తెలంగాణ

telangana

ETV Bharat / state

నగ్న పూజలకు సహకరిస్తే డబ్బులిస్తాం : విద్యార్థినికి వంట మనిషి వేధింపులు - COOK HARASSING THE STUDENT

హాస్టల్‌ వంట మనిషితో సహా ముగ్గురిపై కేసు - ఒకరిని అరెస్టు చేసిన పోలీసులు

COOK HARRASIG THE FEMALE STUDENT
ఓ విద్యార్థినికి వంట మనిషి వేధింపులు (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 27, 2024, 4:17 PM IST

Hostel Cook Harassment in Manthgani : పదో తరగతి విద్యార్థినికి డబ్బులు ఆశ చూపి నగ్న పూజలకు సహకరించాలని వేధించినందుకు ముగ్గురిపై మంథని పోలీసులు కేసు నమోదు చేసి ఒకరిని అరెస్టు చేసిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. మిగతా ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంథని పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ బాలిక పెద్దపల్లి జిల్లా మంథనిలోని ఓ హాస్టల్‌లో ఉంటూ పదో తరగతి చదువుకుంటోంది. హాస్టల్‌లో పని చేసే వంట మనిషి ఈ నెల 18 (సోమవారం)న పక్కనే ఉండే తన ఇంటికి పిలిచి డబ్బులు ఇస్తామని ఆశ చూపింది. నగ్న పూజలకు రావాలని ఆ విద్యార్థినిని కోరింది. దీంతో వెంటనే ఆ విద్యార్థిని తిరస్కరించింది. వంట మనిషి నరేశ్‌ అనే యువకుడిని పిలిచి అతని సెల్‌ఫోన్‌లో విద్యార్థిని ఫొటోలు తీయించింది. అంతేకాకుండా వీడియో కాల్‌ చేసి వంట మనిషి తన బంధువు నర్సయ్యకు చూపించింది. అతను ఆ విద్యార్థిని తమకు అవసరం లేదని చెప్పడంతో వంట మనిషి ఆ బాలికను వదిలేసింది.

ఆగ్రహించిన బంధువులు : వంటమనిషి చేసిన పనులకు భయపడిన బాలిక హాస్టల్‌లో కాకుండా పట్టణంలోని తమ బంధువుల ఇంటికి వెళ్లి అక్కడి నుంచే రోజూ పాఠశాలకు వెళ్తోంది. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. బాలిక తల్లి సోమవారం మంథనికి వచ్చి ప్రశ్నించగా, జరిగిన ఘటనను విద్యార్థిని వివరించింది. దీంతో ఆగ్రహించిన బంధువులు వసతి గృహం వద్దకు వచ్చి వంట మనిషిని నిలదీశారు. చదువుకోవడానికి వస్తే ఇలాంటి పనులు చేయిస్తారా? అని కుటుంబ సభ్యులు ఉపాధ్యాయులను నిలదీశారు.

విషయం ఆలస్యంగా బయటికి రావడంతో అందరూ ఈ ఘటనపై విస్మయం వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థిని కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నరేశ్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. అనంతరం అతనిపై పోక్సో కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. వంట మనిషి, ఆమెతో పాటు తన బంధువు నర్సయ్య పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారిని ఎలాగైనా పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

ఆ యువకుడి వేధింపుల వల్లే నా చిట్టితల్లి ఆత్మహత్య చేసుకుంది - భువనగిరిలో యువతి మృతిపై తండ్రి ఫిర్యాదు

మాజీ ప్రియుడితో మళ్లీ సంబంధాలు - భర్త చెల్లెలికి తెలిసిపోవడంతో వేధింపులు - తట్టుకోలేక?

ABOUT THE AUTHOR

...view details