తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్​లో మరో అగ్నిప్రమాదం - బాణసంచా పేలి దంపతులు మృతి - FIREWORKS EXPLOSION AT YAKUTPURA

హైదరాబాద్​లో బాణసంచా పేలడంతో దంపతులు మృతి - కుమార్తెకు తీవ్రగాయాలు - ఇంట్లో పిండివంటలు తయారుచేస్తుండగా నిప్పురవ్వలు ఎగసిపడి చోటుచేసుకున్న ప్రమాదం

FIRE ACCIDENT IN YAKUTPURA
Couples Died in Fire Accident in Hyderabad (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 29, 2024, 8:38 AM IST

Couples Died in Fireworks Accident in Hyderabad :హైదరాబాద్‌ యాకుత్‌పురాలోని బాణసంచా పేలడంతో దంపతులు మృతిచెందగా వారి కుమార్తె(18)కు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు తెలిసిన వివరాల ప్రకారం యాకుత్‌పురాలో నివాసం ఉండే దంపతులు బాణసంచా దుకాణం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాత్రి బాణసంచాను దుకాణం నుంచి ఇంటికి తీసుకెళ్లారు. ఇంట్లో పిండివంటలు తయారుచేస్తుండగా నిప్పురవ్వలు ఎగసిపడి బాణసంచాపై పడింది. దీంతో బాణసంచా పేలి ప్రమాదం జరిగింది. ఇంట్లో బాణసంచా నిల్వలు ఉంచుకోవద్దని వ్యాపారులకు పోలీసులు సూచించారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ABOUT THE AUTHOR

...view details