తెలంగాణ

telangana

ETV Bharat / state

జూన్​ 2న రోజంతా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు - మార్నింగ్​ నుంచి రాత్రి వరకు ఫుల్​ షెడ్యూల్​ ఇదే - TG Formation Day Celebrations 2024 - TG FORMATION DAY CELEBRATIONS 2024

Telangana Formation Day Celebrations 2024 : రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ వేడుకలకు కాంగ్రెస్​ అగ్రనేత సోనియా గాంధీ హాజరు కానున్నారు. జూన్​ 2 ఉదయం 9.30 గంటలకు అమరవీరుల స్థూపం వద్ద సీఎం నివాళులు అర్పిస్తారు. ఈ సందర్భంగా తెలంగాణ అధికార గీతం జయ జయహే తెలంగాణను ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి జాతికి అంకితం చేయనున్నారు.

Telangana Formation Day Celebrations 2024
Telangana Formation Day Celebrations 2024 (Telangana Formation Day Celebrations 2024)

By ETV Bharat Telangana Team

Published : May 30, 2024, 10:14 PM IST

Telangana Formation Day Celebrations 2024 :తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 2న ఉదయం, సాయంత్రం ఉత్సవాలు జరగనున్నాయి. ఆ రోజు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు గన్​పార్కులో అమరవీరుల స్థూపం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పిస్తారు. ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరగనున్న కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరై జెండా ఆవిష్కరిస్తారు. అనంతరం పోలీసు బలగాల పరేడ్, మార్చ్ ఫాస్ట్, వందన స్వీకార కార్యక్రమాలు ఉంటాయి.

Telangana Decade CelebrationsChief Guest :అదే వేదికపై 'జయ జయహే తెలంగాణ' రాష్ట్ర అధికార గీతాన్ని జాతికి అంకితం చేస్తారు. వేడుకల్లో సోనియా గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. పోలీసు సిబ్బందికి, ఉత్తమ శకటాలకు అవార్డులను ప్రదానం చేసి ఫొటో సెషన్​లో పాల్గొంటారు. సాయంత్రం ట్యాంక్ బండ్​పై ఉత్సవాలు జరుగుతాయి. అక్కడ తెలంగాణ హస్తకళలు, ఉత్పత్తులు, ఫుడ్​స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు.

Telangana Decade Celebrations Schedule :సాయంత్రం ఆరున్నరకు సీఎం రేవంత్ రెడ్డి ట్యాంక్​బండ్​కు చేరుకొని అక్కడి స్టాళ్లను సందర్శిస్తారు. సుమారు 700 మంది కళాకారులతో తెలంగాణ కళారూపాల కార్నివాల్ నిర్వహిస్తారు. అనంతరం 70 నిమిషాల పాటు సాంస్కృతిక, నృత్య ప్రదర్శనలు ఉంటాయి. ఆ తర్వాత సుమారు 5 వేల మంది జాతీయ జెండాలతో ట్యాంక్​ బండ్​పై భారీ ఫ్లాగ్​ వాక్ నిర్వహిస్తారు.

ఫ్లాగ్ వాక్ జరుగుతుండగా పదమూడున్నర నిమిషాల 'జయ జయహే తెలంగాణ' పూర్తి నిడివి గీతాన్ని విడుదల చేస్తారు. కవి అందెశ్రీ, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణిని సన్మానిస్తారు. రాత్రి 8 గంటల 50 నిమిషాల నుంచి 10 నిమిషాల పాటు హుస్సేన్ సాగరం మీదుగా ఆకాశంలో రంగులు విరజిమ్మేలా బాణాసంచా కార్యక్రమం నిర్వహిస్తారు.

Invitation to Former CM KCR :మరోవైపు మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్​ రావును జూన్‌ 2వ తేదీన నిర్వహించనున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు సీఎం రేవంత్‌ రెడ్డి ఆహ్వానించారు. వ్యక్తిగతంగా లేఖ రాయడంతో పాటు వేడుకలకు ఆహ్వానాన్ని కూడా ఆయనకు పంపారు.

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు గ్రాండ్​గా జరిపేందుకు రేవంత్ పక్కా ప్లాన్ ​ - మరి ఈసీ అనుమతి ఇస్తుందా? - TS Formation Day Celebrations 2024

Telangana Decade Celebration 2023 : ఘనంగా ముగిసిన రాష్ట్ర దశాబ్ది వేడుకలు

ABOUT THE AUTHOR

...view details