తెలంగాణ

telangana

ETV Bharat / state

పొలాల నిండా బండరాళ్లు, ఇసుకు మేటలు - భారీ వర్షాలతో ఆనవాళ్లు కోల్పోయిన పంట పొలాలు - Flood Effect To Telangana Crops - FLOOD EFFECT TO TELANGANA CROPS

Flood Effect To Telangana Crops : వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా తీవ్రనష్టం వాటిల్లింది. వాగులు, వంకలు, నదులు ఉద్ధృతంగా ప్రవహించడంతో చేతికందే పంట నీట మునిగింది. వరద నీటి నిల్వ తగ్గుతుండటంతో దెబ్బతిన్న పంట పొలాలు తేలుతున్నాయి. పంట నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని అన్నదాతలు వేడుకుంటున్నారు.

Flood Effect To Nizamabad Crops
Flood Effect To Telangana Crops (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 4, 2024, 12:13 PM IST

Flood Effect To Nizamabad Crops : ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి అన్నదాతలకు అపార నష్టం వాటిల్లింది. జోరువానలకు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా వాగులు పొంగిపొర్లి పంట పొలాల్లోకి భారీగా వరద నీరు ప్రవహించింది. బాన్సువాడ డివిజన్ కేంద్రాల్లో వివిధ పంటలు నీట మునిగాయి. సంగోజిపేట్, కోనాపూర్, హనుమాజీపేట్‌తో పాటు పలు గ్రామాల్లో వరి, సోయాబీన్, కంది, పెసర్లు, మినుమ పంటలు నీటి పాలయ్యాయి. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి పంటలను రక్షించుకున్నామని ఇప్పడు భారీ వర్షానికి నీట ముగిగాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.

భారీ వర్షాలకు మెదక్ జిల్లా హవేలీ ఘన్‌పూర్‌లో ఉన్న పెద్ద చెరువుకు గండి పడి దాదాపుగా 200 ఎకరాల వరకు వరి నీట మునిగింది. నష్టపోయిన పంటలను మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి పరిశీలించారు. రైతులకు నష్టపరిహారం కింద తక్షణమే ప్రభుత్వం ఎకరానికి రూ.30 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

పంటలకు తీవ్ర నష్టం : కుంభవృష్టికి ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాల్లో రికార్డు స్థాయిలో వర్షం కురవడంతో పంటలు నీటటమునిగాయి. ఇప్పుడిప్పుడే వర్షం తెరిపి ఇవ్వడంతో పొలాలు బయటకు తేలుతున్నాయి. క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న అధికార యంత్రాంగం పంట నష్టంపై వివరాలు సేకరిస్తోంది. ఒక్క సూర్యాపేట జిల్లాలోనే వరి, పత్తితో పాటు పెసర ఇతర పంటలు కలిపి 27 వేల ఎకరాల్లో నష్టపోయినట్లు అంచనా వేశారు. భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన తమని ప్రభుత్వమే ఆదుకోవాలని కర్షకులు కోరుతున్నారు.

కుంభవృష్టితో మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ వ్యాప్తంగా భారీ పంట నష్టం వాటిల్లిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆకేరు వాగు ఉద్ధృతితో రోడ్డుకు ఇరువైపులా సాగు చేసిన పంట పొలాలు వరద నీటితో వండ్రు, ఇసుక మేటలు వేశాయని వివరించారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కర్షకులు విజ్ఞప్తి చేస్తున్నారు.

" వర్షాలు, వరదల వల్ల పంటలు నీట మునిగాయి. వరద నీటితో పంట పొలాల్లో వండ్రు, ఇసుక మేటలు వేశాయి. ఎకరాకు రూ.30,000 పెట్టుబడి పెట్టి సాగు చేశాం. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి పంటలను రక్షించుకున్నాం. ఇప్పడు భారీ వర్షానికి నీట ముగిగాయి. నష్టపోయిన మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలి." - రైతులు

వర్షాల కారణంగా భారీ పంట నష్టం - ప్రాథమిక అంచనా రూ.415 కోట్లు - Huge Crops Loss In Telangana

ఆనవాయితీగా మారిన అకాల వర్షాలు - ప్రతి యాసంగిలో అన్నదాతకు ఇవే కష్టాలు! - Crops Damaged Due to Untimely Rains

ABOUT THE AUTHOR

...view details