TGPSC Hostel Welfare Officer: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఆన్‌లైన్ పరీక్ష సోమవారం, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రంలో ప్రారంభమైంది. స్థానిక డిగ్రీ, పీజీ కళాశాలలో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నిమిషం నిబంధన అమలు ఉండటంతో గంట ముందుగానే అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారిని క్షుణ్ణంగా పరిశీలించి కేంద్రంలోకి అనుమతించారు. అయితే హైదరాబాద్‌లో ఓ పరీక్ష కేంద్రంలో పరీక్ష నిర్వాహణలో అధికారులు నిర్లక్ష్యం వహించారు.
టీజీపీఎస్‌సీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ నియామకాల పరీక్షలో గందరగోళం నెలకొంది. ఉదయం 10గంటలకు ప్రారంభం కావాల్సిన పరీక్ష రెండున్నర గంటల తర్వాత కూడా ప్రారంభం కాలేదు. దీంతో హాస్టల్ వెల్ఫేర్ పరీక్ష రాయడానికి వచ్చిన అభ్యర్థులు అయోమయానికి గురైన ఘటన హైదరాబాద్‌లోని మాతృశ్రీ ఇంజినీరింగ్ కళాశాలలో చోటు చేసుకుంది.
హైదరాబాద్ పాతబస్తీ సైదాబాద్‌లోని మాతృశ్రీ ఇంజినీరింగ్ కళాశాలలో, టీజీపీఎస్‌సీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పరీక్షకు ఏర్పాట్లు చేశారు. అందుకోసం రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి వచ్చారు. అయితే పరీక్షల సమయం దగ్గరపడినా, టీజీపీఎస్‌సీ అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించలేదు. పైగా పరీక్షలు నిర్వహించకపోవడానికి కారణాలపై యజమాన్యం సరైన రీతిలో స్పంచలేదు.
పరీక్షలు ఇంకా ప్రారంభం కాకపోవడంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన అభ్యర్థుల తల్లిదండ్రులు బంధువులు పరీక్షా కేంద్రం వెలుపల ఆందోళన చేపట్టారు. వీరికి మద్దతుగా బీజేపీ యువమోర్చా నాయకులు ధర్నా చేశారు. పోలీసులు అక్కడకు చేరుకుని బీజేపీ యువ మోర్చా నాయకులను అదుపులోకి తీసుకున్నారు. వారిని సైదాబాద్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అయితే, పరీక్ష ప్రారంభం కాకపోవడానికి సాంకేతిక సమస్య కారణంగా తెలుస్తుంది. టీజీపీఎస్‌సీ తరపున పరీక్ష నిర్వహించాలి. టీసీఎస్ సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలస్తోంది.
రేవంత్ రెడ్డి ఇంటి ముందు గురుకుల అభ్యర్థులు - న్యాయం చేయాలంటూ మెకాళ్లపై నిరసన - Gurukul Teachers Protest in Hyd
ఆన్‌లైన్ విధానంలో నిర్వహించాల్సిన పరీక్షకు ఒకరోజు ముందుగానే పరీక్షా కేంద్రంలో కంప్యూటర్లను సిద్ధం చేయాల్సి ఉంది. కానీ టీసీఎస్ మాత్రం పరీక్ష నిర్వహించే సోమవారం ఉదయం కేంద్రానికి వచ్చి ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. అయితే, టీసీఎస్ తీసుకు వచ్చిన కంప్యూటర్లు సైతం పని చేయలేదు. దీంతో అభ్యర్థుల ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న అధికారులు ఈ కేంద్రంలోని పరీక్షను రీ షెడ్యూల్ చేశారు. ఈ మేరకు సంస్థ వెబ్సైట్లో సమాచారాన్ని పొందుపరిచారు.
హాస్టల్ వెల్ఫేర్ పరీక్ష రాయడానికి వచ్చిన అభ్యర్థులు మాత్రం ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్వహించే పరీక్షల్లో ఇంతలా నిర్లక్ష్యం వహిస్తున్నా అధికారులు మెుద్దు నిద్ర విడటం లేదని ఆరోపిస్తున్నారు. నిర్లక్ష్యానికి కారణమైన కాలేజి యజమాన్యంతో పాటుగా, టీసీఎస్ సంస్థపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ పరీక్ష కోసం గత సంవత్సరం నుంచి ప్రిపేయిర్ అవుతున్నామని తెలిపారు.
గ్రూప్-1 మెయిన్స్ 1:100 ప్రకటించేలా ప్రభుత్వం ఒత్తిడి తేవాలి - హరీశ్‌రావుకు వినతిపత్రం - Group1 candidates plea to harishrao