ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సైబర్‌ దొంగలున్నారు జాగ్రత్త సుమీ - ప్రముఖుల బోగస్‌ ఇంటర్వ్యూలు, వీడియోలతో బురిడీ - Cyber ​​Crimes Increasing in ap

Cyber ​​Crimes Increasing Day by Day: మా కంపెనీలో పెట్టుబడి పెడితే 4 రెట్లు రాబడి పొందొచ్చు. స్టాక్‌మార్కెట్‌లో మీ డబ్బును పెట్టుబడిగా ఉంచండి. భారీగా లాభాలు పొందండి అంటూ సైబర్ నేరగాళ్లు అమాయకుల కష్టాన్ని దోచుకుంటున్నారు. ప్రముఖుల బోగస్‌ ఇంటర్వ్యూలు, ఏఐ ఆధారిత వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తూ వారిని బురిడీ కొట్టిస్తున్నారు. నిజమే అని నమ్మి పెట్టుబడులు పెట్టిన వారి ఖాతాల్లో తొలుత కొంత మొత్తం జమ చేసి నమ్మకం కలిగించిన తర్వాత ఎక్కువ మొత్తంలో డబ్బు పెట్టించి దోచుకుంటున్నారు.

Cyber ​​Crimes Increasing Day by Day
Cyber ​​Crimes Increasing Day by Day (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 22, 2024, 7:07 AM IST

సైబర్‌ దొంగలున్నారు జాగ్రత్త సుమీ - ప్రముఖుల బోగస్‌ ఇంటర్వ్యూలు, వీడియోలతో బురిడీ (ETV Bharat)

Cyber ​​Crimes Increasing Day by Day :అమాయకులకు నగదును ఎర వేసి సైబర్ కిలాడీలు రెచ్చిపోతున్నారు. బడా కంపెనీల యజమానుల బోగస్ ఇంటర్వూలతో సామాజిక మాథ్యమాల్లో ప్రకటనలిచ్చి ఆకర్షిస్తున్నారు. మా కంపెనీలో పెట్టుబడి పెడితో తక్కువ కాలంలో భారీగా సంపాదించవచ్చని ఉచ్చులోకి లాగి అందినంత దోచుకుంటున్నారు.

విజయవాడకు చెందిన మహిళ సామాజిక మాధ్యమాల్లో ఓ ప్రకటన చూసింది. కొద్దిపాటి డబ్బుతోనే స్టాక్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌లో ఊహించని లాభాలు పొందవచ్చన్నది ఆ ప్రకటన సారాంశం. వెంటనే అందులోని ఫోన్‌ నెంబరుకు కాల్‌ చేసి మాట్లాడింది. తొలుత వెయ్యి పెట్టుబడి పెట్టమని అవతలి వ్యక్తి చెప్పాడు. దీని నుంచి 13 వందలు లాభం వస్తుందని నమ్మించాడు. అనుకున్నట్లే లాభం రావడంతో ఆమె దశలవారీగా 5 లక్షల వరకు పెట్టుబడి పెట్టింది. తర్వాత నుంచి ఆ మోసగాడు స్పందించడం మానేశాడు. మరోవ్యక్తి 10 లక్షల రూపాయల వరకు నష్టపోయాడు. ఇలా ఎంతో మంది సైబర్‌ నేరగాళ్ల వలకు చిక్కి విలవిల్లాడుతున్నారు. మోసపోయిన వారు త్వరగా తమకు ఫిర్యాదు చేస్తే నిందితుల బ్యాంకు ఖాతాలను సీజ్ చేసి నగదును రికవరీ చేసేందుకు అవకాశం ఉంటుందని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు చెబుతున్నారు.

పెచ్చరిల్లుతున్న సైబర్ నేరాలు - వాటిని ఎదుర్కొనే మార్గాలు ఇవే!! - Cyber Crime Safety Measures

సైబర్‌ నేరగాళ్లు అమాయకులు, పేదవారికి డబ్బు ఆశ చూపి బ్యాంకు ఖాతా తెరిపిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలకు ఆ ఖాతాలను ఉపయోగిస్తున్నారు. పోలీసులకు ఎక్కడా దొరక్కుండా ఉండేందుకే ఈ ఎత్తుగడ వేస్తున్నారు. ఒకవేళ దొరికినా సైబర్‌ మోసాల్లో చివరకు అమాయకులే బలవుతారు. అసలు ఖాతాలే లేని వారిని కూడా ఒప్పించి నిందితులే అకౌంట్లు తెరిపిస్తున్నారు. వీటికి సంబంధించిన పాస్‌బుక్, అంతర్జాల, మొబైల్‌ బ్యాంకింగ్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లను తమ ఆధీనంలోనే ఉంచుకుని అంతా నడిపిస్తున్నారు. వీరెవరికి తమ ఖాతాల ద్వారా లక్షల్లో లావాదేవీలు జరుగుతున్నట్లు తెలియదు. ఇందుకు గాను వారికి ప్రతి నెలా ఎంతో కొంత నగదు చెల్లిస్తుంటారు. అమాయకుల ఖాతాల్లో జమ అవుతున్న నగదును పలు బినామీ ఖాతాలకు మళ్లిస్తున్నారు. ఆ ఖాతాల నుంచి నగదు దేశం దాటిపోతోంది. క్రిప్టో కరెన్సీ రూపంలో ఇతర దేశాలకు చేరుతోంది. ఈ లావాదేవీలపై దర్యాప్తు చేయడం పోలీసులకు కష్ట సాధ్యంగా మారుతోంది. కేంద్ర సంస్థలైన ఈడీ, సీబీఐ వంటి వాటికే ఇటువంటి వాటిని వెలికితీయలేకపోతున్నాయి. స్థానిక పోలీసుల దర్యాప్తు మూలాల వరకు వెళ్లకపోవడంతో యథేచ్ఛగా నేరస్తులు దందా కొనసాగిస్తున్నారు.

చైనా సైబర్‌ ముఠా చేతిలో ఏపీ వాసులు - ముగ్గురిని అరెస్టు చేసిన విశాఖ పోలీసులు - police arrested Human trafficking

సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రకటనలు చూసి మోసపోవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు . వాట్సాప్, టెలిగ్రాం యాప్‌లకు వచ్చే మెసేజ్‌లను నమ్మొద్దంటున్నారు. పెట్టుబడి పెట్టే ముందు క్షుణ్ణంగా ఆలోచించాలని సూచిస్తున్నారు.

బ్యాంక్‌ ఖాతా హ్యాక్‌ చేసి ₹5 లక్షలు చోరీ- 3 దఫాలుగా దగా - Cyber Fraud in Kurnool Disrtict

ABOUT THE AUTHOR

...view details