CM Revanth Reddy Speech Today :కార్యకర్తల శ్రమ వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) పేర్కొన్నారు. కార్యకర్తల కష్టం వల్లే ఈరోజు తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డి ఉన్నాడని స్పష్టం చేశారు. తనకు పదవి, హోదా కాంగ్రెస్ కార్యకర్తలు ఇచ్చినవేనని రేవంత్ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ(Rahul Gandhi) పాదయాత్రతోనే కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, త్యాగమంటే నెహ్రూ కుటుంబానిదేనని, ఇందిరా గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించారని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం పనితీరు దేశానికి ఆదర్శం కావాలి: ఖర్గే
దేశంలో 18 ఏళ్ల యువత ఓటు వేస్తున్నారంటే, దానికి కారణం రాజీవ్‌గాంధేనని, సంక్షోభంలో ఉన్న దేశానికి స్థిరత్వాన్ని తెచ్చింది సోనియాగాంధీ(Sonia Gandhi) అని రేవంత్ పేర్కొన్నారు. ప్రధాని, రాష్ట్రపతి పదవులు వచ్చినా సోనియా గాంధీ తీసుకోలేదని రేవంత్ తెలిపారు. 2004లో ప్రధాని కావాలంటే రాహుల్‌కు ఒక లెక్క కాదని, గాంధీ కుటుంబానికి సొంత ఇళ్లు కూడా లేదని రేవంత్ తెలిపారు. సొంత ఇళ్లు కూడా లేనివాళ్లకు అవినీతి చేయాల్సిన అవసరం ఏంటని రేవంత్ పేర్కొన్నారు.
Congress Booth Level Meeting LB Stadium : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 50 రోజులైనా కాలేదని, హామీల అమలు ఎక్కడ అంటూ బీఆర్‌ఎస్(BRS) నేతలు అడుగుతున్నారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పామని, ఫిబ్రవరి మొదటి వారంలో మరో 2 హామీలు అమలు చేస్తామని రేవంత్ స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేశారా? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
తెలంగాణను పునర్నిర్మించే మేస్త్రీని:ఫిబ్రవరి ఆఖరి వరకు రైతు భరోసా(Raithu Bharosa) ద్వారా నగదు అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తాను మేస్త్రీనేనని, తెలంగాణను పునర్నిర్మించే మేస్త్రీనని రేవంత్ పేర్కొన్నారు. బలహీన వర్గాలకు రాజ్యాధికారం కాంగ్రెస్ ఇచ్చిందని, అవినీతిపరులను, కోటీశ్వరులను కేసీఆర్ రాజ్యసభకు పంపించారని విమర్శించారు. బలహీన వర్గాల బిడ్డ మందుల సామెల్‌కు కాంగ్రెస్ టికెట్ ఇచ్చిందని, రైతు బిడ్డనైన తాను కాంగ్రెస్‌లో సీఎం అయ్యానన్నారు. కాంగ్రెస్‌లో అందరికీ అవకాశాలు ఉంటాయని రేవంత్ తెలిపారు.
వారంలో 3 రోజులు మీ మధ్యకు వస్తా:రాష్ట్రంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికలు అత్యంత కీలకమని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. రాహుల్ న్యాయయాత్రకు అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. రాహుల్‌ను ప్రధానమంత్రిని చేయడానికి మీరు సిద్ధమా? అని కాంగ్రెస్ శ్రేణులను అడిగారు. రాహుల్‌గాంధీని ప్రధానిని చేయడానికి అందరం కష్టపడాలని, వారంలో 3 రోజులు రేవంతన్నగా మీ మధ్యకు వస్తానని తెలిపారు. 17 పార్లమెంట్ స్థానాల్లో సభలు పెట్టనున్నట్లు స్పష్టం చేశారు.
"బీఆర్‌ఎస్ పాలనలో ఆర్ధిక విధ్వంసం సృష్టించారు. అవును నేను మేస్త్రీనే, తెలంగాణను పునర్నిర్మించే మేస్త్రీని. కేసీఆర్ కాచుకో, బీఆర్ఎస్‌ను వంద మీటర్ల గొయ్యి తీసి బొందపెడతా. అభ్యర్థులను మారిస్తే గెలిచేవాళ్లమని కేటీఆర్ అంటున్నారు, మార్చాల్సింది అభ్యర్థులను కాదు కేసీఆర్ కుటుంబాన్ని. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను తరిమికొడదాం". - రేవంత్‌రెడ్డి, ముఖ్యమంత్రి
అవును నేను మేస్త్రీనే- తెలంగాణను పునర్నిర్మించే మేస్త్రీని సీఎం రేవంత్‌రెడ్డి మూసీని అద్భుతంగా అభివృద్ధి చేసి చూపిస్తాం : మంత్రి శ్రీధర్ బాబు