Young People Bike Stunts in Kadapa :బైక్ రేసింగ్ గతంలో ప్రధాన నగరాల్లో మాత్రమే కనిపించేది. ప్రస్తుతం అది ఏపీలోనూ అన్ని ప్రాంతాలకు విస్తరించింది. యువకులు ఖరీదైన బైక్‌లు కొనుగోలు చేసి కడప టౌన్ శివార్లలోని రోడ్లపై ప్రమాదకర రీతిలో స్టంట్లు చేస్తున్నారు. ఈ విన్యాసాలు ఇతరులకు ఇబ్బందికరంగా మారడంతో పాటు ప్రమాదాలకు కూడా కారణమవుతున్నాయి.
ముందొకరు.. వెనుకొకరు.. ఇద్దరు అమ్మాయిలతో స్టంట్స్.. అడ్డంగా బుక్కైన యువకుడు
కడపలో కొందరు యువకులు రీల్స్ మోజులో పడి రెచ్చిపోతున్నారు. మహావీర్ సర్కిల్ నుంచి కలెక్టర్ కార్యాలయం రోడ్డు, రిమ్స్ ప్రధాన రహదారిపై రీల్స్ కోసం ప్రమాదకర విన్యాసాలు చేస్తూ అలజడి సృష్టిస్తున్నారు. దీంతో ఇతర వాహనదారులు భయాందోళనలకు గురవుతున్నారు.
రిమ్స్ ప్రధాన రహదారిపై ఆకతాయిలు పట్టపగలే బైక్ రేసులతో రెచ్చిపోతున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా 100 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతున్నారు. సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు వాయు వేగంతో ఫీట్లు చేస్తూ ఇతరుల ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. స్టంట్స్ చేసేటప్పుడు అతి వేగం కారణంగా ఇతర వాహనదారులు భయాందోళనలకు గురవుతుండగా, కట్టడి చేయాల్సిన ట్రాఫిక్ పోలీసులు కేవలం చలాన్లకే పరిమితమవుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
Lovers Romance on bike :స్టంట్ల సంగతి అలా ఉంటే బైక్‌లపై ప్రేమికుల విన్యాసాలు అక్కడి ప్రజలకు విసుగు తెప్పిస్తున్నాయి. సాధారణంగా పార్కుల్లో కనిపించే రొమాన్స్ సీన్లు ఇప్పుడు రోడ్లపై దర్శనమిస్తున్నాయి. బరితెగించిన ఓ ప్రేమ జంట నడిరోడ్డుపై ముద్దుల్లో మునిగిపోయింది. యువతీ, యువకుడు ద్విచక్ర వాహనంపై వెళుతూ అసహ్యంగా ప్రవర్తించిన తీరు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. నలుగురు చూస్తారనే ఆలోచన, భయం కూడా లేకుండా బైక్‌పై ముద్దులలో మునిగి పోయారు.
భాగ్యనగరంలోనూ అసభ్య ప్రవర్తన: హైదరాబాద్ నగర శివార్లలోని పహాడీ షరీఫ్ ప్రధాన రహదారిపై ప్రేమ జంట బైక్ మీద వెళ్తూ అసభ్యంగా ప్రవర్తించడం చూసి అటుగా వెళ్లే వాళ్లు అవాక్కయ్యారు. ప్రియుడు బైక్ నడుపుతుంటే ప్రియురాలు అతడి ముందు పెట్రోల్ ట్యాంక్‌పై ఎదురుగా కూర్చుని ముద్దులతో ముంచెత్తింది. యువకుడు బండి నడుపుతుంటే గట్టిగా కౌగిలించుకొని ముద్దుల్ని కురిపించింది. ప్రియుడు సైతం ఆమెతో సరసాలాడుతూనే బైక్‌ను నడిపాడు. పక్కనే ద్విచక్ర వాహనాలపై ఎంతో మంది వెళ్తున్నా రొమాన్స్‌కు మాత్రం బ్రేక్ ఇవ్వలేదు. చుట్టుపక్కలవాళ్లు తమనే గమనిస్తున్నారన్న ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు.
బిజీ రోడ్డులో బైక్ స్టంట్స్- ఫ్లైఓవర్‌పై నుంచి స్కూటీలను కింద పడేసిన స్థానికులు- తర్వాత పోలీసులు వచ్చి? - Motorcycle Stunt Riders
Car Racings Bike Stunts at Ananthagiri Hills : అనంతగిరి కొండల్లో జోరుగా కార్ రేసింగ్.. నిర్వాహకుల గుర్తింపు