Cyber Crime in Congress Crowd Funding: సైబర్ నేరగాళ్లు రోజు రోజుకి కొత్త పథకంతో ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఈ విషయం తెలియక అమాయకులు నగదును పొగొట్టుకుంటున్నారు. తాజాగా కాంగ్రెస్ పేరుతో వెబ్‌సైట్‌ను తయారు చేసి ఫండింగ్ ద్వారా కేటుగాళ్లు డబ్బులు కాజేశారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితుడ్ని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన సురేంద్ర చౌదరి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పేరిట నకిలీ వెబ్‌సైట్ రూపొందించాడు.
98 లక్షలు కొల్లగొట్టి, క్షణాల్లోనే 11 ఖాతాలకు బదిలీ - పోలీసుల చాకచక్యంతో 85 లక్షలు సేఫ్
Officials Instructions on Cyber Crime Criminals : నకిలీ వెబ్‌సైట్ సాయంతో సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని ప్రజల నుంచి విరాళాలు సేకరించాడు. విషయం తెలిసిన కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు ఈ వ్యవహారంపై సైబర్ క్రైంపోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడ్ని రాజస్థాన్‌లో అదుపులోకి తీసుకుని ట్రాన్సిట్ వారెంట్‌పై నగరానికి తీసుకొచ్చారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు. ఈ తరహా నకిలీ వెబ్‌సైట్లను ప్రజలు నమ్మవద్దని సైబర్ క్రైం పోలీసులు(Cyber Crime Police) ప్రజలకు సూచిస్తున్నారు.