ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రతి నెల ముట్టజెప్పాల్సిందే - లేకపోతే వారికే వేధింపులే - CORRUPTION IN ICDS PROJECT

ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలో వసూలురాణిగా గుర్తింపు పొందిన ఓ అధికారి - ప్రతినెలా ప్రతి కార్యకర్త, ఆయా నుంచి రూ.750 (500+250) చొప్పున వసూలు

Corruption in ICDS Project Woman Officer
Corruption in ICDS Project Woman Officer (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 4, 2025, 2:52 PM IST

Corruption in ICDS Project Woman Officer : ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలో ఆమె ఎనిమిదేళ్లుగా పని చేస్తున్నారు. మధ్యలో మరో ప్రాజెక్టుకు బదిలీ అయినా వెంటనే పాత ప్రాజెక్టుకు వచ్చారు. వైఎస్సార్పీపీలో ఓ మాజీ ఎమ్మెల్యే అండ ఉంది. ఆయన ఏపార్టీలో ఉన్నా ఈమె స్థానం పదిలం. ప్రభుత్వం మారినా బదిలీ కాలేదు. ఆమె పరిధిలో సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలను వేధించి వసూలురాణిగా గుర్తింపు పొందారు. ఇది ఒక ప్రాజెక్టు అధికారిణి కథే. ఎవరైనా అడిగితే జిల్లా అధికారిణికి ఇవ్వాలనే సమాధానం వస్తుంది.

తెరమీదకు వసూళ్లపర్వం: జిల్లాల పునర్విభజన తర్వాత ఉమ్మడి కృష్ణాలో రెండు జిల్లా కార్యాలయాలు ఏర్పడ్డాయి. విజయవాడలో ఉండాల్సిన ఎన్టీఆర్‌ జిల్లా కార్యాలయం కానూరులో పెట్టారు. బందరులో ఉండాల్సిన ఐసీడీఎస్‌ కార్యాలయమూ కానూరులోనే పెట్టారు. మార్చమని ఉన్నతాధికారులు, మంత్రి ఆదేశించినా పట్టించుకోలేదు. ఫలితంగా ఇద్దరినీ సస్పెండ్‌ చేశారు. దీంతో ఆ శాఖలో వసూళ్లపర్వం తెరమీదకు వచ్చింది. సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలకు పంపిన వాయిస్‌ మెయిళ్లు డబ్బులు పంపిన స్క్రీన్‌షాట్‌లు వెలుగు చూస్తున్నాయి. రూ.లక్షల్లో వసూలుకు పాల్పడినట్లు తెలిసింది. కింది స్థాయి నుంచి సీడీపీవో వరకు బాధితులే.

ఇది చూశారా ! - ఒకే గదిలో మూడు అంగన్వాడీ కేంద్రాలు - గ్రామస్థుల ఆగ్రహం

డబ్బులు ఇవ్వకపోతే వేధింపులు : కృష్ణా జిల్లాలో 1,600 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ప్రతి కేంద్రంలో ఒక కార్యకర్త, ఆయా ఉంటారు. వీరి వేతనాలు అంతంతే. కానీ ప్రతినెలా ప్రతి కార్యకర్త, ఆయా నుంచి రూ.750 (500+250) చొప్పున ముట్టజెప్పాలి. ఈ లెక్కన రూ.12 లక్షలు సూపర్‌వైజర్లు వసూలు చేసి సీడీపీవోలకు అందిస్తారు. అక్కడ కొంత నొక్కేసి మిగిలింది ఉన్నతాధికారులకు చేరుస్తున్నారు. కృష్ణాలో 8 ప్రాజెక్టులకు 8 మంది సీడీపీవోలు ఉన్నారు. ఈ వసూలులో వీరి వాటా 25 శాతం. ఒక నెల ఇవ్వకపోతే రెండో నెల కలిపివ్వాలి. ఇవ్వకపోతే పౌష్టికాహారం గల్లంతని షోకాజ్‌లు, విద్యార్థుల హాజరు తక్కువని వేధింపులు ఉంటాయి.

ఎన్టీఆర్‌ జిల్లాలో 1200 కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో కేంద్రం నుంచి రూ.750 చొప్పున రూ.9 లక్షలు గుంజుతున్నారు. ఎన్టీఆర్‌లో ఆరు ప్రాజెక్టులకు ఆరుగురు సీడీపీవోలు ఉన్నారు. సూపర్‌వైజర్లు, సీడీపీవోలదే హవా. తనిఖీలు లేకుండా షోకాజ్‌లు లేకుండా మీడియాలో, పత్రికల్లో వార్తలు వస్తే వాటిపై చర్యలు తీసుకోనందుకే వసూళ్లట.

కేంద్రానికి వెళ్లేసరికి 50 శాతం హాంఫట్‌ : అదనంగా కమీషన్లు, కానుకలు సరేసరి. విలువైన పట్టుచీరలు, నగలు ఇవ్వాల్సిందే. ఇవి సూపర్‌వైజర్ల ఖాతాలో పడుతున్నాయి. రెండు జిల్లాల్లో రూ.కోట్ల విలువైన పౌష్టికాహారం అందుతోంది. సీడీపీవో స్థాయి నుంచి క్లస్టర్‌ నుంచి కేంద్రానికి వెళ్లేసరికి 50 శాతం హాంఫట్‌ అవుతున్నాయి. గుత్తేదారుల నుంచి కమీషన్లు అందుకుంటున్నారు. సరకు విలువ మేరకు కమీషన్లు ఇవ్వాలి. ఇటీవల కొత్త సంవత్సర వేడుకలకు రాణుల ప్రసన్నానికి ఒక్కో కేంద్రం నుంచి రూ.500 వసూలు చేశారు. మాజీ ప్రధాని మనోహ్మన్‌ మృతితో సంతాపదినాలు ఉండగా వేడుకలు ఎలా చేశారనేది ప్రశ్న.

తొమ్మిదేళ్లుగా రాజ్యం ఏలుతున్నారు : ఒక్కో అంగన్‌వాడీ కేంద్రానికి ఖర్చుల కోసం రూ.10 వేలు విడుదలయ్యాయి. ఐసీడీసీఎస్‌ సిబ్బంది ఐదు రకాల మొక్కలు, రెండు డిప్పలు మట్టి ఇచ్చి రూ.1500 వసూలు చేశారు. పామర్రు క్లస్టరులో రూ.1,02,500 వసూలు చేశారు. సీడీపీవోను అడిగితే తన దృష్టికి రాలేదన్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే అండతో ఆమె తొమ్మిదేళ్లుగా రాజ్యం ఏలుతున్నారు. పీడీల సర్వీసు మొత్తం ఉమ్మడి జిల్లాలోనే ఉంది. మధ్యలో బాపట్ల వెళ్లినా వెంటనే వచ్చేశారు. సీడీపీవోలుగా వివిధ ప్రాజెక్టుల్లో చేసి మూడేళ్లుగా ఒకే పోస్టులో ఇద్దరూ కొనసాగడం గమనార్హం.

అంగన్వాడీల సమ్మె కాలానికి వేతానాలు చెల్లింపునకు ఉత్తర్వులు

రంపచోడవరంలో అంగన్వాడీ పిల్లలకు ఎమ్మెల్యే పాఠాలు - MLA Shirisha Visit Anganwadi Center

ABOUT THE AUTHOR

...view details