YCP Leader Vamsidhar Reddy Photoshoot In Tirumala : తిరుమల శ్రీవారి ఆలయం ముందు వైఎస్సార్ జిల్లా కమలాపురం వైఎస్సార్సీపీ నేత, మైనింగ్ వ్యాపారి వంశీధర్ రెడ్డి హల్‌చల్ చేశాడు. నలుగురు వ్యక్తిగత ఫొటోగ్రాఫర్లలో ఆలయ ప్రాంగణంలో ఫొటోషూట్ నిర్వహించారు. ఇంత జరుగుతున్నా టీటీడీ విజిలెన్స్ సిబ్బంది పట్టించుకోలేదు. వంశీధర్ రెడ్డి తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట ఫోటో షూట్ చేయించుకోవడం విమర్శలకు దారితీసింది. వంశీధర్‌రెడ్డి బంధుమిత్రులతో కలిసి ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
నలుగురు ఫొటోగ్రాఫర్లు హల్‌చల్ : వారంతా ఆలయం వెలుపలకు వచ్చేటప్పుడు ఆయన వెంట తెచ్చుకున్న నలుగురు ఫోటోగ్రాఫర్లు హల్‌చల్ చేశారు. ఆలయం ఎదుట వంశీధర్‌రెడ్డి బంధుమిత్రులు విభిన్న కోణాల్లో ఫొటోలు తీయించుకున్నారు. భక్తులంతా విస్తుపోతున్నా విజిలెన్స్ సిబ్బంది కనీసం పట్టించుకోలేదు. సాధారణ భక్తులను ఆలయం ముందుకు పంపించని విజిలెన్స్ సిబ్బంది, VIPల ఫోటో షూట్లకు ఎలా అనుమతిస్తున్నారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
రెండు గంటల్లో తిరుమల దర్శనం ఎలా? - మళ్లీ ఆ విధానం తీసుకురానున్నారా!
పవిత్రమైన తిరుమలలో ఇలాంటి : గతంలో ఇదే తరహా ఘటనలకు పాల్పడిన వైఎస్సార్సీపీ నాయకులపై టీటీడీ విజిలెన్స్, పోలీసులు కేసులు పెట్టారు. కానీ ఈ ఘటనలో మాత్రం ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గతంలోనూ వైఎస్సార్సీపీ MLC దువ్వాడ శ్రీనివాస్ వెంట దర్శనానికి వచ్చిన దివ్వెల మాధురి కూడా అక్కడే ఫొటో షూట్ చేయడం వివాదాస్పదమైంది. పవిత్రమైన తిరుమలలో ఇలాంటి జాఢ్యానికి టీటీడీ చెక్ పెట్టాలనే డిమాండ్ భక్తుల నుంచి వినిపిస్తోంది.
ఆధార్‌తో అక్రమార్కులకు చెక్ - టీటీడీ కీలక నిర్ణయం
తిరుమలలో అన్యమత ప్రచారం జరిగితే కఠిన చర్యలు: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు