ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గిరిజన కాఫీ ఘుమఘుమలు అదుర్స్​ - ఒక్కసారి రుచి చూడాల్సిందే! - TRIBAL COFFEE MAKING

గెడ్డంపుట్టులో కాఫీ పొడి తయారీ పరిశీలించిన జిల్లా కలెక్టర్‌ దినేష్‌కుమార్

TRIBAL_COFFEE_MAKING
TRIBAL_COFFEE_MAKING (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 18, 2024, 10:13 AM IST

Collector Dinesh Kumar Visited Coffee Manufacturing Plant : గిరిజన కాఫీ ఘుమఘుమలు అద్భుతంగా ఉన్నాయని అల్లూరి సీతారామరాజు కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం ( అక్టోబర్​ 17న) గెడ్డంపుట్టు గ్రామంలోని మన్య తోరణం రైతు ఉత్పత్తిదారుల కాఫీ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను సందర్శించారు. కాఫీ పండ్లు సేకరణ, పల్పింగ్, క్యూరింగ్, రోస్టింగ్, గ్రైండింగ్, కాఫీ పొడి తయారీ చూసి నిర్వాహకులను కలెక్టర్​ అభినందించారు.

కాఫీ మార్కెటింగ్‌ విస్తరణకు మంచి అవకాశాలు ఉన్నాయని కలెక్టర్​ దినేష్​ కుమార్​ పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో గిరిజన కాఫీని ప్రమోట్‌ చేయడానికి 50 మంది గిరిజన యువకులకు శిక్షణ అందించాలని తెలియజేశారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలను బలోపేతం చేస్తామని పేర్కొన్నారు.

ఐదేళ్లలో కాఫీ సాగు విస్తృతం- కార్యాచరణ సిద్ధం - Expand Coffee Cultivation

ఏటా పర్యటక వారోత్సవాలు : రానున్న పర్యటక సీజన్‌లో ముఖ్యమైన సందర్శక ప్రాంతాల్లో పర్యటక వారోత్సవాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ ఆదేశించారు. ఇతర రాష్ట్రాల ఏజెన్సీలో గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, వివిధ వస్తువుల అమ్మకాల స్టాల్స్, వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. డిసెంబర్‌ మొదటి వారంలో అరకు ఫెస్టివల్‌ నిర్వహణకు సీఎంకి ప్రతిపాదనలు సమర్పించాలని కోరారు. గురువారం కలెక్టర్‌ ఛాంబర్‌లో కలెక్టర్‌ అధ్యక్షతన జరిగిన జిల్లా టూరిజం కౌన్సిల్‌ సమావేశంలో ఆయన పాల్గొని ముచ్చటించారు. పాడేరు డివిజన్​లో 10, రంపచోడవరంలో 5 ముఖ్యమైన పర్యటక కేంద్రాలు గుర్తించాలని తెలియజేశారు. అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

"అరకు కాఫీ" అదుర్స్ - రైతుల కష్టాలకు చెక్ పెట్టిన టెకీ నిర్ణయం

ప్రైవేట్‌ వాహనాల దందాకు చెక్‌ :గుడిసె, కటిక జలపాతం తదితర పర్యటక ప్రాంతాలకు సొంత వాహనాలను అనుమతించకుండా ప్రైవేటు వాహనదారులు అధిక ఛార్జుల వసూళ్లు చేస్తున్నారని కలెక్టర్​ పేర్కొన్నారు. దీనిని కట్టడి చేయాలని తెలియజేశారు. అక్కడ నిర్ణీత రుసుమును ప్రకటించి, ఆ మొత్తానికే పర్యటకులను తీసుకువెళ్లేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అరకు కాఫీపై మోదీ మరోసారి ప్రశంసలు- మరోసారి కలిసి రుచి చూద్దామన్న చంద్రబాబు - PM Modi About Araku Coffee

ABOUT THE AUTHOR

...view details