మనవడితో హోలీ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి CM Revanth Reddy Holi Celebrations 2024 : రాష్ట్రంలో హోలీ సంబురాలు అంబరాన్నంటాయి. చిన్నా, పెద్దా రంగులు చల్లుకుంటూ పండుగను వేడుకలా చేసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం హైదరాబాద్‌లోని తన నివాసంలో హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. భార్య గీతారెడ్డితో కలిసి మనవడు రేయాన్స్‌పై రంగులు చల్లుతూ ఉత్సాహంగా గడిపారు. తాత ఒళ్లో కూర్చుని రేయాన్స్ చిరునవ్వులు చిందించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సీఎం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘పరిపాలన, రాజకీయం, విజ్ఞప్తులు, పరిష్కారాలు, సమావేశాలు, తీరిక లేని షెడ్యూల్ అన్నింటికీ కొంచెం విరామం. హోలీ నాడు మనవడితో ఆటవిడుపు’ అంటూ తన పోస్టులో రాసుకొచ్చారు.
ప్రముఖుల రంగుల పండుగ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ప్రముఖులు సైతం హోలీ సంబురాలు ఘనంగా చేసుకున్నారు. స్థానికులతో కలిసి రంగులు చల్లుకుని ఉత్సాహంగా గడిపారు. సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలోని నివాసంలో మాజీ మంత్రి మల్లారెడ్డి చిన్నారులతో కలిసి రంగులు చల్లుకుంటూ సంతోషంగా గడిపారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని ఓ బస్తీలో చిన్నారులతో కలిసి చిక్కడపల్లి పోలీసులు సరదాగా హోలీ ఆడుకున్నారు.
తెలంగాణలో హోలీ సంబురం - ఈ పండుగ ప్రత్యేకత ఏంటో తెలుసా?
కరీంనగర్‌లో భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ సంబురాల్లో ఉల్లాసంగా పాల్గొన్నారు. ఉదయం సతీమణితో కలిసి హోలీ జరుపుకున్న బండి సంజయ్, అభిమానులు, కార్యకర్తలు, నాయకులకు రంగులు పూసి శుభాకాంక్షలు తెలిపారు. హనుమకొండలో పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నివాసంలో కుటుంబ సభ్యులు, సన్నిహితులతో సంబురాలు జరుపుకున్నారు. నిర్మల్ ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఎస్పీ జానకి షర్మిల, ఏఎస్పీ కాంతిలాల్ పటేల్ సిబ్బందితో కలిసి రంగులు చల్లుకున్నారు. డీజే పాటలకు సిబ్బంది లయబద్దంగా నృత్యాలు చేసి సందడి చేశారు. రామగుండం సీపీ శ్రీనివాస్, పోలీస్ ఉన్నతాధికారులు, సిబ్బందితో హోలీ ఆడారు.
రంగుల్లో మునిగితేలిన 'భారత్'- ముల్తాన్ మట్టితో యూత్ 'హోలీ'- జుహూ బీచ్‌లో రెయిన్ డ్యాన్స్!
కరీంనగర్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో హోలీ సంబురాలు హోరెత్తాయి. కలెక్టర్ పమేలా సత్పతి ఉద్యోగులతో కలిసి హోలీని ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. కుటుంబసభ్యులు, ఉద్యోగులతో కలిసి నృత్యాలు చేశారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా హోలీ పండుగ సంబురాలు అంబరాన్ని తాకాయి. పండుగను సంతోషకర వాతావరణంలో సురక్షితంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ గౌస్ ఆలం పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా నాగాయపల్లి తండాలో గిరిజన, బంజారాలతో కలిసి ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సంబురాలు ఉత్సాహంగా చేసుకున్నారు. జగిత్యాల జిల్లావ్యాప్తంగా హోలీ జోష్ కన్పించింది. జిల్లా ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ వేడుకల్లో పాల్గొని నృత్యాలు చేశారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వేడుకలు ఉత్సహంగా జరపుకుని ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఆ కలర్స్‌తో డేంజర్- హోలీ ఆడే ముందు, తర్వాత ఇలా చేయడం మస్ట్! - Pre And Post Holi Care Tips