CM Revanth Reddy Paid Tribute to D Srinivas : కాంగ్రెస్ పార్టీకి డి.శ్రీనివాస్ ఎంతో సేవ చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. నిజామాబాద్‌లో డీఎస్ భౌతికకాయానికి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. ఆయన కుటుంబసభ్యులకు సంతాపం ప్రకటించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన పార్టీకి డీఎస్ చేసిన సేవలను స్మరించుకున్నారు.
డీఎస్ మృతి కాంగ్రెస్‌కు పార్టీకి తీరని లోటని రేవంత్ రెడ్డి అన్నారు. 2004, 2009లో పార్టీ అధికారంలోకి వచ్చేందుకు పీసీసీ అధ్యక్షుడిగా ఆయన ఎంతో కృషి చేశారని కొనియాడారు. విద్యార్థి నాయకుడి స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగారని, కొంత కాలం పార్టీకి దూరమైనా పార్లమెంట్‌లో డీఎస్‌ను సోనియాగాంధీ ఆప్యాయంగా పలకరించేవారని రేవంత్ తెలిపారు.
తనకు పదవులపై ఎప్పుడూ ఆశలేదని డీఎస్ చెప్పేవారని, చనిపోయినప్పుడు కాంగ్రెస్ జెండా కప్పాలనేది ఆయన కోరిక అని రేవంత్ చెప్పారు. అందుకే ఆయన మరణవార్త తెలిసిన వెంటనే డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్ బాబులు ఇంటికి వెళ్లి పార్థివ దేహం మీద కాంగ్రెస్ జెండా కప్పి ఆయన చివరి కోరిక నెరవేర్చేలా చేశామని వెల్లడించారు. కుటుంబసభ్యులతో చర్చించి డీఎస్ జ్ఞాపకార్థం ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత డీఎస్ కన్నుమూత- పలువురు నాయకుల సంతాపం - tributes to dharmapuri srinivas
డీఎస్ కారణంగా అనేక మంది నాయకులు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారని తెలిపారు. ఆయన వల్లే నిజామాబాద్ నుంచి బలహీనవర్గాల వారికి అవకాశం వచ్చిందన్నారు. సోనియా, రాహుల్ గాంధీలు నివాళులు అర్పించాలని ప్రత్యేకంగా చెప్పారని రేవంత్ వెల్లడించారు. పార్టీలో లేకపోయినా డీఎస్ మనవాడు అని సోనియా గాంధీ అన్నారని రేవంత్ తెలిపారు. ఏమైనా పదవి ఆశిస్తున్నారా అని అడిగితే, తనకు పదవుల మీద వ్యామోహం లేదని డీఎస్ చెప్పారని గుర్తుచేసుకున్నారు.
‘డీఎస్ మృతి కాంగ్రెస్‌కు తీరని లోటు. 2004, 2009లో పార్టీ అధికారంలోకి వచ్చేందుకు పీసీసీ అధ్యక్షుడిగా ఆయన ఎంతో కృషి చేశారు. విద్యార్థి నాయకుడి స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. కొంతకాలం పార్టీకి దూరమైనా పార్లమెంట్‌లో డీఎస్‌ను సోనియాగాంధీ ఆప్యాయంగా పలకరించేవారు. పదవులపై ఎప్పుడూ ఆశలేదని ఆయన చెప్పేవారు. చనిపోయినప్పుడు కాంగ్రెస్ జెండా కప్పాలనేది డీఎస్ కోరిక. అందుకే ముఖ్యనాయకులను పంపి ఆ కోరిక తీర్చాం. కుటుంబసభ్యులతో చర్చించి డీఎస్ జ్ఞాపకార్థం ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటాం’- రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి
అధికార లాంఛనాలతో: నిజామాబాద్‌లో ప్రభుత్వ లాంఛనాలతో డీఎస్‌కు అంత్యక్రియలు నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇంటి నుంచి ప్రారంభమైన డీఎస్ అంతిమయాత్ర ప్రగతినగర్‌లోని నివాసం నుంచి కంఠేశ్వర్, బైపాస్ రోడ్డు మీదుగా సాగింది. బైపాస్ రోడ్డులోని వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలకు డీఎస్ అంత్యక్రియలు జరగనున్నాయి.
ప్రభుత్వ లాంఛనాలతో నేడు డీఎస్ అంత్యక్రియలు - హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి - CONGRESS LEADER DS LAST RITES