తెలంగాణలో ప్రభుత్వ కొలువుల జాతర షురూ - ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ ఫోకస్ Congress Govt Exercise to Fill 2 Lakh Jobs :ప్రభుత్వ ఉద్యోగం.! దీనికుండే క్రేజ్ అంతాఇంతా కాదు. చదువు పూర్తైంది మొదలు అనేక మంది ఉద్యోగార్థులు ప్రభుత్వ ఉద్యోగం కోసమే సన్నద్ధమవుతుంటారు. ఇందుకు కాస్త సమయం పట్టినా, ఆర్థికంగా కష్టమైనా, ఓపికగా చదివి ఎలాగైనా ఉద్యోగం సాధించాలని నిర్ణయించుకుంటా రు. ప్రభుత్వ ఉద్యోగం(Govt Job) సాధిస్తే గౌరవంగా బతకొచ్చనేది వారి భావన. అందుకు రాత్రింబవళ్లు, కుటుంబాలకు దూరమై చదవడానికి కూడా వెనకాడరు. అంతటి కసితో చదివితేనే ప్రభుత్వ ఉద్యోగం దరి చేరుతుంది.
ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాల భర్తీ : సీఎం రేవంత్ రెడ్డి
ఈ క్రమంలో ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్లు రాక, వచ్చినా సమయానికి ఫలితాలు విడుదలవ్వక ఇబ్బందులు పడుతుంటారు. కానీ, అదంతా గతం. ప్రస్తుతం నోటిఫికేషన్ల జారీకి, ఉద్యోగాల భర్తీకి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లు ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల జారీకి కసరత్తులు చేస్తోంది. ఇదే విషయాన్ని ఇటీవలే సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
CM Revanth Focus on Jobs Recruitment :ఏళ్లుగా నిరుద్యోగులు పడుతున్న కష్టాలు, వారి బాధలు తెలుసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఏడాదిలో 2 లక్షల నియామకాలను చేపట్టడమే లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా ఉద్యోగార్థుల డిమాండ్ల మేరకు మొదట టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసిన సర్కారు, పారదర్శకంగా నియామకాలు చేపట్టనున్నట్లు ప్రకటించింది. దీంతో నిరుద్యోగుల్లో ప్రభుత్వం భరోసా నింపినట్లైంది.
గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన పరీక్షల్లో ప్రతిభ చూపిన వారికి నియామకపత్రాలు అందిస్తూ భరోసా నింపేందుకు కృషి చేస్తుంది. ఈ మేరకు కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించిన 13వేల మందికి పైగా, గురుకులాల గ్రాడ్యుయేట్ టీచర్లు(Gurukulala Graduate Teachers), ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రెరీయన్లుగా ఉద్యోగాలు సాధించిన 1,997మందికి, స్టాఫ్‌నర్సులు 7వేల 94మందికి నియామక పత్రాలను సర్కారు అందించింది. ఇలా 70 రోజుల్లోనే 25 వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
CM Revanth Reddy Focus On TSPSC New Board : మొదటగా గ్రూప్-1 నోటిఫికేషన్లలో పోస్టుల సంఖ్యను పెంచింది. గతప్రభుత్వంలో 2022లోనే 503 పోస్టులతో నోటిఫికేషన్ విడుదలైంది. పరీక్షల నిర్వాహణలో అక్రమాలు, పేపర్ లీకేజీల కారణంగా గ్రూప్-1 రెండుసార్లు రద్దైంది. దీనికి మరో 60 పోస్టులు పెంచి ఈసారి 563 పోస్టులతో నూతన నోటిఫికేషన్ విడుదల చేసింది. మరోవైపు గత ప్రభుత్వంలోనే నోటిఫికేషన్లు జారీ అయ్యి, పరీక్షల నిర్వాహణలో ఆలస్యం అవుతున్న గ్రూప్-2, గ్రూప్-3 నోటిఫికేషన్లలోనూ అదనపు పోస్టులు పెంచేందుకు టీఎస్పీఎస్సీ యోచిస్తున్నట్లు తెలుస్తుంది.
టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం - గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేసినట్లు ప్రకటన
2022లో విడుదలైన ఈ నోటిఫికేషన్ల ప్రకారం గ్రూప్-2లో 783 ఖాళీలున్నాయి. గ్రూప్-3లో 1360కిపైగా పోస్టులున్నా యి. 2022 నుంచి ఇప్పటివరకు ఏర్పడ్డ ఖాళీలను కలుపుకొని అనుబంధ నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే గ్రూప్-4 మెరిట్‌లీస్ట్‌ను విడుదల చేసిన ప్రభుత్వం త్వరలోనే నియామక పత్రాలు అందించనుంది. గ్రూప్స్‌తో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులన్నింటినీ భర్తీ చేసేలా మెగా డీఎస్సీ నిర్వహిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
ఈ మేరకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గతేడాది 5,089 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు గతప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయగా, 1,77,502మంది దరఖాస్తు చేసుకున్నారు. 2023 నవంబరు 20 నుంచి 30వ తేదీ మధ్యలో రాతపరీక్ష నిర్వహించాల్సి ఉండగా అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్(Election Notification) వెలువడడంతో రాతపరీక్ష నిర్వహించలేదు. కాగా అప్పట్లో 9,800 పోస్టులు ఉన్నప్పటికీ, రేషనలైజేషన్ ఆధారంగా నాటి ప్రభుత్వం 5,089 పోస్టులకే నోటిఫికేషన్ జారీ చేసింది.
Mega DSC Notification Will Release Soon : ఈ అంశంపై దృష్టి సారించిన కాంగ్రెస్ ప్రభుత్వం డీఈఓల ద్వారా రాష్ట్రంలోని ఖాళీలను తెలుసుకుంది. ఈ మేరకు పాత నోటిఫికేషన్‌ను అదనంగా దాదాపు 5వేల పోస్టులను కలిపి రీనోటిఫికేషన్ ప్రకటించే అవకాశం ఉందని అధికారిక వర్గాలంటున్నాయి. దీనికి సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే విద్యాశాఖ పూర్తి చేసింది. త్వరలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండటంతో, అంతకు ముందే దాదాపు 10వేల పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సర్కారు ఏర్పాట్లు చేస్తుందని విద్యావేత్తలు చెబుతున్నారు.
Telangana Job Calendar 2024 : ప్రభుత్వంలోని అన్ని శాఖల్లోని ఖాళీలను గుర్తిస్తున్న సర్కారు పోలీసు, రెవెన్యూ, వైద్య, విద్యుత్, అటవీ, వ్యవసాయ తదితర రంగాలకు సంబంధించి నోటిఫికేషన్లు జారీ చేసేందుకు సిద్ధంగా ఉనట్లు తెలుస్తుంది. వైద్యారోగ్య శాఖలో 5వేల పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. దాంతోపాటు సింగరేణిలో 485పోస్టులకు ఇప్పటికే ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇలా ప్రభుత్వం నిరుద్యోగులకు అండగా ఉండేందుకు, ప్రభుత్వం సేవల్లో వారిని భాగస్వామ్యం చేసేందుకు కృషి చేస్తుంది.
ఇంకా యుద్ధం ముగియలేదు - ఇది విరామం మాత్రమే : సీఎం రేవంత్ రెడ్డి
ఇదే క్రమంలో వయోపరిమితిని కూడా సడలించింది. అలాగే మేనిఫెస్టోలో ప్రకటించినట్లు జాబ్‌క్యాలెండర్‌ను విడుదల చేసేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు ప్రభుత్వ పెద్దలు వెల్లడించారు. దాంతోపాటు నోటిఫికేషన్ల జారీలో, పరీక్షల నిర్వాహణలో ఎలాంటి లోపాలు లేకుండా కోర్టు కేసుల్లో చిక్కకుండా నియామకాలు ఆలస్యం కాకుండా రేవంత్ సర్కారు ముందస్తు చర్యలు తీసుకుంటోందని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించడంతో నిరుద్యోగుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.
Unemployed Youth Preparation in Telangana : ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమయ్యే వారిలో ప్రభుత్వ ప్రకటనలు నూతనోత్సాహాన్ని నింపాయి. ఈసారి ఎలాగైనా కొలువు సాధించాలనే లక్ష్యంతో సిద్ధమవుతున్నారు. దాంతోపాటు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే కొత్తవారు సైతం శిక్షణ తీసుకునేందుకు మొగ్గుచూపుతున్నారు. పోటీ పరీక్షల(Competitive Examinations) నిమిత్తం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో ఉద్యోగార్థులు హైదరాబాద్‌కు వస్తున్నారు. దీంతో శిక్షణ కేంద్రాలు, గ్రంథాలయాలు, రీడింగ్ హాళ్లు, ప్రైవేటు వసతిగృహాలకు డిమాండ్ పెరిగింది.
నగరంలోని ఎస్ఆర్ నగర్, అశోక్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్, అమీర్‌పేట్, ఎల్బీనగర్ ప్రాంతాలు విద్యార్థులతో సందడిగా కనిపిస్తున్నాయి. కొంతమంది ఆయా జిల్లా కేంద్రాల్లోనే ఉంటూ ప్రిపేరవుతున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే వారు ఇంటిపట్టునే ఉంటూ ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా సన్నద్ధమవుతున్నారు. మొత్తమ్మీదా 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటనలు వెలువడితే ఏడాదంతా పరీక్షల సమయంగా నిలవనుంది. నిరుద్యోగుల కష్టాలు తీర్చేలా వారి భవిష్యత్‌కు బంగారు బాటలు వేసేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను విద్యావేత్తలు, మేధావులు, ఉద్యోగార్థులు స్వాగతిస్తున్నారు.
ఈనెల 27న సాయంత్రం రెండు గ్యారంటీలను ప్రారంభిస్తాం : రేవంత్ రెడ్డి
విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్- ఏటా రూ.10వేల స్కాలర్షిప్!