ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం - తుపానుగా మారే అవకాశం - వాతావరణ శాఖ హెచ్చరిక - CYCLONE ALERT

ఉత్తర అండమాన్‌లో అల్పపీడనం ఏర్పడే సూచన - ఈనెల 23 నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం

cyclone_alert
Cyclone Alert (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 20, 2024, 7:44 PM IST

Updated : Oct 21, 2024, 8:19 AM IST

Cyclone Alert : ఉత్తర అండమాన్ సముద్రం మీదుగా ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఉత్తర అండమాన్‌లో అల్పపీడనం ఏర్పడే సూచన ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ వాయవ్య దిశగా వెళ్లి మంగళవారానికి వాయుగుండంగా మారే సూచనలు ఉన్నట్లు పేర్కొంది. ఇది ఈనెల 23 నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఈనెల 24 నాటికి ఒడిశా-బంగాల్ తీరాలకు చేరుకునే అవకాశం ఉందని తెలిపారు. దీని ప్రభావంతో ఈనెల 24, 25 తేదీల్లో ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఈనెల 23, 24 తేదీల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈదురుగాలులు వీస్తాయని, జాలర్లు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తిరిగి రావాలని అన్నారు.

ఏపీకి మరో ముప్పు - ముంచుకొస్తున్న అల్పపీడనం - ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన

Last Updated : Oct 21, 2024, 8:19 AM IST

ABOUT THE AUTHOR

...view details