Dandiya Is The Best Fitness workout :దసరా శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా ఎక్కడ చూసినా దాండియా ఆటలే కనిపిస్తాయి. మగ అనే తేడా లేకుండా ఈ నృత్యంలో పాల్గొని పెద్దఎత్తున సందడి చేస్తారు. అయితే దాండియా గర్బా గుజరాతీ సంప్రదాయ జానపద నృత్యాల్లో ఇవి చాలా ప్రత్యేకమైనవి. బృందావనంలో రాధాకృష్టుల లీలా వినోదాన్ని, హోలీ సంబరాల్ని కళ్లకు కట్టినట్లుగా ఈ నృత్యాల ద్వారా ప్రదర్శిస్తారు అక్కడి యువతీయువకులు.
దసరా నవరాత్రుల్లో భాగంగా గుజరాత్‌తో పాటు, పశ్చిన భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కూడా తొమ్మిది రోజుల పాటు దాండియా నృత్యాలను ప్రదర్శించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే కాలానుగుణంగా దేశవ్యాప్తం అవడంతో పాటు ప్రపంచ నలుమూలల్లో స్థిరపడిన భారతీయులు సైతం ఏటా నవరాత్రుల్లో ఈ నృత్యాలను ప్రదర్శింస్తుంటారు.
ఇవి కేవలం అందరూ కలిసి ఆనందించడానికి ఆడుకునే ఆటలు మాత్రమేకావు. ఫిట్నెస్పరంగా కూడా ఎంతో మేలు చేస్తాయంటున్నారు నిపుణులు.శరీరంలోని అనవసర కొవ్వులు కరిగి బరువు తగ్గండంతో పాటు రోజువారీ ఒత్తిళ్లు,ఆందోళనలు వంటివి మాయమై మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ క్రమంలో దాండియా ఆడటం వల్ల ఫిట్నెస్ పరంగా ఇంకా ఎలాంటి ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం రండి.
మానసిక ప్రశాంతతకు: దాండియా ఆడటం వల్ల రోజంతా ఎదురయ్యే వ్యక్తిగత, వృత్తిపరమైన ఒత్తిళ్ల నుంచి బయటపడి మానసిక ప్రశాంతత పొందుతుంటారు. అందుకే ఏటా దసరా శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా సాయంత్రం పూట యువతులు ఎంతో ఉత్సాహంగా ఈ ఆటలో పాల్గొంటారు. దాండియా ఆడుతున్నప్పుడు మెదడులో ఎండార్ఫిన్లు ఉత్పత్తవుతాయి. ఇవి ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలను దూరం చేసి శరీరాన్ని, మనసును ప్రశాంతంగా ఉంచేందుకు తోడ్పడతాయి. అలాగే ఎంతో సరదాగా సాగే ఈ ఆట ఒత్తిడిని దూరం చేసి మానసికోల్లాసాన్ని అందిస్తుంది.
పాటకు తగ్గ ఆట : దసరా శరన్నవరాత్రోత్సవాల్లో దాండియా ఆటలతో ఆడ, మగ అనే తేడా లేకుండా పెద్దఎత్తున సందడి చేస్తారు. యువతులంతా దాండియా స్టిక్స్ పట్టుకుని పాటకు తగ్గట్లుగా వాటిని ఒకదానికొకటి తగిలిస్తూ లేదంటే జంటగా ఆడుతూ సవ్య, అపసవ్య దిశలలో తిరుగుతుంటారు. దీంతో చేతులు, కాళ్లు, భుజాలు, నడుము ఇలా శరీరంలోని భాగాలన్నింటికీ చక్కటి వ్యాయామం అందుతుంది. అలాగే ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా కొనసాగే ఈ నృత్యం ఒత్తిళ్లను తగ్గించి మానసిక ప్రశాంతతను అందిస్తుంది.