ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఏఆర్‌ డెయిరీ' నెయ్యి వెనుక విస్తుపోయే నిజాలు - అసలు మూలాలు ఉత్తరాఖండ్‌లో! - AR DAIRY GHEE SUPPLY CHAIN - AR DAIRY GHEE SUPPLY CHAIN

ఏఆర్‌ డెయిరీ కల్తీ నెయ్యి సరఫరా గొలుసును ఛేదించిన వాణిజ్య పన్నుల శాఖ

ar_dairy_ghee_supply_chain_to_ttd
ar_dairy_ghee_supply_chain_to_ttd (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 5, 2024, 1:20 PM IST

Commercial Taxes Department Cracks Ghee Supply Chain to Prove AR Dairy :తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏఆర్‌ డెయిరీ కల్తీ నెయ్యి సరఫరా చేసిందని నిరూపించేలా నెయ్యి సరఫరా గొలుసును వాణిజ్య పన్నుల శాఖ ఛేదించింది. దిండిగల్‌లోని ఏఆర్‌ డెయిరీ ఎక్కడ నుంచి నెయ్యి సేకరించింది? ఎంత ధరకు సేకరించింది? ఏఆర్‌ డెయిరీకి నెయ్యి సరఫరా చేసిన వైష్ణవి డెయిరీ ఎక్కడి నుంచి, ఎంత ధరకు నెయ్యి కొనుగోలు చేసింది, ఇలా మొత్తం సరఫరా గొలుసును బయటపెట్టింది. అసలు ఈ మూలాలు ఎక్కడో ఉత్తరాఖండ్‌లో భోలేబాబా ఆర్గానిక్‌ డెయిరీ మిల్క్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వద్ద తేలాయి. నెయ్యి సరఫరా ఇన్‌వాయిస్‌లు, ఈ- వేబిల్లులు, ట్యాంకర్లు ఏయే టోల్‌ప్లాజాను ఎప్పుడు, ఎలా దాటాయన్న వివరాలన్నింటినీ వాణిజ్యపన్నులశాఖ ఆధారాలతో సహా సమీకరించి ఒక రహస్య నివేదికను తిరుమల తిరుపతి దేవస్థానానికి సమర్పించింది. ఇందులో బయటపడ్డ అంశాలివీ.

ar_dairy_ghee_supply_chain_to_ttd (ETV Bharat)
  • తిరుమల తిరుపతి దేవస్థానంతో ఒప్పందం కుదుర్చుకున్న ఏఆర్‌ డెయిరీ తిరుపతి సమీపంలోని పునబాకలోని వైష్ణవి డెయిరీ నుంచి నెయ్యి కొనుగోలు చేసింది.
  • వైష్ణవి డెయిరీ జూన్, జులై నెలల్లో ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని భోలేబాబా ఆర్గానిక్‌ డెయిరీ నుంచి లక్షల కేజీల నెయ్యి కొనుగోలు చేసింది.
  • వాణిజ్య పన్నుల శాఖ తనిఖీలు చేసి ఇందుకు సంబంధించిన మొత్తం బిల్లులు, రవాణా అంశాలు, ఆధారాలు సేకరించి సమగ్ర నివేదికలో పొందుపరిచింది.
  • మొత్తం 5 ట్యాంకర్లలో 8 ట్రిప్పులుగా నెయ్యి తిరుమల తిరుపతి దేవస్థానానికి సరఫరా అయింది.
  • అందులో ఒక ట్యాంకరు 3 ట్రిప్పులు నెయ్యి అసలు ఏఆర్‌ డెయిరీకి వెళ్లకుండానే అక్కడికి పంపినట్లుగా రికార్డుల్లో నమోదు చేశారు. నేరుగా తితిదేకు ఆ నెయ్యి సరఫరా చేశారు.
  • మరో 4 ట్యాంకర్లు ఏకంగా రెండు మార్గాల్లో పునబాక నుంచి వందల కిలోమీటర్లు ప్రయాణించి దిండిగల్‌లోని ఏఆర్‌ డెయిరీకి వెళ్లాయి. మళ్లీ అక్కడి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చి నెయ్యి సరఫరా చేశాయి.
  • ఏ ట్యాంకరు దిండిగల్‌ ఎలా వెళ్లిందీ, ఎన్ని టోల్‌ప్లాజాలు ఎప్పుడు దాటింది, ఎప్పుడు తిరిగి వచ్చిందీ అన్న కథాక్రమం ఈ నివేదికలో ఉంది.
  • ఏ ట్యాంకరు అసలు దిండిగల్‌ వెళ్లలేదు, ఏ టోల్‌ప్లాజాలో ఆ వాహనం వెళ్లినట్లు నమోదు కాలేదో కూడా తేల్చారు. ఏఆర్‌ డెయిరీ మోసం చేసినట్లు ఈ వ్యవహారంలో బయటపడింది.
  • వైష్ణవి డెయిరీ భోలేబాబా ఆర్గానిక్‌ డెయిరీ నుంచి ఈ ఏడాది జూన్, జులై నెలల్లో ఎంత మొత్తం నెయ్యి కొనుగోలు చేసిందో ఇన్‌వాయిస్‌ నంబర్లు, ఈ- వేబిల్లులతో సహా వెల్లడించింది.
  • ఈ ఆధారాలన్నింటితో కల్తీ నెయ్యి వ్యవహారంలో గూడుపుఠాణీ అంతా బయటపడింది.
ar_dairy_ghee_supply_chain_to_ttd (ETV Bharat)

దిండిగల్‌ వెళ్లకుండానే నేరుగా టీటీడీకు నెయ్యి సరఫరా..

(ఒక ట్యాంకరు.. మూడు ట్రిప్పులు)

  • ఏపీ26టీసీ 4779 నంబరు కలిగిన నెయ్యి ట్యాంకరు ఈ ఏడాది జూన్‌ 2న సాయంత్రం 6.35 గంటలకు ఈ- వేబిల్లు నంబర్‌ 101870273115తో పునబాకలోని శ్రీ వైష్ణవి డెయిరీ స్పెషాలిటీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నుంచి దిండిగల్‌లోని ఏఆర్‌ డెయిరీ ఫుడ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు బయల్దేరినట్లు రికార్డుల్లో చూపించారు. అదే నంబరు కలిగిన వాహనం జూన్‌ 4న సాయంత్రం 6.20 గంటలకు ఈ- వేబిల్లు నంబర్‌ 501660212634తో దిండిగల్‌లోని ఏఆర్‌ డెయిరీ ఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నుంచి బయల్దేరి తిరుమల తిరుపతి దేవస్థానానికి చేరినట్లు దస్త్రాల్లో పొందుపరిచారు. కానీ ఈ ట్యాంకరు ఈ మధ్యలో ఏ టోల్‌ప్లాజానూ దాటలేదు.
  • జూన్‌ 16న సాయంత్రం 7.05 గంటలకు పునబాకలోని శ్రీ వైష్ణవి డెయిరీ నుంచి ఈ-వే బిల్లు నంబర్‌ 171878859934తో ఏపీ26 టీసీ 4779 నంబరు కలిగిన నెయ్యి ట్యాంకరు దిండిగల్‌లోని ఏఆర్‌ డెయిరీ ఫుడ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు బయల్దేరినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. ఈ వాహనం జూన్‌ 19న ఉదయం 10.49 గంటలకు దిండిగల్‌లోని ఏఆర్‌ డెయిరీ ఫుడ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నుంచి తితిదేకు బయల్దేరినట్లు చూపించారు. అయితే ఆయా తేదీల్లో ఈ వాహనం అటు పునబాక నుంచి దిండిగల్‌కు, దిండిగల్‌ నుంచి తిరుపతికి వచ్చినట్లు ఆ మార్గాల్లోని టోల్‌ప్లాజాల్లో ఎక్కడ కూడా నమోదు కాలేదు. ఆయా మార్గాల్లోని టోల్‌ప్లాజాల మీదుగా ఆయా తేదీల్లో అసలు ఆ వాహనమే వెళ్లలేదు. దీన్ని బట్టి దిండిగల్‌లోని శ్రీ వైష్ణవి డెయిరీ నుంచే నేరుగా టీటీడీకే నెయ్యి సరఫరా జరిగినట్లు ఆధారాలతో వెల్లడైంది.
  • పునబాక వైష్ణవి డెయిరీ నుంచి ఏపీ26టీసీ4779 ట్యాంకరు (ఈ- వేబిల్లు నంబరు 151889406707) జులై 2న రాత్రి 18.22కు బయలుదేరింది. అది ఏఆర్‌ డెయిరీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరున డెలివరీ చేస్తున్నట్లు అందులో నమోదయింది. ఈ ట్యాంకరు దిండిగల్‌ వెళ్లలేదు. జులై 4న ఇదే ట్యాంకరు (ఈ- వేబిల్లు నంబరు 511673446306) ఏఆర్‌ డెయిరీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నుంచి బయలుదేరినట్లు చూపారు. ఆ రోజు మధ్యాహ్నం 3.22 గంటలకు ఈ- వేబిల్లు ఇచ్చినట్లు నమోదైంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ ట్యాంకరు నెయ్యిని డెలివరీ చేయాలని అందులో వివరాలు నమోదై ఉన్నాయి. దిండిగల్‌ ఏఆర్‌ డెయిరీకి ఆ ట్యాంకరును పంపినట్లు, మళ్లీ దుండిగల్‌ ఏఆర్‌ డెయిరీ నుంచి బయలుదేరినట్లు ఈ బిల్లులో నమోదైనా ఆ ట్యాంకరు ఏ టోల్‌ప్లాజానూ దాటలేదు. నేరుగా తిరుమల దేవస్థానంలో నెయ్యి డెలివరీ చేసినట్లు గుర్తించారు.

దిండిగల్‌ వెళ్లి అక్కడి నుంచి టీటీడీకు ఇలా ట్యాంకర్ల సరఫరా...

(మొత్తం 4 వాహనాలు - 5 ట్రిప్పులు)

  • టీఎన్‌02బీఏ9459 నంబరు గల ట్యాంకరు వాహనం 2024 జూన్‌ 30న (ఈ- వేబిల్లు 10188806516) సాయంత్రం 4.03 గంటలకు పునబాకలోని వైష్ణవి డెయిరీ నుంచి బయలుదేరింది. ఆ వాహనం తిరుమల సమీపంలోని గాదంకి టోల్‌ప్లాజాను అదే రోజు రాత్రి 7.36 గంటలకు దాటింది. జులై 2న సాయంత్రం 5.42 గంటలకు దిండిగల్‌ సమీపంలోని వెలియన్‌చెట్టియార్‌ టోల్‌ప్లాజాను దాటింది. తిరిగి అదే వాహనం (ఈ- వేబిల్లు నంబరు 551672752826) దిండిగల్‌ ఏఆర్‌ డెయిరీ నుంచి జులై 3న ఉదయం 9.18 గంటలకు బయలుదేరింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా చేయాలని అందులో రాసి ఉంది. ఆ ట్యాంకరు దిండిగల్‌ సమీపంలోని వెలియన్‌చెట్టియార్‌ టోల్‌ప్లాజాను జులై 3న ఉదయం 11.30 గంటలకు దాటి తిరుపతి సమీపంలోని గాదంకి¨ టోల్‌ప్లాజాను జులై 4న మధ్యాహ్నం 12.12 గంటలకు దాటింది.
  • టీఎన్‌02బీబీ2151 నంబరు గల ట్యాంకరు (ఈ- వేబిల్లు నంబరు 121892090824) జులై 6న సాయంత్రం 5.17 గంటలకు వే బిల్లు తీసుకుని పునబాకలోని శ్రీ వైష్ణవి డెయిరీ నుంచి బయలుదేరింది. వాహనంలోని నెయ్యిని దిండిగల్‌లోని ఏఆర్‌ డెయిరీకి సరఫరా చేయాలని అందులో నమోదై ఉంది. ఆ ట్యాంకరు తిరుపతి సమీపంలోని ఎస్‌.వి.పురం టోల్‌ప్లాజాను జులై 7న ఉదయం 6.50 గంటలకు, దిండిగల్‌ సమీపంలోని వెలియన్‌చెట్టియార్‌ టోల్‌ప్లాజాను జులై 9న ఉదయం 9.51 గంటలకు దాటింది.ఇదే వాహనం జులై 9న (ఈ- వేబిల్లు నంబరు 531675293694) ఏఆర్‌ డెయిరీలో ఉదయం 11.54 గంటలకు బయలుదేరి వెలాన్‌చెట్టియార్‌ టోల్‌ప్లాజాను సాయంత్రం 5.10 గంటలకు దాటింది. ఈ ట్యాంకరు తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి డెలివరీ చేయాలని ఆ బిల్లులో రాసి ఉంది. ఆ వాహనం తిరుపతి సమీపంలోని గాదంకి టోల్‌ప్లాజాను జులై 10న రాత్రి 7.06కు దాటింది.
  • ఇలాగే టీఎన్‌02బిబి2070 నంబరు గల నెయ్యి ట్యాంకరు, టీఎన్‌02 బీఏ 9459 నంబరు కలిగిన ట్యాంకర్లు ఎప్పుడు ఏయే టోల్‌ ప్లాజాలను దాటుకుంటూ తిరుపతి చేరుకున్నాయో కూడా నివేదికలో వివరంగా పేర్కొన్నారు.
  • వైష్ణవి డెయిరీ నుంచి కొనుగోలు చేసిన నెయ్యిని ఏఆర్‌ డెయిరీ తితిదేకు సరఫరా చేసినట్లు వాణిజ్య పన్నుల శాఖ సేకరించిన ఆధారాలతో ఒక నివేదికను తితిదేకు సమర్పించింది. అందులో ఆయా నెయ్యి ట్యాంకర్లు ఎప్పుడెప్పుడు ఏయే టోల్‌ప్లాజాలు దాటాయో వివరాలు పేర్కొంది.
  • టీఎన్‌02బీఏ9459 నంబరు గల ట్యాంకరు వాహనం 2024 జూన్‌ 30న (ఈ- వేబిల్లు 10188806516) సాయంత్రం 4.03 గంటలకు పునబాకలోని వైష్ణవి డెయిరీ నుంచి బయలుదేరింది. ఆ వాహనం తిరుమల సమీపంలోని గాదంకి టోల్‌ప్లాజాను అదే రోజు రాత్రి 7.36 గంటలకు దాటింది. జులై 2న సాయంత్రం 5.42 గంటలకు దిండిగల్‌ సమీపంలోని వెలియన్‌చెట్టియార్‌ టోల్‌ప్లాజాను దాటింది. తిరిగి అదే వాహనం (ఈ- వేబిల్లు నంబరు 551672752826) దిండిగల్‌ ఏఆర్‌ డెయిరీ నుంచి జులై 3న ఉదయం 9.18 గంటలకు బయలుదేరింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా చేయాలని అందులో రాసి ఉంది. ఆ ట్యాంకరు దిండిగల్‌ సమీపంలోని వెలియన్‌చెట్టియార్‌ టోల్‌ప్లాజాను జులై 3న ఉదయం 11.30 గంటలకు దాటి తిరుపతి సమీపంలోని గాదంకి టోల్‌ప్లాజాను జులై 4న మధ్యాహ్నం 12.12 గంటలకు దాటింది.
  • టీఎన్‌02బీబీ2151 నంబరు గల ట్యాంకరు (ఈ- వేబిల్లు నంబరు 121892090824) జులై 6న సాయంత్రం 5.17 గంటలకు వే బిల్లు తీసుకుని పునబాకలోని శ్రీ వైష్ణవి డెయిరీ నుంచి బయలుదేరింది. వాహనంలోని నెయ్యిని దిండిగల్‌లోని ఏఆర్‌ డెయిరీకి సరఫరా చేయాలని అందులో నమోదై ఉంది. ఆ ట్యాంకరు తిరుపతి సమీపంలోని ఎస్‌.వి.పురం టోల్‌ప్లాజాను జులై 7న ఉదయం 6.50 గంటలకు, దిండిగల్‌ సమీపంలోని వెలియన్‌చెట్టియార్‌ టోల్‌ప్లాజాను జులై 9న ఉదయం 9.51 గంటలకు దాటింది.
  • ఇదే వాహనం జులై 9న (ఈ- వేబిల్లు నంబరు 531675293694) ఏఆర్‌ డెయిరీలో ఉదయం 11.54 గంటలకు బయలుదేరి వెలాన్‌చెట్టియార్‌ టోల్‌ప్లాజాను సాయంత్రం 5.10 గంటలకు దాటింది. ఈ ట్యాంకరు తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి డెలివరీ చేయాలని ఆ బిల్లులో రాసి ఉంది. ఆ వాహనం తిరుపతి సమీపంలోని గాదంకి టోల్‌ప్లాజాను జులై 10న రాత్రి 7.06 గంటలకు దాటినట్లు గుర్తించారు.
  • టీఎన్‌02బిబి2070 నంబరు గల ట్యాంకరు (ఈ- వేబిల్లు నంబరు 101892484117) తిరుపతి సమీపంలోని పునబాక వైష్ణవి డెయిరీలో జులై 7న సాయంత్రం 4.59 గంటలకు బిల్లు తీసుకుని బయలుదేరింది. దుండిగల్‌లోని ఏఆర్‌ డెయిరీలో ఆ సరకు డెలివరీ చేయాలని బిల్లులో నమోదై ఉంది. ఆ ట్యాంకరు మహాసముద్రం టోల్‌ప్లాజాను జులై 8న ఉదయం 11.05 గంటలకు, వెలియన్‌చెట్టియార్‌ టోల్‌ప్లాజాను జులై 9న ఉదయం 9.51 గంటలకు దాటింది.
  • అదే వాహనం (ఈ- వేబిల్లు నంబరు 591675309379) దిండిగల్‌లోని ఏఆర్‌ డెయిరీ నుంచి జులై 9న మధ్యాహ్నం 12.18 గంటలకు బిల్లు తీసుకుని బయలుదేరింది. తితిదేకు నెయ్యి డెలివరీ చేయాలని బిల్లులో రాసి ఉంది. వెలాన్‌చెట్టియార్‌ టోల్‌ప్లాజాను అదే రోజు సాయంత్రం దాటింది. జులై 10న రాత్రి 7.06 గంటలకు గడంకి టోల్‌ప్లాజాను దాటింది.
  • టీఎన్‌02 బీఏ 9459 నంబరు కలిగిన నెయ్యి ట్యాంకరు.. ఈ ఏడాది జూన్‌ 9న సాయంత్రం 4.52 గంటలకు పునబాకలో శ్రీ వైష్ణవ డెయిరీ నుంచి దిండిగిల్‌లోని ఏఆర్‌ డెయిరీకి బయల్దేరింది. ఈ- వేబిల్లు నంబర్‌ 181874403767 కలిగిన ఈ ట్యాంకరు 10వ తేదీ రాత్రి 8.10 గంటలకు కృష్ణ్ణగిరి తోపూరు ఎల్‌అండ్‌టీ టోల్‌ప్లాజాను, 11వ తేదీ అర్ధరాత్రి 12.22 గంటలకు వెలియన్‌చెట్టియార్‌ టోల్‌ప్లాజాను దాటి వెళ్లింది.
  • ఇదే వాహనం ఈ- వేబిల్లు నంబర్‌-521662911920తో 11వ తేదీ ఉదయం 12.17 గంటలకు దిండిగల్‌లోని ఏఆర్‌ డెయిరీ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి బయల్దేరింది. వెలియన్‌చెట్టియార్‌ టోల్‌ప్లాజాను సాయంత్రం 5.10 గంటలకు, గాదంకి టోల్‌ప్లాజాను 12వ తేదీ ఉదయం 10.13 గంటలకు దాటింది.
  • జూన్‌ 25న రాత్రి 7.18 గంటలకు పునబాకలోని శ్రీ వైష్ణవి డెయిరీ నుంచి టీఎన్‌02 బీఏ 9549 నంబరు కలిగిన నెయ్యి ట్యాంకరు... దిండిగల్‌లోని ఏఆర్‌ డెయిరీకి బయల్దేరింది. 26న సాయంత్రం 6.47 గంటలకు కృష్ణగిరి తోపూరు ఎల్‌అండ్‌టీ టోల్‌ప్లాజాను, 27న ఉదయం 6.23 గంటలకు వెలియన్‌చెట్టియార్‌ టోల్‌ప్లాజాను దాటింది.
  • ఇదే వాహనం జూన్‌ 27న ఉదయం 10.59 గంటలకు దిండిగల్‌లోని ఏఆర్‌ డెయిరీ నుంచి తితిదేకు బయల్దేరింది. 27వ తేదీ మధ్యాహ్నం 1.25 నిమిషాలకు వెలియన్‌చెట్టియార్‌ టోల్‌ప్లాజాను, 28వ తేదీ సాయంత్రం 4.05 గంటలకు గాదంకి టోల్‌ప్లాజాను దాటింది.
  • దీన్ని బట్టి వైష్ణవి డెయిరీ నుంచి కొనుగోలు చేసిన నెయ్యిని ఏఆర్‌ డెయిరీ తితిదేకు సరఫరా చేసినట్లు స్పష్టంగా తేలిపోయింది.

ఉత్తరాఖండ్‌ నుంచి వైష్ణవి డెయిరీకి నెయ్యి ఇలా వచ్చింది!

టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన ఏఆర్‌ డెయిరీ తిరుపతి సమీపంలోని పునబాక వైష్ణవి డెయిరీ నుంచి నెయ్యి కొనుగోలు చేసింది. ఆ వైష్ణవి డెయిరీ ఎక్కడో ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని భోలేబాబా ఆర్గానిక్‌ డెయిరీ నుంచి నెయ్యి కొన్నట్లు వాణిజ్య పన్నుల శాఖ పరిశోధనలో తేలింది. బిల్లులు, ఈ- వే బిల్లులు, ఏ తేదీల్లో ఎంత నెయ్యి ఉత్తరాఖండ్‌ నుంచి కొన్నారో, ఆ ధర ఎంతో కూడా ఆధారాలతో సహా నివేదికలో పొందుపరిచింది.

సుప్రీం ధర్మాసనం మరో కేసులో బిజీ - తిరుమల లడ్డూ వివాదంపై శుక్రవారం విచారణ - SUPREME COURT ON TTD LADDU ROW

'కనీసం దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచాలి' - తిరుమల కల్తీ నెయ్యిపై సుప్రీం ఘాటు వ్యాఖ్యలు - SC on Tirumala Laddu Adulteration

ABOUT THE AUTHOR

...view details