Cyberabad Police Recovers 1000 Phones in 3 Months :ప్రస్తుత టెక్నాలజీ కాలంలో సెల్ఫోన్ మనిషి జీవితంలో నిత్యవసర వస్తువుగా మారిపోయింది. అది పక్కన లేకపోతే ఏదో కోల్పోయినట్లు భావిస్తారు. అయితే ఆ చరవాణి ఉంటే చేతిలోనే సమస్త ప్రపంచం మన వద్ద ఉన్నట్లే. ఎలాంటి సమాచారం కావాలన్న ప్రస్తుతం ప్రతి ఒక్కరు సెల్ఫోన్నే ఉపయోగిస్తున్నారు. బ్యాంకు లావాదేవీలు సహా సులభంగా సమాచారం సెల్ఫోన్లో పొందవచ్చు. అటువంటి ఫోన్ పోయిందంటే ఆ బాధను చెప్పడానికి మాటలు రావు.
ముఖ్యంగా రాష్ట్ర రాజధాని సహా అనేక ప్రాంతాల్లో సెల్ఫోన్లు చోరీకి గురవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఫోన్లను లాక్కుని వెళ్లిపోతున్న ముఠాల ఆగడాలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత మూడు నెలల్లో ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా వెయ్యి సెల్ఫోన్లను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు.
570 ఫోన్లు స్వాధీనం : నగరంలో చోరీ అయిన ఫోన్లను పట్టుకోవడమే కాకుండా ఇతర రాష్ట్రాలకు తరలించిన ఫోన్లను సైతం పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. గత 25 రోజుల్లో సైబరాబాద్ నేర విభాగం పోలీసులు 570 సెల్ఫోన్లను పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లను పోలీసులు బాధితులకు అందజేశారు.
తమ సెల్ఫోన్ పోవడం వలన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని బాధితులు వాపోయారు. అసలు చరవాణి దొరుకుతుందని ఎప్పుడూ అనుకోలేదని తిరిగి అది దొరికినట్లు పోలీసుల నుంచి సమాచారం రాగానే నమ్మలేకపోయినట్లు పలువురు బాధితులు తెలిపారు. ఫోన్ పోయినప్పటికీ నెలవారీ ఈఎంఐ చెల్లించామని మరికొంత మంది బాధితులు చెప్పారు. ఎంతో విలువైన సమాచారం నిక్షిప్తమై ఉన్న ఫోన్ దొరకడంతో వారు హర్షం వ్యక్తం చేశారు.
ఫోన్ మిస్ అయిన వెంటనే పోలీసులు ఫిర్యాదు చేయండి : ఎవరైనా సెల్ఫోన్ కనిపించకుండా చోరీ అయితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని నగర పోలీసులు సూచించారు. అవసరమైతే సీఇఇఆర్ యాప్ ద్వారా బాధితులు రిజిస్టర్ చేసుకోవచ్చని పోలీసులు అధికారులు తెలిపారు. ఫోన్ల విషయంలో అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు తెలిపారు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ముఖ్యమైన అంశాన్ని మొబైల్ ఫోన్లలో భద్రపరుచుకుంటున్నారని అలాంటి ఫోన్ పోతే ఎంత నష్టం జరుగుతుందో అందరికీ తెలుసునని చెప్పారు.
మీ పాత ఫోన్ను అమ్మేస్తున్నారా? - ఈ జాగ్రత్తలు పాటించకపోతే డేంజర్లో పడ్డట్టే! - OLD PHONES SELLING TO STRANGERS
మార్కెట్లో ఫోన్ కొట్టేస్తూ అడ్డంగా దొరికిపోయిన దొంగ - పోల్కు కట్టేసి చితకబాదిన వ్యాపారస్థులు - Traders Caught Mobile thief