Cyber Cheating in Anantapur District : కళ్లముందే ఎన్నో మోసాలు, తెల్లవారితే చాలు వార్తల్లో డిజిటల్ అరెస్టులు, వందల సంఖ్యలో సైబర్ నేరాల గురించిన వార్తలు అయినా సైబరాసుల వలలో పడి కోట్లు పోగొట్టుకున్నవారెందరో. ఎప్పటికప్పుడు అధికారులు హెచ్చరిస్తున్నా, తగిన సూచనలు ఇస్తున్నా అత్యాశతో ఈ ఉచ్చులో పడుతున్నారు. కొందరు. ఇలాంటి ఘటనే అనంతపురం జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
Couple Losed 1 Crore In Cyber Fraud :అధిక లాభాలు వస్తాయనే అత్యాశతో అనంతపురం నగరానికి చెందిన దంపతులు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి రూ.1.33కోట్లు పోగొట్టుకుని లబోదిబోమంటున్నారు. హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన దంపతులకు ఈ నెల 15న ఫేస్‌బుక్‌లో ఓ గుర్తు తెలియని వ్యక్తి పరిచయమయ్యాడు. తమ సంస్థ ఎస్2 జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీస్‌లో చేరితే తక్కువ కాలంలోనే షేర్ల రూపంలో అధిక లాభాలు గడిస్తారని నమ్మబలికారు. ఈ క్రమంలో వీరిని సైబర్ నేరగాళ్ల వాట్సప్ గ్రూప్‌లోకి జాయిన్ చేసుకున్నారు.
స్టాక్ మార్కెట్లో లాభాల ఎర! - కోటి రూపాయలు పోగొట్టుకున్న సివిల్ ఇంజినీర్