Congress Focus On Nizamabad MP Seat : నిజామాబాద్ పార్లమెంట్ స్థానం గతంలో కాంగ్రెస్‌కు కంచుకోటలా ఉండేది. నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ, స్వతంత్ర అభ్యర్థి ఒక్కోసారి ప్రాతినిథ్యం వహించారు. మిగిలిన అన్నిసార్లు హస్తం హవానే నడిచింది. ఊహించని విధంగా గత ఎన్నికల్లో ఆ పార్టీ మూడో స్థానానికి పరిమితమైంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్(Congress) గెలిచి అధికారం చేపట్టగా, ఇందూరులో గెలవాలని పార్టీ పట్టుదలతో ఉంది. ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ బలపడిన తర్వాత త్రిముఖ పోరు అనివార్యంగా మారింది.
నేడు కేబినేట్ భేటీ - బడ్జెట్, రెండు గ్యారంటీల అమలుకి ఆమోదం!
Nizamabad Parliament Seat : గత ఎన్నిక అనుభవం దృష్ట్యా, కాంగ్రెస్ గెలుపు అవకాశాలున్న అభ్యర్థి కోసం అన్వేషణ ఆరంభించింది. ఇప్పటికే పలువురి పేర్లు పరిశీలించింది. నిజామాబాద్ నుంచి కాంగ్రెస్ తరఫున బలమైన అభ్యర్థిని బరిలో నిలపాలని ముఖ్యమంత్రిరేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) గట్టి పట్టుదలతో ఉన్నారు. అసెంబ్లీ ఫలితాలను పునరావృతం చేయాలనే సంకల్పంతో బలమైన అభ్యర్థుల వేట సాగుతోంది. నిజామాబాద్ లోక్‌సభ నుంచి పోటీ కోసం ప్రస్తుత ఎమ్మెల్సీ, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి, మాజీ ప్రభుత్వ విప్ ఎరవత్రి అనిల్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, అరికెల నర్సారెడ్డి, కాటిపల్లి వికాస్‌రెడ్డి, ఇమ్మడి గోపీ దరఖాస్తు చేశారు.
'జల విద్యుత్ కేంద్రాల ఔట్ లెట్లను స్వాధీనం చేయాలంటే ప్రభుత్వం నుంచి ఆమోదం తీసుకోవాల్సిందే'