Court Grants Special Facilities to MLC Kavitha : తిహాడ్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు అవసరమైన వసతులు కల్పించాలని రౌస్ అవెన్యూ న్యాయస్థానం మరోసారి జైలు అధికారులను ఆదేశించింది. కొన్ని వస్తువులను స్వయంగా సమకూర్చుకునేందుకు అవకాశం కల్పించింది. జపమాల, పుస్తకాలు, పెన్నులు, ఇతర వస్తువులతో పాటు ధ్యానం చేసుకునేందుకు జపమాల, లేసులు లేని బూట్లు, ప్రతిరోజు పత్రికలను అనుమతించాలని సీబీఐ కోర్టు ఆదేశించింది.
అలాగే ఇంటి నుంచి ఫుడ్, బెడ్, దుప్పట్లు తెచ్చుకునేందుకు, ఆభరణాలు(Jewellery) ధరించేందుకు కూడా అనుమతించాలని న్యాయస్థానం ఆదేశించింది. వీటితో పాటు కుకింగ్ ఆఫ్ బుక్స్, 365 సుడోకు, జయ ఘోష, మురకమి నార్వింగ్ వుడ్, ది ఆర్‌ఎస్‌ఎస్ రోడ్ మ్యాప్స్ ఫర్ 21 ఫస్ట్ సెంచురీ, నరసింహ శతకం, గజేంద్ర మోక్షం, ది డైరీ ఆఫ్ యంగ్ గర్ల్, లివింగ్ ఇన్ ద లైట్ అండ్ పేపర్ క్లబ్, నోట్ బుక్స్కు కూడా అనుమతిస్తూ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీచేసింది.