CP Anand On Ganesh Immersion In Hyderabad: హుస్సేన్‌సాగర్‌లో 5,500 విగ్రహాలు నిమజ్జనం అయ్యాయని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం త్వరగా పూర్తిచేసేందుకు 25వేల మంది సిబ్బంది నిర్విరామంగా కృషి చేశారని అన్నారు. రెండు షిఫ్టుల్లో నిద్రాహారాలు లేకుండా చాలా కష్టపడి పనిచేశారని వెల్లడించారు.
హుస్సేన్‌సాగర్‌లో 5,500 విగ్రహాలు నిమజ్జనం : సీపీ సీవీ ఆనంద్ - CP Anand On Ganesh Immersion
CP Anand On Ganesh Immersion In Hyderabad : హైదరాబాద్‌లో వినాయకుని నిమజ్జనం ప్రశాంతంగా జరిగిందని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. హుస్సేన్‌సాగర్‌లో 5,500 విగ్రహాలు నిమజ్జనం అయ్యాయని వెల్లడించారు. గణేశ్ నిమజ్జనం త్వరగా పూర్తిచేసేందుకు 25వేల మంది సిబ్బంది నిర్విరామంగా కృషి చేశారని చెప్పారు.
CP Anand On Ganesh Immersion In Hyderabad (ETV Bharat)
Published : Sep 18, 2024, 1:13 PM IST
గతేడాదితో పోలిస్తే ఈసారి పరిస్థితి మరింత మెరుగ్గా ఉందని సీపీ తెలిపారు. బుధవారం ఉదయం 5 గంటలకి గణేశ్ శోభాయాత్ర చివరి భాగం ఎంజే మార్కెట్ వరకు చేరుకుందన్నారు. కొన్ని వాహనాలు మాత్రమే అప్రోచ్ రోడ్లలో ఉన్నాయని, సాయంత్రం వరకు రోడ్లన్నీ సాధారణ ట్రాఫిక్ వెళ్లేందుకు వీలుగా అందుబాటులోకి వస్తాయని ఆశిస్తున్నట్లు సీపీ వెల్లడించారు. షీ టీమ్స్‌లో ఏమైనా ఫిర్యాదులు ఉంటే ఈ రోజు పరిశీలిస్తామని పేర్కొన్నారు.