తెలంగాణ

telangana

ETV Bharat / state

భక్తులతో కిటకిటలాడిన దేవాలయాలు - సెలవు రోజు కావడంతో పెరిగిన రద్ధీ - Crowd of devotees in Yadadri - CROWD OF DEVOTEES IN YADADRI

Crowd of devotees at Temples in Telangana : రాష్ట్రంలో ఉన్న ప్రముఖ దేవాలయాల్లో సెలవు రోజు కావడంతో భక్తుల రద్దీ పెరిగిపోయింది. ఉదయం నుంచే స్వామి వారి దర్శనం కోసం జనం క్యూలైన్లో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రజలు అధికంగా రావడంతో ఆలయ అధికారులు సౌకర్యాలను కల్పించారు.

Crowd of Devotees in Vemulavada
Crowd of Devotees in Telangana (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 9, 2024, 6:27 PM IST

Crowd of devotees at Temples in Telangana: వేసవి సెలవులతో పాటు ఆదివారం కావటంతో రాష్ట్రంలో పలు పుణ్యక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉదయం నుంచే క్యూలైన్​లో భారీగా భక్తులు బారులు తీరారు. ఆలయ మాడ వీధులన్నీ భక్తులతో నిండిపోయాయి. ప్రసాదాల కౌంటర్​, శివాలయం, ఆలయ బస్ స్టాండ్​తో పాటు పలు ప్రాంతాలన్నీ భక్తులతో జన సంద్రంగా మారాయి. స్వామి వారి ఉచిత దర్శనానికి 3 గంటలు సమయం పట్టింది. ప్రత్యేక దర్శనం చేసుకునే భక్తులు 2 గంటలు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Crowd of devotees in Vemulavada: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కూడా భక్తుల రద్దీ నెలకొంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. ధర్మగుండంలో పుణ్యస్నానాలు చేసి స్వామివారికి ప్రీతిపాత్రమైన కొడె మొక్కులను చెల్లించుకుని దర్శనం చేసుకున్నారు. భక్తుల రద్దీ కారణంగా గర్భాలయంలో అభిషేకాలు, ఆర్జిత సేవలు రద్దు చేశారు. స్వామి వారి దర్శనానికి సుమారు మూడు గంటల సమయం పట్టింది.

భక్తులతో కిటకిటలాడుతున్న యాదాద్రి - దర్శనానికి 3 గంటల సమయం - Devotees Rush in Yadadri Temple

Crowd of devotees in Badradri: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. తెల్లవారుజామునించే భక్తులు ఆలయ వద్దకు రావడంతో క్యూ లైన్‌లన్నీ భక్తులతో నిండిపోయాయి. లక్ష్మణ సమేత సీతారాముల వారికి విశేష అభిషేకం నిర్వహించి అర్చకులు అనంతరం బంగారు పుష్పాల అర్చన చేశారు. భక్తుల రద్దీ పెరగటంతో నిత్య కల్యాణ వేడుకను చిత్రకూట మండపంలో నిర్వహించారు. దంపతులు పాల్గొని వేడుకను తిలకించారు.

Temple Authorities Arrangements For Devotees : రాష్ట్రంలో వివిధ ఆలయాల్లో భక్తులు రద్దీ పెరిగినందుకు ఆయా ఆలయాల్లో అధికారులు భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ప్రసాద కౌంటర్ల దగ్గర కూడా ఎలాంటి సమస్య లేకుండా చూసుకున్నామని ఆలయ అధికారులు తెలిపారు.

యాదాద్రిలో సంప్రదాయ దుస్తులు ధరించాలన్న నిబంధనపై జాప్యం - భక్తులకు అవగాహన కల్పించాల్సి ఉందన్న అధికార వర్గాలు - Yadadri Dress Code Delay

ABOUT THE AUTHOR

...view details