా ఉంది. తొలి విడతగా 113.75 కోట్లను కేంద్రం విడుదల చేసింది. వీటిలో 75 శాతం ఖర్చు చేసి వినియోగ ధ్రువీకరణ పత్రం ఇచ్చాక మిగిలిన నిధులు కేటాయించనుంది.

కేంద్రం పచ్చజెండా : సాస్కి పథకంలో కేంద్రం ఇచ్చే నిధుల కోసం దేశ వ్యాప్తంగా 28 రాష్ట్రాలు మొదట పోటీ పడ్డాయి. ఎనిమిది రాష్ట్రాలు మధ్యలోనే వెనక్కి వెళ్లాయి. మిగిలిన వాటిలో 11 రాష్ట్రాలకు ఒకటి చొప్పున, 9 రాష్ట్రాలకు 2 చొప్పున ప్రాజెక్టులకు కేంద్రం నిధులు కేటాయించింది. సాస్కి పథకం కోసం అఖండ గోదావరి, గండికోటతో పాటు సూర్యలంక బీచ్‌నూ ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రతిపాదించింది. సూర్యలంక మినహా మిగిలిన వాటికి కేంద్రం పచ్చజెండా ఊపింది.

ఏపీలో పర్యాటకం పరుగులు - తొలివిడతగా రూ.113 కోట్లు మంజూరు చేసిన కేంద్రం

చారిత్రక ప్రదేశాలకు పూర్వ వైభవం : రాజమహేంద్రవరంలో 127 ఏళ్ల చరిత్ర కలిగిన హేవలాక్‌ వంతెన (Havelock Bridge) పునర్నిర్మాణంతో పాటు పుష్కర ఘాట్‌ను అభివృద్ధి చేస్తారు. ఈ రెండింటినీ అనుసంధానించి 'డైనమిక్‌ టూరిస్ట్‌ డెస్టినేషన్‌ (Dynamic Tourist Destination)'గా తీర్చిదిద్దుతారు. చారిత్రక, సాంస్కృతిక, వినోద కార్యక్రమాలకు ఇది వేదిక కానుంది. హేవలాక్‌ వంతెనను పునర్నిర్మించి ఆ ప్రాంతంలో గ్లాస్‌ వంతెనలు, జలపాతాలు, అక్వేరియం టన్నెల్‌లను అభివృద్ధి చేయనున్నారు. పుష్కర ఘాట్‌ను ఆధ్యాత్మిక గమ్యస్థానంగా మార్చనున్నారు. అలాగే చుట్టూ ఉన్న పలు ఆలయాలను అభివృద్ధి చేస్తారు. కడియం నర్సరీ, గోదావరి కాలువ వంటి సాంస్కృతిక, చారిత్రక ప్రదేశాలకు పూర్వ వైభవం తీసుకురానున్నారు.

పర్యాటకులకు మెరుగైన సదుపాయాలు : ఏపీలో ముఖ్యమైన చారిత్రక, సహజ సిద్ధ ప్రదేశాల్లో ఒకటైన గండికోటను అమెరికాలోని గ్రాండ్‌ కాన్యన్‌ తరహాలో మరింత అభివృద్ధి చేయనున్నారు. వారసత్వ పరిరక్షణ, అద్భుత దృశ్యాల కాన్యన్‌ వద్ద సాహస పర్యాటక అభివృద్ధికి చర్యలు తీసుకోనున్నారు. గండికోట సందర్శనకు వచ్చే పర్యాటకులకు మెరుగైన సదుపాయాలు కల్పిస్తారు. రెస్టారెంట్, టెంట్‌ సిటీ ఏర్పాటు,సేవా కేంద్రాలు, యాంఫీ థియేటర్‌ వంటివి అందుబాటులోకి తీసుకురానున్నారు. పెన్నానదిలో స్కై వాక్, జల క్రీడలు, తీగ వంతెన, పర్వత సైక్లింగ్‌, క్రూయిజ్‌లో విహారం వంటివి ప్రవేశ పెట్టాలని ప్రతిపాదించారు.

జనవరిలో పనులు ప్రారంభం : రెండు ప్రాజెక్టులకూ త్వరలో టెండర్లు పిలిచి వచ్చే సంవత్సరం జనవరిలో పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.

జలాశయాల్లో ఆడుకుందామనుకుంటున్నారా? - అయితే షికారుకు సిద్దంకండి

రుషికొండలో తేలియాడే వంతెన-సాధ్యాసాధ్యాల పరిశీలన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.