CM Revanth Reddy on Kedar Death in Dubai :కేటీఆర్ వ్యాపార భాగస్వామి టాలీవుడ్ ప్రొడ్యూసర్ కేదార్, కాళేశ్వరంపై పిటిషన్ వేసిన రాజలింగమూర్తి, కేసు వాదించిన సంజీవ రెడ్డి అనుమానస్పద మృతులపై ఆయన ఎందుకు స్పందించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేటీఆర్ వ్యాపార భాగస్వామి కేదార్ దుబాయ్లో అనుమానాస్పదంగా చనిపోయారని, ఆయన ర్యాడిసన్బ్లూ డ్రగ్స్ కేసులో కీలక నిందితుడని తెలిపారు.
ఇప్పుడు ఏం మాట్లాడాలని అనుకోవడం లేదు :కాళేశ్వరంపై పిటిషన్ వేసిన రాజలింగమూర్తి హత్యకు గురయ్యారని, ఆ కేసు వాదించిన సంజీవ రెడ్డి అనుమానస్పదంగా మృతి చెందారని అన్నారు. అనుమానాస్పద మరణాలపై జ్యుడిషియల్ విచారణ ఎందుకు కోరట్లేదని ప్రశ్నించారు. కాళేశ్వరం సహా ప్రాజెక్టుల అక్రమాలపై, ప్రాజెక్టులపై సాంకేతిక నివేదికలు రాకుండా ఏమీ మాట్లాడను సీఎం అన్నారు.
కేదార్ మృతి :టాలీవుడ్ ప్రొడ్యూసర్ కేదార్ మృతి చెందాడు. దుబాయ్లో జరుగుతున్న ఈవెంట్లో పాల్గొనేందుకు కేదార్ అక్కడకు వెళ్లారు. మంగళవారం అతను చనిపోయినట్లు దుబాయ్ అధికారులు తెలిపారు. గతంలో ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన గం గం గణేశా మూవీకి ప్రొడ్యూసర్గా వ్యవహరించారు.