కౌంటింగ్ కేంద్రాల పరిశీలన (ETV Bharat) Counting Centre Arrangements:ఎన్నికల వేళ హింసాత్మక ఘటనల దృష్ట్యా, ఓట్ల లెక్కింపు రోజున పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. కౌటింగ్ జరిగే ప్రదేశాలను కలెక్టర్లు, పోలీసు అధికారులు పరిశీలించారు. ఎవరైనా చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే కొరడా ఝుళిపిస్తామంటూ, వివిధ ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించారు.
పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కాకాని వద్దనున్న జేఎన్డీయూ కళాశాలను జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ బాలాజీ లఠ్కర్, ఎస్పీ మలికా గార్గ్ సందర్శించారు. కళాశాలలో జూన్ 4న చేపట్టే ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను పరిశీంచారు. కౌంటింగ్ టేబుళ్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్యాం ప్రసాద్, రిటర్నింగ్ అధికారి రమణ కాంత్ రెడ్డి పాల్గొన్నారు.
నరసరావుపేటలోని పల్నాడు బస్టాండ్ సెంటర్లో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. అనుకోని ఘటనలు చోటు చేసుకుంటే పోలీసులు ఎలాంటి చర్యలు చేపడతారో మాక్‌డ్రిల్ ద్వారా వివరించారు. ఎన్నికల రోజున, ఆ తర్వాత జరిగిన గొడవల దృష్ట్యా కౌంటింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. ఎవరైనా చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జూన్ నెల 4న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో కమలాపురం నియోజకవర్గ కౌంటింగ్ కు సంబంధించిన బందోబస్త్ ఏర్పాట్లపై పోలీస్ అధికారులతో ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ఎవరు, ఎక్కడ విధులు నిర్వహించాలో దిశానిర్దేశం చేశారు. కౌంటింగ్ నేపథ్యంలో జూన్ నెల 1 నుంచి 6 వరకూ ఎలాంటి ఊరేగింపులు, విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని ఎస్పీ తెలిపారు. ఎవరైనా శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఎన్నికల అనంతరం హింస - బదిలీ అయిన వారి స్థానాల్లో కొత్తవారు నియామకం - 5 Dsps 3 Inspectors
గుడివాడలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. కౌంటింగ్ సమీపిస్తున్న వేళ పోలీసులు తీసుకుంటున్న ముందస్తు చర్యలలో భాగంగా పట్టణంలోని గుడ్ మెన్ పేట, వాంబే కాలనీల్లో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. సోదాల్లో 5 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కౌంటింగ్ ముందు తర్వాత కూడా నిబంధనల ప్రకారం వ్యవహరించాలని స్థానికులకు పోలీసులు సూచనలు చేశారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం తారకరామ నగర్‌లో ఏసీపీ మురళీ మోహన్, సీఐ కిషోర్ బాబు ఆధ్వర్యంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించిన సరైన పత్రాలు లేని వాహనాలను పోలీసులు భారీగా స్వాధీనం చేసుకున్నారు.
ప్రకాశం జిల్లా కనిగిరి బస్టాండ్ కూడలిలో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. అల్లర్లకు పాల్పడుతున్న వారిని చెదరగొట్టడం, లాఠీ ఛార్జ్‌లో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించడం వంటివి కళ్లకు కట్టినట్టు ప్రదర్శించారు. జూన్ 4వ తేదీన హింసలకు పాల్పడినా, ప్రేరేపించినా కఠిన చర్యలు తప్పవని పోలీసు అధికారులు హెచ్చరించారు. నందిగామ డీవీఆర్ కాలనీలో 5వందల ఇళ్లలో పోలీసులు సోదాలు చేశారు. సరైన పత్రాలు లేని 22 ఆటోలు, 27 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పదంగా ఉన్న 72మందికి ఐరిష్ పరీక్షలు నిర్వహించారు.
సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు సంకెళ్లు - పోలీసుల తీరుపై విమర్శలు - handcuffs to software engineer
జూన్ 4న కడపలో నిర్వహించే కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సమర్థంగా ఎదుర్కొంటామని పోలీసులు తెలిపారు. పొరపాటున గొడవలు జరిగితే ఏవిధంగా కట్టడి చేయాలనే దానిపై స్పెషల్ పార్టీ పోలీసులతో కడప కృష్ణా సర్కిల్‌లో మాక్ డ్రిల్ నిర్వహించారు. పోలింగ్ సందర్భంగా కడప గౌస్ నగర్‌లో రెండు పార్టీల మధ్య ఘర్షణ జరిగింది. కౌంటింగ్ రోజు కూడా అల్లర్లు జరుగుతాయనే నిఘా వర్గాల సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.