Congress CPM Seat Sharing: ఇండియా కూటమి పొత్తుల్లో భాగంగా సీపీఎంకు 1 పార్లమెంటు, 8 శాసనసభ స్థానాలు కేటాయిస్తున్నట్లు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి (YS Sharmila) ప్రకటించారు. ఈమేరకు పీసీసీ అధ్యక్షురాలి కార్యాలయం ప్రకటన జారీ చేసింది. పొత్తుల్లో భాగంగా అరకు లోక్ సభ స్థానంలో సీపీఎం అభ్యర్ధి పోటీ చేస్తారని స్పష్టం చేసింది.
అలాగే రంపచోడవరం, కృష్ణా జిల్లా గన్నవరం, మంగళగిరి, కురుపాం, నెల్లూరు టౌన్, విజయవాడ సెంట్రల్, గాజువాక, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాలు సైతం సీపీఎంకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ఈ నియోజకవర్గాల్లో సీపీఎం పార్టీ అభ్యర్ధులు మాత్రమే ఇండియా కూటమి తరపున పోటీ చేస్తారని స్పష్టం చేస్తూ ప్రకటన జారీ అయ్యింది. సీట్ల సర్దుబాటులో భాగంగా కాంగ్రెస్ పార్టీతో జరిగిన చర్చల మేరకు సీపీఎం రాష్ట్ర కమిటీ కూడా ఈ నిర్ణయానికి అంగీకారం తెలియజేసింది.
ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా విడుదల - 6 లోక్‌సభ, 12 అసెంబ్లీ స్థానాలకు ప్రకటన - AP Congress candidates second list
AP Congress Candidates List: మరోవైపు ఆంధ్రప్రదేశ్లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించిన రెండు జాబితాలను కాంగ్రెస్ విడుదల చేసింది. తొలి జాబితాలో 5 లోక్‌సభ, 114 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, రెండో జాబితాలో 6 లోక్‌సభ, 12 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. దీంతో మొత్తంగా ఇప్పటివరకు 11 లోక్‌సభ, 126 అసెంబ్లీ స్థానాలకు ఏపీ కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించినట్లైంది. అయితే తాజాగా సీపీఎంకు ఇచ్చిన జాబితాతో కలిపి మొత్తం 12 లోక్‌సభ, 134 అసెంబ్లీ స్థానాలకు ఇండియా కూటమి అభ్యర్థులను ప్రకటించింది.
114 అసెంబ్లీ, ఐదు లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ - కడప లోక్‌సభ బరిలో షర్మిల - AP CONGRESS LIST
Congress CPM Seat Sharing