Congress Parliament Elections 2024 :లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌కి వచ్చేలోగా ఐదు గ్యారంటీల్లో మరికొన్నింటిని అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. షెడ్యూల్ ప్రకటించగానే వెంటనే ప్రవర్తనా నియామావళి అమల్లోకి వస్తుంది కాబట్టి కొత్త పథకాలు అమలు చేసేందుకు వీలుండదు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మహిళలకి ప్రతినెల 2,500 నగదు బదిలీ, 500కే గ్యాస్ సిలిండర్, గృహ వినియోగదారులకు 5 లక్షల సాయం పథకాల్లో రెండిటినీ లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందుగా అమలు చేసేలా ఆర్ధికశాఖ కసరత్తు చేస్తోంది. ఏ పథకం కింద ఎంత మందికి ప్రయోజనం కలుగుతుంది.
14 లోక్‌సభ స్థానాలే టార్గెట్ - గెలుపు గుర్రాల ఎంపికపై నేడు కాంగ్రెస్ కీలక సమావేశం
Six Guarantees Budget : ఖజానాపై ఎంతభారం పడుతుందనే అంశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. మహిళలకు ప్రతినెల 2,500 ఇచ్చే పథకానికి 92.93 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అందులో ఇప్పటికే పింఛన్ తీసుకుంటున్న వారిని మినహాయిస్తే ఎంత మందికి ఇవ్వాల్సి వస్తుందనే అంశంపై కసరత్తు జరుగుతోంది. ఆ విధంగా లెక్క వేసినా దాదాపు 50 లక్షల మందికి ఇవ్వాల్సి రావచ్చని సమాచారం. ప్రతినెల ఎంత మొత్తం అవసరం అవుతుందో నిర్ధరణకు వచ్చి అమలుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 500కే గ్యాస్ సిలిండర్ కోసం 91.5 లక్షల దరఖాస్తులు వచ్చాయి.