తెలంగాణ

telangana

ETV Bharat / state

సైబర్ కేఫ్‌ రిపోర్టులో నమ్మలేని నిజాలు- ఆ బ్యాంకుల కస్లమర్లే అధిక బాధితులట - cyber crime in banking sector - CYBER CRIME IN BANKING SECTOR

Cyber Crime in Banking Sector : దేశవ్యాప్తంగా సైబర్‌ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా బ్యాంక్‌కు సంబంధించిన ఆఫర్స్‌, క్రెడిట్‌ కార్డు రుణపరిమితి పెంపు, షాపింగ్‌ కూపన్ల పేరుతో బురిడి కొట్టించిన ఘటనలు తరచుగా వింటుంటాం. ఈ తరహా మోసాల్లో, రెండు అతి పెద్ద బ్యాంకులకు చెందిన ఖాతాదారులే అధిక సంఖ్యలో ఉండటం గమనార్హం. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సైబర్‌ సేఫ్‌ సంస్థ గతేడాది అక్టోబరులో ఫోన్‌ ద్వారా బ్యాంకింగ్‌ పేరుతో జరిగిన మోసాలను విశ్లేషించింది.

Cyber Cafe Crime Report
Cyber Crime in Banking Sector

By ETV Bharat Telangana Team

Published : Apr 12, 2024, 6:53 PM IST

Updated : Apr 12, 2024, 7:25 PM IST

Cyber Crime in Banking Sector : సైబర్‌ నేరగాళ్లు కొన్ని బ్యాంకుల ఖాతాదారులనే లక్ష్యంగా చేసుకోవడం కలవరపెడుతోంది. బ్యాంకింగ్(Bank Frauds) సంబంధిత సైబర్ నేరాల్లో, దేశవ్యాప్తంగా ఎక్కువ మంది ఖాతాదారులుండే ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంకు తొలిస్థానంలో నిల్చింది. ఇక రెండోస్థానంలో ప్రైవేటు రంగానికి చెందిన అతిపెద్ద బ్యాంకు ఉంది. 2023 అక్టోబరులో దేశవ్యాప్తంగా 8వేల 760 మోసాలు జరగ్గా అందులో 2వేల 624 ప్రభుత్వ బ్యాంకు, 1,299 మంది ప్రైవేటు బ్యాంకు ఖాతాదారులు బాధితులుగా ఉన్నారు.

ఐసీఐసీఐ కస్టమర్లకు అలర్ట్​ - ఆ వాట్సాప్ మెసేజెస్, కాల్స్ నమ్మితే ఇక అంతే! - ICICI Bank Fraud Alert

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సైబర్‌ సేఫ్‌ సంస్థ గతేడాది అక్టోబరులో ఫోన్‌ ద్వారా బ్యాంకింగ్‌ పేరుతో జరిగిన మోసాలను విశ్లేషించింది. సుమారు 45 శాతం ఈ రెండు బ్యాంకుల ఖాతాదారులే లక్ష్యంగా సైబర్‌ మోసాలు(Cyber Crime) జరిగినట్లు అధ్యయనంలో వెల్లడైంది. ఈ రెండు బ్యాంకుల ఖాతాదారులకే ఎక్కువగా నకిలీ సందేశాలు వెళ్లడంపై, గతేడాది హైదరాబాద్‌ పోలీసులు సైతం అప్రమత్తంగా ఉండాలంటూ నోటీసులు ఇచ్చారు.

Cyber Cafe Crime Report : ఈ రెండు బ్యాంకుల ఖాతాదారులని లక్ష్యం చేసుకోవడానికి వినియోగదారుల డేటా నిర్వహణలో డొల్లతనమే కారణంగా తెలుస్తోంది. ఖాతాదారుల డేటా ఎప్పటికప్పుడు బయటకు పొక్కి సైబర్‌ నేరస్థుల చేతుల్లోకి వెళ్తోంది. బ్యాంకు ఖాతాలు తెరిచే సమయంలో ఈ-కేవైసీ కోసం ఆధార్, పాన్, వ్యక్తిగత చిరునామా, ఫోన్‌ నెంబర్లు వంటి డేటా అంతా ఇస్తారు. ఈ డేటా బయటకు పొక్కకుండా బ్యాంకులు జాగ్రత్తలు తీసుకోవాలి.

కానీ, క్షేత్ర స్థాయిలో మాత్రం నిర్లక్ష్యం కొరవడింది. కొందరు అక్రమార్కులు ఒక్కొక్కరి డేటాను రూపాయల్లో ధర నిర్ణయించి, సైబర్‌ నేరగాళ్లకు అమ్మేస్తున్నారు. వీటిని ఆధారంగా చేసుకుని సైబర్‌ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. మరోవైపు ప్రభుత్వ రంగ బ్యాంకు ఖాతాదారులు మోసపోవడానికి ప్రధాన కారణం, గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు ఎక్కువగా ఉండడమేనని అధికారులు చెబుతున్నారు.

ఇటీవల కాలంలో ఈడీ, సీబీఐ(CBI), కస్టమ్స్‌ అధికారుల్లా మాట్లాడుతూ డ్రగ్స్‌ పార్శిల్‌ వచ్చిందంటూ, డబ్బు వసూలు చేస్తున్న కేసుల్లో బాధితులు ఎక్కువగా ప్రైవేటు ఖాతాదారులు ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. బ్యాంకులు డేటా నిర్వహణ, క్రెడిట్, డెబిట్‌ కార్డు సేవలకు సంబంధించి కాల్‌ సెంటర్ల నిర్వహణ వంటివి థర్డ్‌ పార్టీ సంస్థలు చూస్తుంటాయి. ఇక్కడి నుంచే ఖాతాదారుల వివరాలు బయటకు చేరుతున్నాయి. దుబాయ్‌ కేంద్రంగా జరిగే డ్రగ్స్ పార్శిల్‌ మోసాల్లో విద్యావంతులు అధికంగా మోసపోతున్నారు.

సిక్స్ డేంజర్ డిజిట్స్- OTP విషయంలో ఈ జాగ్రత్తలు మస్ట్ - safety tips for otp detection

ఫెడ్ఎక్స్ కొరియర్​ పేరుతో కాల్ - అవయవ పార్శిల్ వచ్చిందంటూ లక్షల్లో దోపిడీ - Cyber crime in hyderabad

Last Updated : Apr 12, 2024, 7:25 PM IST

ABOUT THE AUTHOR

...view details