CM Revanth chevella meeting Arrangements :రాష్ట్రంలో మరో రెండు గ్యారంటీలకు శ్రీకారం చూడుతూ ఈనెల 27న ప్రారంభించబోయే సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) చేవెళ్ల సభకు సర్వం సిద్ధమవుతోంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాళ సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి(Cyberabad CP) సభ స్థలాన్ని పరిశీలించారు. పార్కింగ్, రూట్ మ్యాపింగ్, సభ నిర్వహణ తదితర పూర్తి విషయాలపై ఆయన అరా తీశారు, అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ రివ్యూలో రాజేంద్రనగర్ డీసీపీ సీహెచ్ శ్రీనివాస్, చేవెళ్ల ఏసీపీ కిషన్, సీఐ లక్ష్మారెడ్డి, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
CM Revanth Clarifies on Two Guarantees :రాష్ట్రంలో మరో రెండు గ్యారంటీల అమలుకు ముందడుగు పడింది. గృహజ్యోతి(Gruha jyothi), గ్యాస్ సిలిండర్ పథకాలను ఈనెల 27 న సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీతో కలిసి చేవెళ్ల సభలో ప్రారంభించనున్నారు. ఇటీవల జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో రెండు గ్యారంటీల అమలుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ పథకాల ప్రారంభానికి 27 లేదా 29 తేదీలలో, ఏదో ఒక తారీఖున ప్రారంభించునున్నట్లు ప్రకటించారు.
శుక్రవారం మేడారంను సందర్శించిన సీఎం రేవంత్‌రెడ్డి 27న ప్రియాంక గాంధీతో కలిసి పథకాలను ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ పథకాల అమలుకు సీఎం రేవంత్‌రెడ్డి కార్యాచరణ ప్రారంభించారు. మార్చి మొదటి వారం నుంచి విద్యుత్తు బిల్లు జారీ చేసేటప్పుడు అర్హులైన వారందరికీ గృహజ్యోతి పథకం కింద జీరో బిల్లులు జారీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణలో ప్రభుత్వ కొలువుల జాతర షురూ - ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ ఫోకస్