తెలంగాణ

telangana

ETV Bharat / state

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సీఎం సమీక్ష - రిజర్వేషన్లపై చర్చ - LOCAL BODY ELECTIONS IN TELANGANA

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష - రిజర్వేషన్లపై చర్చ

CM Revanth Reddy on Local Body Elections
CM Revanth Reddy on Local Body Elections (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 12, 2025, 3:37 PM IST

CM Revanth Reddy on Local Body Elections :స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కమాండ్ కంట్రోల్‌ సెంటర్‌లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్లపై చర్చ జరుగుతోంది.

సర్పంచి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులకు రిజర్వేషన్లపై చర్చించనున్నట్లు సమాచారం. బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ సమర్పించిన నివేదికపై సమీక్షించనున్నట్లు తెలుస్తోంది.

బీసీలకు రిజర్వేషన్లు : సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 50శాతం సీలింగ్ పరిధిలో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ పోగా మిగిలినవి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని కమిషన్ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. జనాభా ప్రకారం ఇంకా ఎక్కువ ఇవ్వాల్సి వస్తే కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని పేర్కొన్నట్లు సమాచారం. రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన ఇతర అంశాలు సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. జిల్లా యంత్రాంగాన్ని స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లకు శిక్షణ ఇవ్వనున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల కసరత్తు వేగం - ఇవాళ ఆ పదవులకు రిజర్వేషన్లపై చర్చ?

ABOUT THE AUTHOR

...view details