CM Revanth Response on Tukkuguda Meeting : తుక్కుగూడలో శనివారం జరిగిన కాంగ్రెస్ జన జాతర సభకు అనూహ్య స్పందన వచ్చిందని, మహా సముద్రంలా కార్యకర్తలు తరలివచ్చారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఓ మహా సముద్రం అని, కార్యకర్తలు నీటి బిందువులు కాదు, పేదల బంధువులని నిన్నటి తుక్కుగూడ జన జాతర సభపై(Tukkuguda Jana Jatara Sabha) సీఎం రేవంత్ ట్విటర్ వేదికగా స్పందించారు.
తమ కార్యకర్తలు జెండా మోసే బోయీలు మాత్రమే కాదని, ఎజెండాలు నిర్ణయించే నాయకులని చెప్పుకొచ్చారు. వారు త్యాగశీలులు, తెగించి కొట్లాడే వీరులని తెలిపారు. పోరాడే సైనికులు వారే, పోటెత్తే కెరటాలు వారేనన్నారు. శనివారం తుక్కుగూడ గడ్డపై పోటెత్తిన కాంగ్రెస్ మహా సముద్రపు కెరటాలు చెప్పిన నిజమిది, చేసిన శబ్ధమిదంటూ కార్యకర్తలను కొనియాడారు.
Congress Leaders Fires on BRS, BJP :రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో శనివారం జరిగిన జన జాతర సభలోకేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. కార్పొరేట్ సంస్థలకు రూ.16 లక్షల కోట్లు రుణమాఫీ చేసిన మోదీ, రైతులకు రుణమాఫీ చేయలేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కుల గణన(Caste Enumeration) చేపడతామని, జనాభా ఆధారంగా రిజర్వేషన్లు పెంచుతామని వెల్లడించారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్, కిషన్ రెడ్డి వైఖరులపై మండిపడ్డారు.