తెలంగాణ

telangana

తెలంగాణకు 65 శాతం ఆదాయం జంట నగరాల నుంచే : సీఎం రేవంత్​ రెడ్డి - tg CM Inaugurate Gopanpally Flyover

By ETV Bharat Telangana Team

Published : Jul 20, 2024, 3:36 PM IST

Updated : Jul 20, 2024, 5:58 PM IST

Gopanpally Thanda Flyover Inauguration : హైదరాబాద్​కు ఎవరు వచ్చినా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు. దేశం నలుమూలల నుంచి ఎవరొచ్చినా ఆహ్వానిస్తున్నామని అన్నారు. హైదరాబాద్​ శివారు ప్రాంతమైన గోపనపల్లి ఫ్లైఓవర్​ను సీఎం రేవంత్​ రెడ్డి ప్రారంభించారు.

Gopanpally Thanda Flyover Inauguration
Gopanpally Thanda Flyover Inauguration (ETV Bharat)

CM Revanth Inaugurate Gopanpally Flyover : తెలంగాణకు 65 శాతం ఆదాయం జంట నగరాల నుంచే వస్తోందని సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు. హైదరాబాద్​కు ఎవరు వచ్చినా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. దేశం నలుమూలల నుంచి ఎవరొచ్చినా అక్కున చేర్చుకుంటున్నామన్నారు. హైదరాబాద్​లోని గోపనపల్లి ఫ్లై ఓవర్​ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్​ పాల్గొన్నారు. పై వంతెనను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం జెండా ఊపి ఫ్లైఓవర్​ పైకి ఉమెన్​ బైకర్స్​ను సీఎం రేవంత్​ రెడ్డి అనుమతించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మహేందర్​ రెడ్డి, ఎమ్మెల్యే గాంధీ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్​ రెడ్డి మాట్లాడుతూ, "గోపనపల్లి ఫ్లైఓవర్​ ద్వారా శేరిలింగంపల్లి అభివృద్ది చెందుతుంది. మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ప్రభుత్వానిది. హైదరాబాద్​ అభివృద్ధికి హైడ్రా అనే వ్యవస్థను తీసుకువస్తున్నాం. చిన్న వర్షం పడినా మన కాలనీలు మురికి కాల్వలు అయిపోతున్నాయి. మూసీని అభివృద్ధి చేసే బాధ్యత మాది. ఐదేళ్లలో రూ.1.50 లక్షల కోట్లతో మూసీని అభివృద్ధి చేస్తాం". అని వెల్లడించారు.

ప్రపంచ పర్యాటకులు వచ్చే విధంగా మూసీ అభివృద్ధి : వైఎస్సార్​ హయాంలో హైదరాబాద్​కు కృష్ణా, గోదావరి జలాలు తీసుకువచ్చామని సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు. గోపనపల్లిలో ఎకరం రూ.100 కోట్లు పలుకుతోందని అన్నారు. గోపనపల్లికి వచ్చిన ఐటీ, ఫార్మా సంస్థల వల్ల భూమి ధర పెరిగిందని వివరించారు. మూసీ అంటే ముక్కు మూసుకునే పరిస్థితి వచ్చిందని ఆవేదన చెందారు. ప్రపంచ పర్యాటకులు మూసీకి వచ్చే విధంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. మూసీని చూస్తే ప్రజా ప్రభుత్వం గుర్తుకు వచ్చేలా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. హైదరాబాద్​ను విశ్వనగరంగా చేయడానికి మీ సహకారం కావాలని కోరారు. ఔటర్​ రింగ్​రోడ్డు, రీజినల్​ రింగ్​రోడ్డు మధ్య సెమి అర్బన్​ను తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్​ రెడ్డి హామీ ఇచ్చారు.

"ఈ ప్రాంతంలో అవసరం కోసం అవసరమైన ఏ నిధులను ఆపకుండా పూర్తిస్థాయిలో ఎక్కడికక్కడ వేగంగా మీకు నిధులిస్తున్నాం. ఈ ప్రాంతం అభివృద్ధిని ప్రభుత్వం తీసుకుంటుంది. మన నగరానికి తలమానికం మూసీ నది. అలాంటి మూసీ నది మురికి కూపంగా మారి, ప్రపంచంలో ఉన్న చెత్త మొత్తం మూసీ నదిలో వేసే పరిస్థితి ఉంది. కాల్వలు, నాలాలు కబ్జా పెట్టుకుని మూసీ వైపు వెళ్లాల్సిన నీళ్లను మనం ఎక్కడికక్కడ కబ్జాలతో అడ్డుకోవడంతో ఈరోజు మన కాలనీలు అన్నీ చిన్న వర్షం పడినా జలమయం అయిపోతున్నాయి."- రేవంత్​ రెడ్డి, సీఎం

ఐటీ ఉద్యోగులకు తీరనున్న ట్రాఫిక్​ కష్టాలు - నేడు సీఎం చేతులమీదుగా గోపన్​పల్లి ఫ్లైఓవర్​ ప్రారంభం - CM to Inaugurate Gopanpally Flyover

సీఎంకు దిల్లీ చక్కర్లు, బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ తిరగడమే తెలుసు - ప్రజలు అవసరం లేదు : కేటీఆర్​ - ktr tweet Gopanpally flyover issue

Last Updated : Jul 20, 2024, 5:58 PM IST

ABOUT THE AUTHOR

...view details