తెలంగాణ

telangana

ETV Bharat / state

క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక దంపతుల ఆత్మహత్య

Couple Commits Suicide on Credit Card bill Issue : క్రెడిట్‌ కార్డు బిల్లు చెల్లించలేక దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మేడ్చల్​ జిల్లా కీసర పోలీస్​ స్టేషన్​ పరిధిలో చోటుచేసకుంది. అప్పుల భారం ఎక్కువ కావడంతో భార్యాభర్తలు తీవ్ర మనస్థాపానికి గురై, పిల్లలను బంధువుల ఇంటికి పంపి ఇవాళ బలవన్మరణానికి పాల్పడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి, కేసు నమోదు చేశారు.

Family Suicide on Credit card Bill Issue
Couple Commits Suicide on Credit Card bill Issue

By ETV Bharat Telangana Team

Published : Feb 17, 2024, 5:21 PM IST

Updated : Feb 17, 2024, 10:21 PM IST

Couple Commits Suicide on Credit Card bill Issue :మేడ్చల్​ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. క్రెడిట్ కార్డుతో చేసిన అప్పులు కట్టలేక ఓ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం, లాలాపేటకు చెందిన సురేశ్​ కుమార్ భార్య భాగ్యతో కలిసి కీసరలో నివాసముంటున్నాడు. స్థాయికి మించి క్రెడిట్‌ కార్డు వాడడం వల్ల బిల్లు తడిచి మోపెడైంది. ఆ అప్పు తీర్చే స్థోమత లేకపోవడంతో, గడువు దాటినా సురేశ్​ నుంచి ఎలాంటి స్పందన లేదు.

మూఢ నమ్మకంతో ఆత్మహత్యలు.. ప్రత్యేక యంత్రంతో తలలు నరుక్కుని, హోమగుండంలో పడేలా చేసి..

దీంతో సంబంధిత అధికారులు ఇంటికి వచ్చి బిల్లు కట్టాలంటూ ఒత్తిడి తేవడంతో తోటివారి ముందు పరువు పోయిందని మానసికంగా కుంగిపోయారు ఆ దంపతులు. దానికి తోడు ఆర్థిక స్థోమత సరిగా లేక గతంలో చేసిన అప్పులు(Debts) కూడా తోడవడంతో తనువు చాలించాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఇవాళ తెల్లవారుజామున పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. తమ పిల్లలను బంధువుల ఇంటికి పంపి, ఈ దారుణానికి పాల్పడ్డారు.

Medchal Crime News :క్రెడిట్‌ కార్డు, తక్షణ అక్షయపాత్రగా అందరి జేబుల్లో చేరిపోతోంది. కానీ, సరైన సమయంలో అప్పు తీర్చకుంటే మాత్రం అవమానాన్నే మిగులుస్తోంది. అలాంటి అవమానంతోనే ఈ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. క్రెడిట్‌ కార్డులు వాడడమే కాదు, వాటి గురించి అవగాహన ముఖ్యమేనన్నట్టుగా ఈ ఉదంతం తెరపైకి వచ్చింది. తమ చావుకి కారణం క్రెడిట్ కార్డ్ అధికారులు(Officers) అంటూ సూసైడ్ నోట్ రాసి పెట్టారు.

రెండు బ్యాంకుల్లో కలిపి 12 లక్షల రూపాయలు,క్రెడిట్‌ కార్డులతో దాదాపుగా రూ.3 లక్షల అప్పులు మొత్తం కలిపి సుమారు రూ.15 లక్షల అప్పు అయినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు . ఈ అప్పులు తీర్చే స్థోమత లేకే, శనివారం తెల్లవారు జామున పురుగుల మందు తాగి భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఉదయం ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మృతదేహాలకు ఉస్మానియా మార్చురీలో(Osmania Mortuary) పోస్టుమార్టం నిర్వహించారు.

Couple Suicide Over Debt :స్థాయికి మించిన అప్పులు ఎప్పుడూ ప్రమాదకరమే. క్రెడిట్ కార్డు వాడితే ప్రయోజనాలున్నాయి అనే ఆలోచన చేసే వారు, ఆర్థిక అంశాలు(Financial Aspects) రెండు వైపులా పదునున్న కత్తిలాంటివేనని గుర్తుంచుకోవాల్సిన అవసరముంది.

'JEE చదవలేను, అమ్మా, నాన్న క్షమించండి'- కోటాలో మరో విద్యార్థి సూసైడ్​

రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం, కుటుంబ కలహాలతో భార్య సూసైడ్ - భర్తను కొట్టిచంపిన బంధువులు!

Last Updated : Feb 17, 2024, 10:21 PM IST

ABOUT THE AUTHOR

...view details