CM Revanth on Gulf Board : రాష్ట్రంలో 15 లక్షల కుటుంబాలు గల్ఫ్ ఉపాధిపై ఆధారపడి ఉన్నాయని సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth) పేర్కొన్నారు. గల్ఫ్ కార్మికులకు ఆదుకునేందుకు రాష్ట్రప్రభుత్వం సెప్టెంబర్ 17 లోగా ప్రత్యేక కార్యాచరణతో, తెలంగాణ గల్ఫ్ ఓవర్సీస్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు పెట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. గల్ఫ్ కార్మికుల సహాయార్థం ప్రజాభవన్‌లో(Praja bhavan) ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేస్తామన్నారు. 24గంటలు పనిచేసే ఓ టోల్ ఫ్రీ నంబరు ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేసే వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు.
కేరళలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన - రెండ్రోజుల పాటు లోక్సభ ఎన్నికల ప్రచారం - lok sabha election 2024
ఉపాధి కోసం వెళ్లిన వారి వేతనాలు, బాగోగులు కూడా ప్రభుత్వం చూసుకోవాలని, కొన్ని దేశాలు, రాష్ట్రాలు అవలంభిస్తున్న విధానంపై అధ్యయనం చేస్తున్నట్లు సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఏజెంట్ల బారిన పడి కొందరు, యాజమాన్యం చేతిలో మరికొందరు కార్మికులు ఇబ్బంది పడుతున్నారని, ఫిలిప్పీన్, కేరళ విదేశీ విధానాలను స్పష్టంగా అధ్యయనం చేశామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
CM REVANTH MEET GULF TRADERS : కార్మికుల హక్కులు కాపాడేందుకు ఫిలిప్పిన్స్ ఆ దేశమే, ఇతర దేశాల వ్యవస్థలతో మాట్లాడుతోందని, ఆ తరహాలో తెలంగాణ ప్రభుత్వం కూడా సమగ్ర విధానం రూపొందిస్తుందని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. రైతుబీమా తరహాలో గల్ఫ్ కార్మికులు చనిపోతే రూ.5 లక్షలు ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించినట్లు పేర్కొన్నారు. గల్ఫ్ ఏజెంట్లకు చట్టబద్ధత ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. గల్ఫ్ కార్మికులకు వారం రోజుల పాటు శిక్షణ కూడా ఇచ్చేలా వ్యవస్థ ఉండేలా చూస్తామన్నారు.