ఇలా చేస్తే మీ రివార్డ్ పాయింట్లు పెరుగుతాయి లింక్ క్లిక్ చేశారో ఇక అంతే సంగతులు (ETV Bharat) Reward Points Scam in Telangana :సైబర్ నేరాలతో కూర్చున్న చోటు నుంచే అనుకున్నంత డబ్బు కాజేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. అమాయక ప్రజల దురాశ వారికి ఆయుధంగా మారుతోంది. పెట్టుబడులు, ఫెడెక్స్‌తో పాటు రివార్డ్ పాయింట్స్ పేరిట ఇటీవల సైబర్ నేరాలు పెరిగిపోయాయి. సైబర్ క్రైమ్ స్టేషన్‌కి వచ్చే ఫిర్యాదుల్లో ఇటీవల ఇవి పెరుగుతున్నట్లు పోలీసులు వెల్లడిస్తున్నారు. సికింద్రాబాద్కు చెందిన ఓ వ్యాపారవేత్తకు నెలరోజుల క్రితం రివార్డ్ పాయింట్స్ పెరుగుతాయి అంటూ ఓ మెసేజ్ వచ్చింది. దానికి సంబంధించి సైబర్ నేరగాళ్లు సూచించిన విధంగానే చేస్తూ ఓటీపీని వారికి షేర్ చేశాడు. అంతే తర్వాత నుంచి అకౌంట్ సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లిపోయి క్షణాల్లోనే రూ.2 లక్షల మాయమయ్యాయి.
హైదరాబాద్కు చెందిన మరో వ్యాపారవేత్తకు సైబర్ నేరగాడి నుంచి మెసెజ్ వచ్చింది. మీ రివార్డ్ పాయింట్స్ పెరగాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి అంటూ లింక్ పంపించారు. నమ్మన వ్యాపారి లింక్ క్లిక్ చేసి వివరాలన్నీ సైబర్ నేరగాళ్లకు అందజేశాడు. అతని ఖాతాలోంచి రూ.లక్ష 92 వేల పైచిలుకు నగదు మాయమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి విషయాల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నిపుణులు ఇలా సూచిస్తున్నారు.
పెట్టుబడుల పేరుతో సైబర్ మోసాలు - ప్రజల ఖాతా ఖాళీ చేయడమే ప్రధాన లక్ష్యంగా కేటుగాళ్ల పంథా - Investment Fraud in Hyderabad
చదువుకున్న వారే ఈ తరహా మోసాలకు బలవ్వడం గమనార్హం. ఈ రివార్డ్ పాయింట్స్ మాత్రమే కాకుండా ఫెడెక్స్ పేరిట వచ్చే కొరియర్లతో తమ పరువు పోతోందని భయం వల్లే సైబర్ నేరగాళ్లకు లక్షల్లో డబ్బులు చెల్లించుకోవాల్సి వస్తుంది. మరోవైపు చాలా మంది పెట్టుబడుల స్కామ్‌లలో సైతం ఇరుక్కుంటున్నారు. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే లాజికల్ థింకింగ్ అనేది అలవాటు చేసుకోవాలని సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ సూచిస్తున్నారు.
సైబర్ నేరాలు ఈ రోజుల్లో సాధారణంగా మారిపోతున్నాయి. కానీ వాటికి భయపడాల్సిన పనిలేదని చెబుతున్నారు నిపుణులు. కాస్త అప్రమత్తంగా ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవంటున్నారు. అలాగే సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే 1930 కి కాల్ చేసి గానీ లేదా www.cybercrimes.gov.inలో రిపోర్ట్ చేయాలని సూచిస్తున్నారు. అలా చేయడం వల్ల అకౌంట్ ఫ్రీజ్‌చేసి నగదు బదిలీ కాకుండా ఆపవచ్చని పోలీసులు చెబుతున్నారు.
మహిళను బెదిరించి రాత్రి నుంచి ఉదయం వరకు వీడియో కాల్ - ఆపై రూ.60 లక్షల లూటీ - Cyber Crime in Hyderabad
'మీ ఎస్బీఐ రివార్డ్ రూ.7,250 యాక్టివేట్ అయింది' - ఇలాంటి మెసెజ్ మీకూ వచ్చిందా? అయితే జాగ్రత్త - SBI redeem Pont Reward Scam