తెలంగాణ

telangana

ETV Bharat / state

కాంగ్రెస్ సర్కార్​ కీలక నిర్ణయం - నీటి పారుదల శాఖలో రూ.11 వేల 500 కోట్ల పనులు రద్దు! - Telangana Irrigation works

Congress Government Key Decision on Irrigation Department : నీటి పారుదల శాఖలో ఎన్నికలకు ముందు టెండర్లు పిలిచి చేపట్టని పనులు, ఎన్నికల కోడ్‌తో ఆగిపోయిన పనులు నిలిపివేయాలని కాంగ్రెస్​ సర్కార్​ యోచిస్తోంది. ఈ పనుల విలువ సుమారు రూ.11 వేల 500 కోట్లుగా ఉంటుందని అధికారులు తేల్చారు. ఈ వివరాలన్నింటినీ ప్రభుత్వానికి పంపినట్లు తెలుస్తోంది.

Telangana Irrigation Department works
Telangana irrigation projects works

By ETV Bharat Telangana Team

Published : Jan 30, 2024, 6:55 AM IST

కాంగ్రెస్ సర్కార్​ కీలక నిర్ణయం - నీటి పారుదల శాఖలో రూ.11 వేల 500 కోట్ల పనులు రద్దు!

Congress Government Key Decision on Irrigation Department : నీటి పారుదల శాఖలో ఎన్నికలకు ముందు టెండర్లు పిలిచి, ఒప్పందం చేసుకొని పనులు ప్రారంభించని, ఒప్పందాల దశలో ఎన్నికల నియామావళితో ఆగిపోయిన పనులను రద్దు చేసే యోచనలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు భారీ సంఖ్యలో చెక్‌డ్యాంల నిర్మాణానికి అనుమతి ఇచ్చిన, టెండర్లు పిలిచి ప్రారంభించని పనుల వివరాలన్నింటినీ అందజేయాలని ప్రభుత్వం కోరినట్లు తెలిసింది.

సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు స్వస్తి?

ఆ శాఖలో అలాంటి పనుల విలువ సుమారు రూ.11 వేల 500 కోట్లుగా తేల్చారు. ఈ వివరాలన్నింటినీ ప్రభుత్వానికి పంపినట్లు సంబంధిత వర్గాల సమాచారం. వీటిలో కొన్నింటికి ఒప్పందాలు జరిగాయి. పనులు ప్రారంభం కాలేదు. ఎన్నికల షెడ్యూల్‌ రావడంతో టెండర్‌ దశలోనే కొన్ని ఆగిపోయాయి. ఉదాహరణకు రూ.234 కోట్లతో కరీంనగర్‌ జిల్లాలో లోయర్‌ మానేరు దిగువన మున్నేరు వాగు నుంచి రక్షణ పనులకు సంబంధించి టెక్నికల్‌, ఫైనాన్షియల్‌ బిడ్‌ తెరిచారు.

నీటిపారుదల రంగంపై సర్కార్ ఫోకస్ - నేడు సీఎం రేవంత్ సమీక్ష

Congress Govt Decided Cancelled Irrigation projects Works: నిజామాబాద్‌ జిల్లాలో రెండు చిన్న ఎత్తిపోతల పథకాలకు ఒప్పందాలు జరిగి పనులు ప్రారంభించలేదు. వరంగల్‌ నగరంలో వరద రక్షణ పనికి రూ.70 కోట్లతో ఒప్పందం జరిగింది. ఇక్కడే భద్రకాళి చెరువు నుంచి వరద రక్షణ పనిని రూ.427 కోట్లతో చేపట్టారు. మున్నేరు నుంచి ఖమ్మం ముంపునకు గురికాకుండా ఉండేందుకు రూ.690 కోట్లతో రక్షణ గోడ నిర్మాణానికి సంబంధించి పనులకు టెండర్‌ స్వీకరించే గడువును పొడిగించారు. నెలాఖరు వరకు సమయం ఉంది.

Telangana Irrigation Department works : టెండర్లు ఖరారు చేసి, ఒప్పందం చేసుకొని పనులు ప్రారంభించని పనుల విలువే రూ.9 వేల 853 కోట్లు ఉంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఉదండాపూర్‌, కురుమూర్తి రాయ సాగర్‌ రిజర్వాయర్ల నుంచి కాల్వ పనులకు గత ప్రభుత్వం టెండర్లు పిలిచి ఖరారు చేసింది. 11 ప్యాకేజీలుగా విభజించి పిలిచిన ఆ టెండర్ల విలువ సుమారు రూ.5 వేల 900 కోట్లు. కొన్ని ప్యాకేజీల పనులకు కమిషనర్‌ ఆఫ్‌ టెండర్స్‌ ఆమోదం తెలిపినా ఇంకా ఒప్పందం ఖరారు కాలేదు.

వాటితోపాటు మరికొన్ని పనులు పరిశీలన పూర్తయి, టెండర్‌ పిలవాల్సిన దశలో ఉన్నాయి. ఈ పనుల విలువ రూ.15 వందల 52 కోట్లుగా తెలిసింది. ఇలా మొత్తం సుమారు రూ.11 వేల 5 వందల కోట్ల విలువైన పనుల వివరాలను నీటి పారుదల శాఖ ప్రభుత్వానికి పంపింది. వీటిపై త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.

సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యం.. 10 నెలల్లో రూ.20 వేల కోట్ల వ్యయం

KRMB: ఎల్లుండి రాయలసీమ ఎత్తిపోతలను పరిశీలించనున్న కృష్ణాబోర్డు ప్రతినిధులు

ABOUT THE AUTHOR

...view details